DailyDose

TNI నేటి నేర వార్తలు

TNI  నేటి నేర వార్తలు

*అదనపు కట్నం తీసుకురావాలని అత్తింటి వారి వేధింపులు తాళలేని ఓ మహిళ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన బేగంపేటలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని మౌలాలి హెచ్‌బీకాలనీకి చెందిన పొశెట్టి కుమార్తె శిరీష(23)తో బేగంపేటలోని బాలంరాయి సమీపంలోని అంబేడ్కర్‌నగర్‌కు చెందిన ఏకేటి శివకు ఈ ఏడాది మార్చి 27న వివాహం జరిగింది. కట్నంగా ఆరు తులాల బంగారం, ద్విచక్రవాహనానికి నగదు ఇచ్చారు. వీటికి తోడు మరో రూ.5 లక్షల నగదును కట్నంగా కొద్ది నెలల తర్వాత ఇస్తామని ఒప్పందం కుదుర్చుకున్నారు. నగదు ఇవ్వడంలో అలస్యం కావడంతో అత్తింటి వారు వేఽధింపులకు గురి చేశారు. భరించలేని శిరీష ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషయాన్ని శివ బందువు రవి ఫోన్‌ చేసి శిరీష తల్లిదండ్రులకు తెలిపారు. అల్లుడు ఏకేటి శివ, మామ ఈశ్వర్‌, అత్త శాంతబాయి వేధింపుల వల్లే తమ కుమార్తె ఆత్మహత్య చేసుకుందని శిరీష తల్లిదండ్రులు బేగంపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
*మేడ్చల్ పోలీస్ స్టేషన్ (Medchal Police Station) పరిధిలో అనుమానాస్పద మృతదేహం లభ్యమైంది. 100 డైల్ కాల్ ద్వారా మేడ్చల్ పోలీసులు సమాచారం అందుకున్నారు. రైల్వే కాలనీ, మేడ్చల్ రోడ్డు వద్ద నగ్నంగా ఉన్న మృత దేహం పడి ఉంది. మృతుడి ఛాతీపై గాయాలయ్యాయి. ప్రాథమిక దర్యాప్తులో మృతుడు బర్మాజీ గూడకు చెందిన జింకల వెంకటేశ్ ( 28) గా గుర్తించారు. కేసు నమోదు చేసుకొని మేడ్చల్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
*అదనపు కట్నం తీసుకురావాలని అత్తింటి వారి వేధింపులు తాళలేని ఓ మహిళ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన బేగంపేటలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని మౌలాలి హెచ్‌బీకాలనీకి చెందిన పొశెట్టి కుమార్తె శిరీష(23)తో బేగంపేటలోని బాలంరాయి సమీపంలోని అంబేడ్కర్‌నగర్‌కు చెందిన ఏకేటి శివకు ఈ ఏడాది మార్చి 27న వివాహం జరిగింది. కట్నంగా ఆరు తులాల బంగారం, ద్విచక్రవాహనానికి నగదు ఇచ్చారు. వీటికి తోడు మరో రూ.5 లక్షల నగదును కట్నంగా కొద్ది నెలల తర్వాత ఇస్తామని ఒప్పందం కుదుర్చుకున్నారు. నగదు ఇవ్వడంలో అలస్యం కావడంతో అత్తింటి వారు వేఽధింపులకు గురి చేశారు. భరించలేని శిరీష ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషయాన్ని శివ బందువు రవి ఫోన్‌ చేసి శిరీష తల్లిదండ్రులకు తెలిపారు. అల్లుడు ఏకేటి శివ, మామ ఈశ్వర్‌, అత్త శాంతబాయి వేధింపుల వల్లే తమ కుమార్తె ఆత్మహత్య చేసుకుందని శిరీష తల్లిదండ్రులు బేగంపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
*ర్ణాటకలో మంగళూరులో కుక్కర్‌బాంబు పేలుడు సంచలనం రేకెత్తించింది. శనివారం సాయంత్రం కంకనాడి పోలీసుస్టేషన్‌ పరిధిలో గరోడి వద్ద ఆటోలో కుక్కర్‌ బాంబు పేలింది. తొలుత ప్రమాదమని భావించినా, దర్యాప్తులో ఉగ్రవాద కుట్రగా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. శివమొగ్గ పోలీసులు గాలిస్తున్న షారిక్‌ (23) అనే వ్యక్తి ఈ పేలుడు జరిపినట్లుగా అనుమానిస్తున్నారు. మధ్యాహ్నం వరకు ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై మంగళూరులో పర్యటించారు. ఆయన వెనుదిరిగాక సాయంత్రం బాంబు పేలుడు జరిగింది. కొంతకాలంగా మైసూరులో తలదాచుకున్న షారిక్‌ అక్కడే బాంబును తయారు చేసి ఉంటాడని పోలీసు వర్గాలు భావిస్తున్నాయి.
