DailyDose

TNI నేటి తాజా వార్తలు

TNI  నేటి తాజా  వార్తలు

*గుడివాడలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మాజీ మంత్రి కొడాలి నాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన టీడీపీ అధినేత చంద్రబాబుపై వ్యంగ్యాస్త్రాలు విసిరారు. 2024 ఎన్నికల తర్వాత ఇదేం ఖర్మ రా బాబు అని చంద్రబాబు, లోకేష్ అనుకుంటారన్నారు. సినిమా షూటింగ్‌ల మాదిరి చంద్రబాబు జిల్లా పర్యటనలు జరుగుతున్నాయన్నారు. చంద్రబాబు పర్యటనలకు ముందుగానే పార్టీ కార్యకర్తలను తరలిస్తున్నారన్నారు. టీడీపీ కార్యకర్తలను, ప్రజలుగా భావిస్తూ చంద్రబాబు అభివాదాలు చేస్తున్నారని కొడాలి నాని ఎద్దేవా చేశారు. సీఎం జగన్‌ను బూతులు తిట్టడానికే చంద్రబాబు పర్యటనలు చేస్తున్నారు. కర్నూలులో హైకోర్టు గురించి లాయర్లు ప్రశ్నిస్తే, గుడ్డలూడదిసి కొడతానని చంద్రబాబు అంటున్నాడని… చంద్రబాబును మించిన సైకో మరొకరు లేరన్నారు. చంద్రబాబు సీఎం కాకపోతే ప్రజలకు పోయేది ఏముందన్నారు. బతికున్నంతకాలం జగనే ముఖ్యమంత్రిగా ఉంటారన్నారు. చంద్రబాబుకే కాదని.. టీడీపీకి సైతం ఇవే చివరి ఎన్నికలు అని కొడాలి నాని అన్నారు.
*ప్రపంచ మత్య్సకార దినోత్సవం సందర్భంగా మాజీ మంత్రి కొల్లు రవీంద్ర వినూత్న రీతిలో నిరసన తెలిపారు. దుర్గాఘాట్‌లో కృష్ణమ్మకు చీర, సారె సమర్పించి తమను ఆదుకోవాలంటూ ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా కొల్లు రవీంద్ర మాట్లాడుతూ… గడిచిన మూడున్నరేళ్లుగా మత్య్సకారులకు వైసీపీ ప్రభుత్వం తీరని అన్యాయం చేస్తోందని మండిపడ్డారు. 217 జీఓ తీసుకొచ్చి మత్య్సకారుల హక్కులను కాలరాస్తున్నారన్నారు. ఇప్పటి వరకూ వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసినట్లు … ఏ ప్రభుత్వం నిర్లక్ష్యం చేయలేదని ఆయన విమర్శించారు.ఆక్వా రంగాన్ని వైసీపీ ప్రభుత్వం పూర్తిగా కుదేలు చేసిందన్నారు. నాసి రకం ఫీడు సరఫరాతో ఆక్వా దిగుబడి గమనీయంగా తగ్గిపోతోందని తెలిపారు. జే ట్యాక్స్ ఆక్వా రంగంపై విధించడంతో కొనుగోలు చేసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదన్నారు. ఏ-1 కౌంట్ ఉన్న రొయ్యలు ఖచ్చితంగా రూ.250లకు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఎప్పుడూ లేని విధంగా ఆక్వా రైతులు కూడా క్రాప్ హాలిడేకు వెళ్లేందుకు సిద్ధపడుతున్నారన్నారు. త్వరలోనే ప్రభుత్వ వ్యతిరేక నిర్ణయాలపై రాష్ట్ర వ్యాప్తంగా మత్య్సకారులతో కలిసి పోరాటం చేస్తామని కొల్లు రవీంద్ర (TDP Leader) స్పష్టం చేశారు.