*అదుపుతప్పి బోల్తాపడిన బస్సును ఆర్మీజవాన్లు చేతులతోనే ఎత్తిన ఘటన జమ్మూకశ్మీరులోని(Jammu kashmer) శ్రీనగర్‌లో వెలుగుచూసింది. ప్రమాదవశాత్తూ బోల్తా పడిన బస్సును క్రేన్ రాక కోసం ఎదురుచూడకుండా భారతసైనికులే(Army Rescues) ముందుకువచ్చి వారు చేతులతోనే బోల్తా పడిన బస్సును(Overturned Bus) ఎత్తేశారు. క్రేన్(Crane) సహాయం లేకుండానే బస్సును ఎత్తివేశారు. బస్సును ఎత్తిన సైనికులకు స్థానికులు కూడా సహాయం చేశారు. ఆర్మీ జవాన్లు బస్సును చేతులతో ఎత్తిన ఘటన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
*తమిళనాడు (Tamilnadu)లోని శివకాశిలో (Sivakasi) కొలువైన భద్రకాళి అమ్మన్ (Bathirakali amman) ఆలయ గోపురంలో భారీ అగ్నిప్రమాదం (Fire accident) చోటుచేసుకుంది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో రెండు అగ్నిమాపక శకటాలు హుటాహుటిన రంగప్రవేశం చేసి మంటలను అదుపులోకి తెచ్చాయి. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. గోపుర పునరుద్ధరణ పనులు జరుగుతుండగా ప్రమాదం సంభవించినట్టు చెబుతున్నారు. ప్రమాదాన్ని వెంటనే గమనించిన తమిళనాడు ఫైర్ అండ్ రెస్క్యూ సిబ్బంది 45 నిమిషాల్లో మంటలను అదుపు చేశారు. స్పెషల్ టాస్క్ ఫోర్స్ అధికారి (శివకాశి) ఆర్.అళగురాజ్ సారథ్యంలో అగ్నిమాపక సిబ్బంది టవర్ లోపల మెట్లగుండా పైకి చేరుకుని మంటలు ఆర్పివేశారు. ఆలయ సమీపంలో ఒక కార్యక్రమం కోసం బాణసంచా కాల్చడం ఈ ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉన్నాయి.
*రోడ్డు ప్రమాదం అనంతరం ఆర్టీసీ బస్సు అరగంటకుపైగా కాలుపైనే ఉండిపోవడంతో బాధిత మహిళ నరక యాతన అనుభవించి ప్రాణాలు విడిచారు. నంద్యాల జిల్లా బేతంచెర్లలో ఆదివారం ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.
*హైదరాబాద్‌: నగరంలోని పాతబస్తీలో పెను ప్రమాదం తప్పింది. బహదూర్‌పురాలోని ఎన్‌ఎం గూడలో ఆగి ఉన్న ప్రైవేట్‌ బస్సుల్లో మంటలు చెలరేగాయి. మొదట ఓ బస్సులో మంటలు అంటుకున్నాయి. క్రమంగా అవి బస్సు మొత్తం వ్యాపించడంతోపాటు పక్కనే ఉన్న మరో బస్సుకు అంటుకున్నాయి. దీంతో రెండు బస్సులు కాలిబూడిదయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పివేశారు.
*కుమ్రం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలో పెద్దపులి కలకలం సృష్టిస్తున్నది. గతకొన్ని రోజులుగా జిల్లాలోని పలు గ్రామాల్లో సంచరిస్తున్న పులి.. తాజాగా బెజ్జూరు మండలంలో కుకుడా గ్రామంలో ఎద్దుపై దాడి చేసింది. దీంతో అది తీవ్రంగా గాయపడింది. సోమవారం తెల్లవారుజామున గుర్తించిన స్థానికులు అటవీ అధికారులకు సమాచారం అందించారు. పులి తిరుగుతుండటంతో సమీప గ్రామాల ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. వీలైనంత తొందరగా పులిని పట్టుకోవాలని అధికారులను కోరుతున్నారు. ఆదివారం బాబాసాగర్‌ ఏరియా కుంట వద్ద స్థానికులకు పులి కనిపించింది.