*రాష్ట్రంలో ఇసుక మాఫియా ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి (Chief Minister Jagan Mohan Reddy) కనుసన్నల్లోనే నడుస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ(CPI State Secretary Ramakrishna) ఆరోపించారు. ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘జగన్ మోహన్‌రెడ్డి ఎన్నికల్లో ఓట్ల కోసం కక్కుర్తి తప్ప శాశ్వత ప్రయోజనం లేదు. పెరిగిన ధరలను దృష్టిలో పెట్టుకుని ప్రతి ఇంటికి 5 లక్షలు ఇవ్వాలి. టిడ్కో ఇళ్లకు సైంధవుడిలా జగన్ మోహన్ రెడ్డి అడ్డుపడుతున్నారు. రైతులు క్రాప్ హాలిడే ప్రకటించారు.. వాళ్లను ప్రభుత్వం గాలికి వదిలేసింది. డిసెంబర్ 12న సీసీఐ, రైతు సంఘం ఆధ్వర్యంలో పోరాటం. కేంద్రంలో నరేంద్రమోడీ, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాలు రైతు వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్నాయి. అధికార పార్టీ నేతలు బెదిరింపులకు పాల్పడుతుండటంతో పరిశ్రమలు రాష్ట్రం నుంచి వెళ్లిపోతున్నాయి. జాకీ పరిశ్రమ తరలిపోవడంపై రాప్తాడు ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి సమాధానం చెప్పాలి. ఎస్పీ ఫక్కీరప్ప డబ్బులు డిమాండ్ చేస్తున్న వారిపై కేసు ఎందుకు పెట్టలేదు. ఎంపీ బట్టలు విప్పుకుని తిరిగితే క్లీన్ చిట్ ఇస్తావా?.’’ అంటూ రామకృష్ణ నిలదీశారు
*వైసీపీ నాయకుల (YCP Leaders) దెబ్బకు రాష్ట్రంలో పరిశ్రమలు అబ్బా అంటున్నాయని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి (Tulasi Reddy) వ్యాఖ్యలు చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ… ఉన్నవి పోతున్నాయని, కొత్తవి రావడం లేదని, విస్తరణ పనులు ఆగిపోతున్నాయన్నారు. విభజన చట్టంలో పేర్కొన్న కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్, దుగారాజ పట్నంలో ఓడరేవు, విశాఖ – చెన్నై పారిశ్రామిక కారిడార్, కాకినాడ పెట్రో కెమికల్ కాంప్లెక్స్ సాధించలేదని విమర్శించారు. రాజధాని అనిస్థితి! ఆటవిక పాలనా! జేసీబీ – ఏసీబీ – పీసీబీ దృష్ట సంస్కృతి వల్ల పారిశ్రామికవేత్తలు జంకుతున్నారని అన్నారు. ‘‘రిలయన్స్ రాష్ట్రం నుండి పారిపోయింది! టైటాన్ జంప్ అయింది! కియా విస్తరణ ఆగిపోయింది! లులూ, ఫ్రాంక్లిన్, టెంపుల్టన్ వెళ్లిపోయాయి. కక్ష సాదింపు వల్ల ప్రతిష్టాత్మకమైన అమర్ రాజా విస్తరణ పనులు ఆగిపోయాయి. వైసీపీ నాయకుల మామూల్లకు భయపడి ప్రఖ్యాత బ్రాండ్ దుస్తుల తయారీ సంస్థ ఫేజ్ ఇండస్ట్రీస్ అనంతపురం జిల్లా నుంచి తెలంగాణకు వెళ్లింది’’ అని మండిపడ్డారు. వైసీపీని ప్రజలు రాష్ట్రం నుంచి తరిమెస్తేనే రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి జరుగుతుందని తులసిరెడ్డి (PCC Working President) పేర్కొన్నారు.
*క్యాసినో వ్యవహారంలో ఈడీ దూకుడు పెంచింది. ఈ కేసులో ఇప్పటికే మంత్రి తలసాని సోదరులను ప్రశ్నించిన అధికారులు మరి కాసేపట్లో మంత్రి పీఏ హరీష్‌ను విచారించనున్నారు. విదేశాల్లో క్యాసినో వ్యాపారం, ఫేమ నిబంధనల ఉల్లంఘనలపై ప్రశ్నించనున్నట్లు సమాచారం. నేపాల్‌లో జరిగిన బిగ్ డాడీ ఈవెంట్‌పై హరిష్‌ను ప్రశ్నించనున్నట్లు సమాచారం.
*పవన్‌ కల్యాణ్ పై చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు ||నేను జీవితంలో అనుకున్నవి అన్నీ చేశాను. కానీ ఒక్కదాంట్లో మాత్రం అంతుచూడలేకపోయా. రాజకీయాల్లో రాణించాలంటే రాటు తేలాలి, మాటలు అనాలి, మాటలు పడాలి, నాకు అవసరమా?కానీ పవన్‌ కల్యాణ్‌ మాత్రం అలా కాదు.
ఆయన మాటలు అంటాడు మాటలు పడతాడు. పవన్‌ కల్యాణ్‌కు మీరందరు ఉన్నారు. మీ ఆశీస్సులతో ఏదో ఒకరోజు అత్యున్నత స్థానంలో పవన్‌ని చూస్తాం.
*స్వదేశంలో న్యూజిలాండ్‌ అండర్‌-19 మహిళల జట్టుతో జరగబోయే టీ20 సిరీస్‌కు భారత జట్టును ఆల్‌ ఇండియా ఉమెన్స్‌ సెలక్షన్ కమిటీ ప్రకటించింది. హోమ్ సిరీస్‌లో భాగంగా భారత జట్టు కివీస్‌తో ఐదు టీ20లు ఆడనుంది. మొత్తం మ్యాచ్‌లన్నీ ముంబై వేదికగా జరగనున్నాయి.
*వాతావరణం అనుకూలంగా లేనందున రైతులు ఈ 2 రోజులు వరి కోతను వాయిదా వేసుకోవాలి.ఇప్పటికే కోసి, కల్లాలలో ధాన్యం ఉంటే, ధాన్యాన్ని తడవకుండా జాగ్రత్త గా ధాన్యాన్ని పట్టాలతో కప్పి ఉంచాలి లేదా అవకాశం ఉంటే సురక్షిత ప్రాంతానికి తరలించాలి.కోసిన ధాన్యం 17% తేమ ఉన్నట్లయితే(తేమ శాతాన్ని PACS/DCMS technical assistant చూస్తారు) వెంటనే సంబంధిత RBK సిబ్బంది scheduling ఇస్తారు. సంభందిత PACS/DCMS వారు కొనుగోలు చేస్తారు.
*సీఎస్ సోమేష్‌ కుమార్‌ను కాంగ్రెస్ నేతలు కలిశారు. సీఎస్‌ను కలిసినవారిలో టీపీసీపీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో పాటు భట్టి, జగ్గారెడ్డి, సీతక్క, కోదండరెడ్డి, బలరాం నాయక్ తదితరులు ఉన్నారు. అనంతరం రేవంత్ మాట్లాడుతూ రాష్ట్రంలో భూ సమస్యలు పరిష్కరించాలని సీఎస్‌కు విజ్ఞప్తి చేసినట్లు చెప్పారు. ధరణిని రద్దు చేసి పాతపద్ధతిని తీసుకురావాలని, నిషేధిత జాబితాలో ఉన్న భూముల సమస్యలు పరిష్కరించాలని కోరామన్నారు. రాష్ట్రంలో అటవీ హక్కుల చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. అర్హులకు అసైన్డ్‌ పట్టాలు, పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని, తెలంగాణలో కౌలు రైతు చట్టాన్ని అమలు చేయాలని వినతిచేసినట్లు రేవంత్‌రెడ్డి తెలిపారు.
*ఇండోనేషియా లోని ప్రధాన ద్వీపం పశ్చిమ జావా ప్రావిన్స్‌లో సోమవారంనాడు భారీ భూకంపం సంభవించింది. భూకంపం ధాటికి 20 మంది మృతి చెందగా, సుమారు 300 మంది గాయపడ్డారు. రిక్టర్ స్కేలుపై భూకంపం తీవ్రత 5.6గా నమోదైంది. వెస్ట్ జావా ప్రావిన్స్‌లోని సియాంజూర్ ప్రాంతంలో డజన్ల కొద్ది ఇళ్లు, భవంతులు దెబ్బతిన్నట్టు స్థానిక అధికారులు తెలిపారు. గ్రేటర్ జకార్తా ప్రాంతంలో తీవ్రంగా భూప్రకంపనలు వచ్చినట్టు చెబుతున్నారు. రాజధానిలోని ఆకాశహర్మ్యాలు సుమారు మూడు నిమిషాల పాటు ఊగిపోయినట్టు చెబుతున్నారు. జనం భయంతో రోడ్లపైకి పరుగులు తీశారు. కూలిన భవంతుల కింద చిక్కుకున్న వారిని బయటకు తీసే ప్రయత్నాలు ముమ్మరంగా చేపట్టినట్టు అధికారులు తెలిపారు. ప్రాణనష్టం మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు.