*కొత్తకోట మండలం లో తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ముమ్మళ్ళపల్లి జాతీయ రహదారి పై ట్రాక్టర్‎ను వెనుక నుంచి గరుడ బస్సు ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే దుర్మరణం చెందగా.. 40 మందికి ప్రయాణికులకు తీవ్రగాయాలయ్యాయి. స్థానికుల సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. గాయపడిన బాధితులను పోలీసులు అంబులెన్స్ లో వనపర్తి ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించారు. బస్సు హైదరాబాద్ నుండి బెంగుళూరు వైపు వెలుతుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. రోడ్డు ప్రమాదం వల్ల ముమ్మాళ్ళపల్లి నుండి అమడబాకుల వరకు జాతీయ రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ఘటన స్థలానికి చేరుకున్న ట్రాఫిక్ పోలీసులు(Traffic Police) ట్రాఫిక్‎ను క్లియర్ చేస్తున్నారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సివుంది.
*పెరూ(Peru) రాజధాని లిమాలోని విమానాశ్రయంలో ఊహించని ప్రమాదం చోటుచేసుకుంది. టేకాఫ్‌ తీసుకునేందుకు పరుగులు పెడుతోన్న ఓ విమానం.. అంతలోనే రన్‌వేపైకి వచ్చిన అగ్నిమాపక శకటాన్ని ఢీకొంది. ఈ ఘటనలో ఫైర్‌ ట్రక్కులోని ఇద్దరు అగ్నిమాపక సిబ్బంది మృతి చెందారు. మరోవైపు.. విమానం వెనుక భాగం దెబ్బతినడంతో పెద్దఎత్తున పొగలు వెలువడ్డాయి. అయితే.. ప్రయాణికులు, సిబ్బందికి ప్రాణాపాయం తప్పినట్లు అధికారులు తెలిపారు. శుక్రవారం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.
*నుగంచిప్రోలు గ్రామంలో విషాదం. మునేరు లో ఈత కోసం దిగిన నలుగురు విద్యార్థులు. వారిలో ఇద్దరు స్థానికులు సహాయంతో ఒడ్డుకు చేరగా మరో ఇద్దరు మున్నేరు గుంటలో ఇరకపోవడంతో జాలరు సహాయంతో ఒడ్డుకు చేర్చడంతో అప్పటికే మృతి చెందిన ఇద్దరు విద్యార్థులు . గార్డెన్ పార్టీకి వచ్చి ఇద్దరు విద్యార్థులు మృతి. శిలం నర్సిరెడ్డి (6 వ తరగతి) నీలం జస్వంత్ (4వ తరగతి) తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా మధిర మండలం మడిపల్లి గ్రామం చెందిన విద్యార్థులుసరస్వతీ విద్యాలయానికి చెందిన విద్యార్థులు.
* నకిలీ ఆధార్‌ కార్డుతో ఐదంతస్తుల భవనాన్ని అసలు యజమానికి తెలియకుండా విక్రయించారు. ఈ కేసులో కన్నబిడ్డే నిందితులకు సహకరించింది. ఎస్సార్‌నగర్‌ ఇన్‌స్పెక్టర్‌ సైదులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని సింగరాయకొండకు చెందిన సింగమ్మ(62)కు ముగ్గురు కుమార్తెలు. 