*ఇంటర్‌ ఫస్టియర్‌ ప్రవేశాలపై తెలంగాణ ఇంటర్‌ బోర్డు కీలక ప్రకటన చేసింది. ఇంటర్‌ ప్రవేశాల గడువును మరో సారి పొడిగించింది. రాష్ట్రంలోని అన్ని ప్రభు త్వ, ప్రయివేట్‌, ఎయిడెడ్‌ కాలేజీల్లో ఫస్టి యర్‌ ప్రవేశాల గడువును ఈ నెల 27 వరకు పొడిగించినట్టు ఇంటర్‌బోర్డు కార్యదర్శి నవీన్‌మిట్టల్‌ తెలిపారు. ఆన్‌లైన్‌లోఅడ్మిషన్స్‌ లాగిన్‌ సోమవారం (ఈ నెల 21) నుంచి తెరుచుకుంటుందని, ఇప్పటివరకు ప్రవేశాలు పొందని వారు 27 వరకు అడ్మిషన్లు పొందవచ్చని సూచించారు.
*కర్నూలులో టీడీపీకి వచ్చిన ప్రజాదరణ చూసిన వైసీపీకి చంద్రబాబు పేరు చెబితే వెన్నులో వణకు పుడుతోందని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు అన్నారు. ‘‘పులివెందుల పక్క ఊర్లో చంద్రబాబుకు వచ్చిన ప్రజాదరణ చూసి సీఎం జగన్‌ పెంపుడు కుక్కలన్నీ ఒకేసారి మొరుగుతున్నాయి. మొన్నటి వరకూ మంత్రులకే అపాయింట్‌మెంట్‌ ఇవ్వని జగన్‌ కార్యకర్తలతో ముఖాముఖి నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో రూ.2వేల నోట్లు కనిపించడం లేదు. అవి జగన్‌ ఖజానాలోకి వెళుతున్నాయి. ఎన్నికల తర్వాత ఈ పేటీఎం గ్యాంగ్‌ కనిపించదు’’ అని ఎద్దేవా చేశారు. చంద్రబాబు మానస పుత్రిక డ్వాక్రా అని, దేశంలో ఎక్కడాలేని విధంగా డ్వాక్రా సంఘాలను చంద్రబాబు అభివృద్ధి చేశారని వంగలపూడి అనిత అన్నారు. అటువంటి డ్వాక్రా వ్యవస్థను సమూలంగా నాశనం చేసిన ఘనత జగన్‌కే దక్కిందని విమర్శించారు.
*రాష్ట్రంలో శాడిస్ట్‌ సీఎం ఉన్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ధ్వజమెత్తారు. ఆదివారం కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణ శివారు ప్రాంతంలో నిర్మించిన టిడ్కో గృహాలను ఆయన పరిశీలించారు. ‘‘రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది లబ్ధిదారులు టిడ్కో గృహాల కోసం ఎదురు చూస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. కర్నూలులో 10 వేల గృహాలు ఉన్నాయి. వాటిని పరిశీలించేందుకు వెళ్తే వైసీపీ వాళ్లు నిరసన తెలుపుతున్నారు. గృహాలు ఇవ్వకుండా ఇన్నేళ్లు గాడిదలు కాస్తున్నారా? రాష్ట్ర వ్యాప్తంగా 35లక్షల మందికి ఇంటి స్థలాలు ఇచ్చారు. ఇళ్లు నిర్మించుకుకేందుకు రూ.1.80లక్షలు ఇస్తునారు. ఈ మొత్తం బాత్‌రూం కట్టుకునేందుకు కూడా సరిపోదు. ప్రతి ఇంటి నిర్మాణానికి 5 లక్షలు ఇవ్వాలి. డిసెంబరు 5న ప్రతి మండలంలో ప్రజా సదస్సు నిర్వహిస్తాం. టిడ్కో ఇళ్ల లబ్ధిదారుల వివరాలు సేకరించి అధికారులకు సమర్పిస్తాం. గృహాలు ఇవ్వకపోతే తాళాలు పగులగొట్టి లబ్ధిదారులకు ఇవ్వాల్సి వస్తుంది’’ అని రామకృష్ణ అన్నారు.
*రాష్ట్రంలో ఇసుక, మద్యం, ఎర్రచందనం, మైన్స్‌, ల్యాండ్‌ మాఫియాకు కేరాఫ్‌ అడ్రస్‌ వైసీపీ ప్రభుత్వమేనని పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ తులసిరెడ్డి ధ్వజమెత్తారు. ఈ మాఫియాకు డాన్‌ ఎవరనేది చెప్పాల్సిన పనిలేదని, ప్రజలందరికీ బాగా అర్థమైందని వ్యాఖ్యానించారు. చిత్తూరు జిల్లా గంగాధరనెల్లూరు మండలం వీరకనెల్లూరు పంచాయతీ అక్కదేవతలకండిగలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. జగన్‌ కేసులకు భయపడి ప్రధాని కాళ్లపై పడేస్థితికి రావడం రాష్ట్రానికి తలవంపేనన్నారు.
*తెలుగు జాతి ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటిన నందమూరి తారక రామారావు పేరుతో ఉన్న ఎన్టీఆర్‌ యూనివర్శిటీ పేరు మార్చితే స్పందించలేని దౌర్భాగ్య స్థితిలో రాష్ట్ర ప్రజలుండటం బాధాకరమని మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం జగ్గయ్యపేటలో కాకతీయ సేవా సమితి నిర్వహించిన వన సమారాధనలో పాల్గొన్న ఆయన మాట్లాడారు. ‘‘ఉమ్మడి రాష్ట్రంలో నీలం సంజీవరెడ్డి, కాసు బ్రహ్మానందరెడ్డి, వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి పేర్లతో అనేకమున్నాయి. ఏ ప్రభుత్వం పేర్లు మార్చే ప్రయత్నం చేయలేదు. రాష్ట్రంలో నేడు కమ్మ సామాజిక వర్గంపై దాడి చేస్తున్నా ఎందుకు స్పందించటం లేదో అర్థం కావటం లేదు. నియోజకవర్గంలో అత్యధిక ఓటర్లున్న సామాజిక వర్గం ఇతర సామాజిక వర్గాలకు చెందిన వారి పల్లకీలు ఇంకెంత కాలం మోస్తారు. పరిస్థితులు మారితేనే భవిష్యత్తు తరాలు రాజకీయాల్లోకి వస్తాయి.
*స్వతంత్రంగా వ్యవహరించాల్సిన సీబీఐ, ఈడీ, ఎన్‌ఐఏ తదితర సంస్థలు పూర్తిగా కిరాయి సంస్థలుగా మారాయని సామాజిక విశ్లేషకుడు ఆచార్య ఘంటా చక్రపాణి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సంస్థలు మోదీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న వాళ్ళను వేధించే దిశగా పనిచేయడం విచారకరమన్నారు. తెలంగాణ వికాస సమితి ఆధ్వర్యంలో ఆదివారం తెలుగు వర్సిటీలోని ఎన్టీఆర్‌ కళామందిరంలో ‘భారత రాజ్యాంగ విలువలు ఎదుర్కొంటున్న సవాళ్ళు’ అంశంపై చక్రపాణి ఉపన్యసించారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నిర్బంధం, నియంతృత్వం, నిరంకుశత్వ పోకడలతో అరాచక పాలన నడుస్తోందన్నారు. విశ్వవిద్యాలయాల్లో నియామకాలు చేపట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చట్టాన్ని రూపొందించి, సంతకం కోసం ఆ బిల్లును గవర్నరు వద్దకు పంపితే 40 రోజులు గడిచినా సమాధానం రాకపోవడం శోచనీయమన్నారు. గవర్నర్‌ వ్యవహార శైలి రాచరికాన్ని తలపిస్తోందని తూర్పారబట్టారు. నిరుడు కార్పొరేట్లకు 1.80 లక్షల కోట్ల రూపాయల పన్ను రాయితీ కల్పించిన కేంద్ర ప్రభుత్వం, అదే ఏడాది పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెంచడం ద్వారా 2.40 లక్షల కోట్ల రూపాయలను వేతనజీవుల నుంచి వసూలు చేసిందని ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌ చెప్పారు. ఏ ఒత్తిళ్లూ లేకుండానే గంగవరం పోర్టును ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అతి తక్కువ ధరకు అదానీకి అప్పగించిందా అని వ్యాఖ్యలు చేశారు.