45 ఏళ్ల కిందట నగరానికి వచ్చి స్థిరపడింది. వెంకటగిరి సమీపంలో స్థలం కొని జి+5 భవనాన్ని నిర్మించారు. ముగ్గురు కుమార్తెలకు పెళ్లిళ్లు అయ్యాయి. పెద్ద కుమార్తె కోటేశ్వరి(35) తల్లిదండ్రులుంటున్న భవనం పెంట్‌హౌస్‌లోనే ఉంటోంది. మిగిలిన పోర్షన్లను అద్దెకిచ్చారు. కరోనా సమయంలో సింగమ్మ ఆమె భర్త స్వగ్రామానికి వెళ్లారు. ఆ సమయంలో భవనంలో అద్దెకుంటున్న జి.యశ్వంత్‌ అనే వ్యక్తిని కోటేశ్వరి రూ.3లక్షలు అప్పు అడిగింది. అందుకు యశ్వంత్‌ తన మిత్రులైన చిన్నా, పాండు, గణేష్‌లతో కలిసి కోటేశ్వరి వద్ద ఉన్న ఆమె తల్లి సింగమ్మకు చెందిన ఇంటి పత్రాలను కుదువ పెట్టి రూ.10లక్షలు తీసుకున్నారు. అప్పుడే వారికి ఓ ఆలోచన వచ్చింది. పాండు అనే వ్యక్తి తన తల్లి జి.నాగరత్నమ్మ(58) ఆధార్‌ కార్డులో పేరును సింగమ్మగా మార్చారు. ఇంటిని సత్యనాగ దినకర్‌ అనే వ్యక్తికి విక్రయించారు. దినకర్‌ ఈ పత్రాల ఆధారంగా బ్యాంకుల వద్ద రూ.4.11 కోట్ల అప్పు తీసుకున్నారు. ఈ డబ్బును అందరూ పంచుకున్నారు. కోటేశ్వరికి రూ.13లక్షలు ఇచ్చారు. కిస్తీలు కట్టకపోవడంతో బ్యాంకు అధికారులు ఇంటికి వచ్చారు. ఊరు నుంచి వచ్చిన సింగమ్మకు విషయం తెలియడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. దర్యాప్తు జరిపిన పోలీసులు యశ్వంత్‌, బి.గణేష్‌, భానుప్రకాష్‌, సత్యనాగ దినకర్‌, జి.నాగరత్నమ్మ, చిన్నా, ఎల్‌.కోటేశ్వరి, పాండులపై కేసు నమోదు చేశారు. వీరిలో చిన్నా, కోటేశ్వరి, పాండు పరారీలో ఉన్నారు. మిగిలిన వారిని అరెస్టు చేశారు.
*సింగరాయకొండ హనుమాన్‌నగర్‌లో గురువారం రాత్రి చోటుచేసుకున్న వృద్ధ మహిళ హత్య, దోపిడీ ఘటనలో పోలీసులు పురోగతి సాధించినట్లు విశ్వసనీయ సమాచారం. దర్యాప్తులో పలు కీలక ఆధారాలు సేకరించిన ట్లు తెలుస్తోంది. హత్యకు పాల్పడిన నిందితులను కూడా ప్రాథమికంగా గుర్తించినట్లు సమాచారం. స్థానికంగా ఉండే యువకులే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలుస్తోంది. హత్య అనంతరం పాతసింగరాయకొండ రైల్వే గేటు వద్ద మద్యం సేవించిన వారే నింది తులని పోలీసులు ఒక నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం. నాలుగు బృందాలుగా ఏర్ప డిన పోలీసులు వారి కోసం ముమ్మర గాలింపు చేపట్టారు.
*స్టీల్‌ప్లాంట్‌ ఆర్‌ఎంహెచ్‌పీ (రా మెటీరియల్‌ హ్యాండ్లింగ్‌ ప్లాంట్‌)లో శనివారం అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో విభాగంలోని రెండు కన్వేయర్లు కొంతమేర దగ్ధమయ్యాయి. కర్మాగారంలోని సింటర్‌ ప్లాంట్‌-2 విభాగానికి రా మెటీరియల్‌ సరఫరా చేస్తుండగా సీవో 37ఏ కన్వేయర్‌కు కింద ఉండే పుల్లీషెల్‌ విడిపోవడంతో మంటలు చెలరేగి ఓఎస్‌ కన్వేయర్‌-1 వరకు వ్యాపించాయి. ఈ సంఘటనలో సీవో 37ఏ కన్వేయర్‌ సుమారు 80 మీటర్లు, ఓఎస్‌-1 కన్వేయర్‌ 40 మీటర్లు దగ్ధమైనట్టు తెలిసింది. సీఐఎ్‌సఎఫ్‌ సిబ్బంది మంటలను అదుపుచేశారు.