*గ్రేటర్‌ వరంగల్‌లో రూ.75 కోట్లతో స్మార్ట్‌ బస్‌స్టేషన్‌ను నిర్మించేలా ప్రణాళిక సిద్ధమైంది. ప్రస్తుతం ఉన్న బస్టాండ్‌ ప్రాంతంలోనే ఆర్టీసీ, కుడా సంయుక్తంగా కొత్త భవన నిర్మాణ ప్రక్రియను చేపట్టనున్నాయి. రెండున్నర ఎకరాల స్థలంలో ఐదు అంతస్తులతో 32 బస్సు ప్లాట్‌ఫారాలు ఉండేలా డిజైన్‌ చేశారు. విశాలమైన ఈ భవనంలో కమర్షియల్‌ కాంప్లెక్స్‌, షాపింగ్‌ మాల్స్‌, హోటల్స్‌, ఇతర వసతులు ఉంటాయి. వరంగల్‌ రైల్వేస్టేషన్‌, కొత్తగా నిర్మించనున్న నియో మెట్రో రైలు ప్రయాణికులకు మెరుగైన రవాణా వసతులు కల్పించేలా ఈ రెండింటికీ అనుసంధానం చేస్తూ స్మార్ట్‌ బస్టాండ్‌ను తీర్చిదిద్దనున్నారు.
*గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఆసక్తికర ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా గాంధీనగర్‌ ఉత్తర నియోజవర్గానికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న మహేంద్రభాయ్‌ పత్నీ డిపాజిట్‌ కింద రూపాయి నాణేలను చెల్లించాడు. రూ.10 వేల విలువైన నాణేలను రెండు సంచుల నిండా నింపి ఎన్నికల అధికారులకు అందజేశారు. ఇలా ఎందుకు చేశారని ప్రశ్నించగా.. తను ఓ దినసరి కూలీనని, ఉండడానికి ఇళ్లు, తాగునీటి సదుపాయం కూడా లేదని చెప్పారు. తనలాంటి కుటుంబాలు ఎన్నో ఉన్నాయని, వారందరి కష్టాలు తీర్చేందుకు తాను ఎన్నికల్లో పోటీ చేస్తానని చెప్తే.. చుట్టుపక్కల వారు అంగీకరించారని, ఎవరెవరు తనకు ఓటు వేస్తారని మాటిచ్చారో వాళ్ల నుంచి ఒక్కో రూపాయి సేకరించి డిపాజిట్‌ కింద చెల్లించానని పేర్కొన్నారు.
*సాధారణ ఎన్నికలకు సన్నద్ధమవుతున్న అధికార టీఆర్‌ఎ్‌సకు గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు సవాలుగా మారనున్నాయా? ఎన్నికలకు వెళ్లేందుకు ముందే హామీలను అమలు చేయాల్సిన అనివార్యత ఏర్పడిందా? వీటికి నిధులు సర్దుబాటు చేయడం, ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం సీఎం కేసీఆర్‌కు పెను సవాలే కానుందా? అంటే ఔననే అభిప్రాయాలే వినిపిస్తున్నాయి. ఇటీవల హోరాహోరీగా సాగిన మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌ విజయం సాధించినా.. అక్కడి రాజకీయ వాతావరణం చూశాక హామీలన్నింటినీ పూర్తిస్థాయిలో అమలు చేయాల్సిన అనివార్యత ఏర్పడిందని అంటున్నారు. మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో పాత హామీలను అమలు చేస్తామని చెప్పడంతోపాటు అనేక కొత్త హామీలు కూడా అధికార పార్టీ ఇవ్వాల్సి వచ్చింది.
* గ్రామీణ ప్రాంత విద్యార్థులకు పెద్దపీట వేయాలనే ఉద్దేశంతో ఉస్మానియా యూనివర్సిటీలో మౌలిక వసతుల కల్పనకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ శ్రీకారం చుట్టారని విద్యామంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ఓయూలో సుమారు రూ. 40 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న బాలుర వసతి గృహానికి పశుసంవర్ధకమంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, ఉపకులపతి డా. రవీందర్‌తో కలిసి శనివారం మంత్రి సబితా ఇంద్రారెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. విద్యార్థులకు మెరుగైన వసతిని కల్పించడంలో భాగంగా 2.76 ఎకరాల విస్తీర్ణంలో, 660 మంది విద్యార్థులకు సరిపోయేలా నూతన హాస్టల్‌ బిల్డింగ్‌ నిర్మాణాన్ని చేపడుతున్నట్లు తెలిపారు. హాస్టల్‌ను త్వరితగతిన విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు.
*బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన అల్పపీడనం ప్రభావంతో ఆదివారం నుంచి రాష్ట్రంలో మూడ్రోజుల పాటు మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని ప్రాంతీయ వాతావరణ శాఖ(Regional Meteorological Department) తెలిపింది. ఈ నేపథ్యంలో, జిల్లా కలెక్టర్లు సన్నద్ధం కావాలంటూ రాష్ట్రప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయువ్య దిశగా పయనిస్తూ క్రమక్రమంగా బలపడుతోందని, దీని ప్రభావంతో తమిళనాడు, దక్షిణాంధ్ర, కోస్తా తీరప్రాంతాల్లో వచ్చే మంగళవారం వరకు పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు, ఒకటి, రెండు ప్రాంతాల్లో భారీవర్షం కురిసే అవకాశముందని వాతావరణ శాఖ ప్రకటించింది. తీరం దాటిన అల్పపీడనం ప్రభావంతో కడలూరు, నాగపట్టణం తదితర జిల్లాల పరిధిలో ఉన్న సముద్రంలో గంటకు 40 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని, మత్స్యకారులు తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు చేపల వేటకు వెళ్లకుండా పర్యవేక్షించాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు రాష్ట్రప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.
*జేఎన్‌టీయూహెచ్‌లో ఇంజనీరింగ్‌ ఆర్‌18 (2018) బ్యాచ్‌ విద్యార్థులకు 0.25 శాతం నుంచి 0.50 శాతం గ్రేస్‌ మార్కులు కలపాలని నిర్ణయించారు. ఈ మేరకు శనివారం జేఎన్‌టీయూహెచ్‌ రిజిస్ట్రార్‌ మంజూర్‌ హుస్సేన్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు అన్ని అఫిలియేటెడ్‌ కాలేజీలకు ఆదేశాలు జారీ చేశారు. ఫోర్త్‌ ఇయర్‌ పరీక్షలు రాసిన ఇంజనీరింగ్‌ విద్యార్థులు కరోనాతో రెండేళ్లపాటు ఆన్‌లైన్‌లో తరగతులతో కొంత నష్టపోయారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ఉన్నత మండలి ఆదేశాలతో ఫెయిల్‌ అయిన విద్యార్థులకు గ్రేస్‌ మార్కులు కలుపుతున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
* భారతదేశ సంస్కృతిని తప్పనిసరిగా పిల్లలకు నేర్పాలని లోక్‌సత్తా అధినేత జయప్రకాశ్‌ నారాయణ అన్నారు. క్రియ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి అంతర పాఠశాలల పిల్లల క్రియ పండుగ పోటీలు శనివారం కాకినాడ జేఎన్టీయూకేలో శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పాఠశాలల నుంచి 8,400 మంది విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా హాజరైన జయప్రకాశ్‌ నారాయణ మాట్లాడుతూ.. చిన్నారుల్లో విజ్ఞానాన్ని పెంపొందించేవిధంగా ఏటా క్రియ పండుగ నిర్వహించడం అభినందనీయమన్నారు.