*కుమార్తె తొలి పుట్టినరోజును సొంతూరులో జరుపుకోవాలని పయనమైన కుటుంబాన్ని రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదంలో ముంచేసింది. వీరు ప్రయాణిస్తున్న కారు కల్వర్టును ఢీకొనడంతో దంపతులతోపాటు మరొకరు మరణించారు. ఇద్దరు చిన్నారులు తీవ్రగాయాలపాలయ్యారు. శ్రీసత్యసాయిజిల్లా కనగానపల్లి మండలం పర్వతదేవరపల్లి వద్ద శనివారం తెల్లవారుజామున జరిగిందీ ఘోరం. పోలీసులు తెలిపిన వివరాల మేరకు, తెలంగాణలోని వరంగల్‌ జిల్లాకు చెందిన అల్లంకు గోపీనాథ్‌(38) బెంగుళూరులో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. కూతురు హాసిని మొదటి పుట్టినరోజును సొంతూరులో జరుపుకొనేందుకు శనివారం తెల్లవారుజామున కారులో కుటుంబసమేతంగా వరంగల్‌కు బెంగళూరు నుంచి బయలుదేరారు. పర్వతదేవరపల్లి వద్ద కారు అదుపు తప్పి కల్వర్టును బలంగా ఢీకొట్టగా గోపీనాథ్‌, ఆయన భార్య రమ్యశ్రీ (32) అక్కడికక్కడే మృతిచెందారు. గోపీనాథ్‌ తల్లి తారకేశ్వరి (52), పిల్లలు సాహిత్‌, హాసిని తీవ్రంగా గాయపడ్డారు. వీరిని 108లో అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, అక్కడ తారకేశ్వరి మృతిచెందారు. చిన్నారుల పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.
*పోలీసులు కనుసన్నలోనే ఎంపీ అర్వింద్‌ నివాసంపై టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు దాడి చేశారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అరోపించారు. కేసీఆర్‌ కుటుంబానికి అహంకారం పెరిగిపోయిందని, అందుకే అకారణంగా దాడులు చేయిస్తోందని మండిపడ్డారు. బంజారాహిల్స్‌లోని ఎంపీ అర్వింద్‌ నివాసానికి శనివారం వచ్చిన ఆయన.. దాడి జరిగిన తీరు గుర్తించి అడిగి తెలుసుకున్నారు.
*రిజర్వేషన్‌ విషయంలో ప్రయాణికుల మధ్య తలెత్తి న వివాదం కారణంగా ధన్‌బాద్‌-అలెప్పీ బొకారో ఎక్స్‌ప్రెస్‌ శనివారం ఉదయం అనకాపల్లి జిల్లా ఎలమంచిలి మండలం రేగుపాలెం స్టేషన్‌ వద్ద రెండు గంటలపాటు నిలిచిపోయింది. తుని రైల్వే ఎస్‌ఐ అబ్దుల్‌ మారూఫ్‌ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పశ్చిమ బెంగాల్‌, ఛత్తీ్‌సఘఢ్‌, జార్ఖండ్‌ ప్రాంతాలకు చెందిన సుమారు 500 మంది రిజర్వేషన్‌ చేయించుకోకుండా ధన్‌బాద్‌-అలెప్పీ బొకారో ఎక్స్‌ప్రెస్‌ ఎక్కారు. వీరంతా పనుల కోసం విజయవాడ వైపు వెళుతున్నారు. ఈ రైలు శనివారం ఉదయం తొమ్మిదిన్నరకు అనకాపల్లి చేరుకుంది. అక్కడ ఆ బోగీలను రిజర్వ్‌ చేసుకున్న అయ్యప్ప భక్తులు వచ్చి తమ సీట్లలో కూర్చున్న వారిని ఖాళీ చేయాల్సిందిగా కోరారు
*సినీనటుడు, వైసీపీ నాయకుడు పోసాని కృష్ణమురళిపై తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో శనివారం కేసు నమోదైంది. ఈ ఏడాది అక్టోబరు 2వ తేదీ గాంధీ జయంతి రోజున జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌పై.. పోసాని సోషల్‌ మీడియా, ప్రచార మాధ్యమాల ద్వారా అనుచిత వ్యాఖ్యలు చేశారని రాజమహేంద్రవరం జనసేన వీర మహిళ యం దం ఇందిర గతంలో వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదుచేశారు. పోలీసులు కేసు న మోదు చేయకపోవడంతో ఆమె రాజమహేంద్రవరం రెండో జెఎ్‌ఫసీఎం కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాలతో పోలీసులు పోసానిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
*బహుజన సమాజ్‌ పార్టీ (బీఎస్పీ) జాతీయ అధ్యక్షురాలు మాయావతిపై ఇటీవల అనుచిత వ్యాఖ్యలు చేసిన ప్రవచన కర్త గరికపాటి నరసింహారావుపై చర్యలు తీసుకోవాలంటూ ఆ పార్టీ నాయకులు అన్నమయ్య జిల్లా మదనపల్లె వన్‌టౌన్‌ పోలీసులకు శనివారం ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా బీఎస్పీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బందెల గౌతమ్‌కుమార్‌ మాట్లాడుతూ.. మనువాదానికి నిలువెత్తు రూపం గరికపాటి దుష్ప్రవచనాలని విమర్శించారు. మనుస్మృతిలో శూద్రులను, అతి శూద్రులను, మహిళలను అవమానించి వేధించిన స్ఫూర్తితో సామాజిక ఫాసిస్టు బోధనలు చేస్తున్నారని ఆరోపించారు. కుల దురహంకారంతో బహుజనులైన బీసీలు, ఎస్సీలను టీవీల్లో, బహిరంగ వేదికలపై అవమానించేలా దుష్ప్రవచనాలు చేస్తున్నారని మండిపడ్డారు..
*పూణే- బెంగళూరు జాతీయ రహదారిపై నేవల్ వంతెన వద్ద ఆదివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వస్తున్న ఓ ట్యాంకర్ వాహనాలపై దూసుకెళ్లడంతో 48 కార్లు దెబ్బతిన్నాయి. ఈ పెద్ద రోడ్డు ప్రమాదంలో(Road Accident) 30 మంది గాయపడ్డారు.మహారాష్ట్రలోని(Maharashtra) పూణె అగ్నిమాపక దళం, పూణే మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీల రెస్క్యూ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి.(Rescue Operation)హైవేపై వేగంగా వస్తున్న ట్యాంకర్ బ్రేకులు ఫెయిల్ అయి పలు కార్లను ఢీ కొట్టింది.ఈ ప్రమాదంలో రోడ్డుపై ట్యాంకర్ నుంచి ఆయిల్ కింద పడటంతో పలు కార్లు జారి ప్రమాదానికి గురయ్యాయి.ఈ ప్రమాదంతతో ముంబయి వెళ్లే రహదారిపై 2 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించి పోయింది.
*అది అనంతగిరి ఘాట్‌ రోడ్డు. ఆదివారం కావడంతో జాతరలకు వెళ్లే జనం.. పర్యాటకులతో అక్కడంతా సందడిగా ఉంది. ఇంతలో ఓ ఆర్టీసీ బస్సు కొండపై నియంత్రణ కోల్పోయింది. ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి రోడ్డు కిందకు దిగి రెండు పల్టీలు కొట్టింది. ప్రమాదంలో బస్సు మీద పడటంతో ఓ మహిళ అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. ఇద్దరు మహిళల పరిస్థితి విషమంగా ఉంది. వికారాబాద్‌ నుంచి ధారూరు మెథడిస్టు జాతరకు ఆదివారం ఉదయం ఆర్టీసీ స్పెషల్‌ బస్సు బయలుదేరింది. అనంతగిరి ఘాట్‌ రోడ్డులో బస్సు బ్రేకులు ఫెయిలయ్యా యి. అప్రమత్తమైన డ్రైవర్‌ కాసేపు బస్సును ఆపేశాడు. అనంతరం మళ్లీ స్టార్ట్‌ చేసి ముందుకు పోనిచ్చాడు. ఈ క్రమంలో అనంతగిరి నుంచి కేరెళ్లి వెళ్లే చివరి ఘాట్‌ వద్ద ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోగా బస్సు బోల్తా పడింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న సికింద్రాబాద్‌ రసూల్‌పురలోని ఇందిరమ్మనగర్‌కు చెందిన స్వరూప(37) అక్కడికక్కడే మృతి చెందింది. ఇద్దరు మహిళల పరిస్థితి విషమంగా ఉండటంతో వికారాబాద్‌ ప్రభుత్వాస్పత్రికి, మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌ తీసుకెళ్లారు. 25 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో బస్సులో 72 మంది ఉన్నట్లు కండక్టర్‌ తెలిపారు. ముప్పును పసిగట్టి బస్సులో నుంచి దూకిన నలుగురికి స్వల్ప గాయాలయ్యాయి. డ్రైవర్‌ కొండపై బస్సు ఆపి బ్రేకులు ఫెయిలయ్యాయని చెప్పాడని, అయినా ముందుకు పోనివ్వడం వల్లే ప్రమాదం జరిగిందని క్షతగాత్రులు చెబుతున్నారు.