* రాష్ట్ర గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సంక్షేమ సంస్థ (ఏపీ జీడబ్ల్యూ ఎస్‌ఈడబ్ల్యూఓ) ప్రథమ రాష్ట్ర మహాజన సభ ఈనెల 27న విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరుగుతుందని ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు. శనివారం విజయవాడలోని ఏపీ రెవెన్యూ భవన్‌లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మహాజనసభను జయప్రదం చేయటం ద్వారా సచివాలయ ఉద్యోగులు తమ సత్తా చాటాలని విజ్ఞప్తి చేశారు. సచివాలయ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలన్నింటినీ ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్ళి పరిష్కరించే దిశగా తాము కృషి చేస్తామని తెలిపారు. ఏపీ జేఏసీ అమరావతి సెక్రటరీ జనరల్‌ వైవీ రావు, ఏపీ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సంక్షేమ సంఘం అడ్‌హక్‌ మిటీ సభ్యుడు వి.అర్లయ్య మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా సచివాలయ ఉద్యోగులు ఐక్యతను చాటే సమయం ఆసన్నమైందన్నారు.
*అమరుల స్మారక చిహ్నం నిర్మాణాన్ని గడువులోగా పూర్తి చేయాలని రాష్ట్ర రోడ్లు, భవనాల మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. హుస్సేన్‌సాగర్‌ తీరాన రాష్ట్రప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తోన్న అమరుల స్మారక చిహ్నం నిర్మాణ పనులను శనివారం మంత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. పనులను పర్యవేక్షించడానికి ఆకస్మికంగా తనిఖీ చేస్తానని, అధికారులు, నిర్మాణ సంస్థ ప్రతినిధులు అత్యంత శ్రద్ధతో పని చేయాలని ఆయన సూచించారు.
*భారతీయ వారసత్వ కట్టడంగా పేరుగాంచిన మద్రాస్‌ హైకోర్టు(Madras High Court) భవనంలోని ఆరు ప్రవేశద్వారాలను శనివారం రాత్రి ఎనిమిది గంటలకు మూసివేశారు. హైకోర్టు భవనంలో రోజూ నాలుగైదు ప్రవేశద్వారాలు మాత్రమే మూసివేస్తారు. తక్కిన ప్రవేశద్వారాల్లో భద్రతా విధులు చేపడుతున్న పోలీసు ఉన్నతాధికారులు, పోలీసులు వెళ్లి గస్తీ తిరుగుతుంటారు. హైకోర్టు సిబ్బంది అత్యవసర పనుల నిమిత్తం వచ్చి వెళుతుంటారు. అయితే యేడాదికి ఒకసారి అన్ని ప్రవేశద్వారాలకు తాళాలు వేయడం ఆనవాయితీగా ఉంటోంది. ఈ భవనాలను ఆంగ్లేయులు నిర్మించడంతో వారిని స్మరించుకునేలా యేడాదికొకమారు 24 గంటలపాటు హైకోర్టు ప్రవేశద్వారాలన్నింటికి తాళాలు వేసి మూసివేస్తారు ఆంగ్లేయుల కాలం నుండే ఈ ఆచారం అమలులో ఉంది. ఆ మేరకు శనివారం రాత్రి ఎనిమిది గంటలకు తాళాలు వేసి హైకోర్టు ప్రవేశ ద్వారాలను మూసివేశారు.
* ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో అభిషేక్‌ బోయినపల్లిది కీలక పాత్ర అని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) అధికారులు రౌజ్‌ అవెన్యూ కోర్టు(సీబీఐ ప్రత్యేక కోర్టు)కు తెలిపారు. వైసీపీ ఎంపీ బంధువు, అరబిందో ఫార్మా కంపెనీ డైరెక్టర్‌ పి.శరత్‌ చంద్రారెడ్డి భాగస్వామిగా ఉన్న సౌత్‌గ్రూ్‌ప నుంచి దాదాపు రూ.100 కోట్ల ముడుపులు చెల్లించడంలో అభిషేక్‌ బోయినపల్లి కీలకంగా వ్యవహరించారని తమ దర్యాప్తులో తేలినట్లు వివరించారు. ఆ మొత్తం ముడుపుల్లో రూ.30 కోట్లను హైదరాబాద్‌ నుంచి ఢిల్లీకి హవాలా మార్గంలో తరలించినట్లు స్పష్టం చేశారు. ఈ కేసులో వందల కోట్ల రూపాయలు హైదరాబాద్‌ నుంచి ఢిల్లీకి చేరినట్లు తెలిపారు.
* పంజాబ్‌ క్యాడర్‌ మాజీ ఐఏఎస్‌ అధికారి అరుణ్‌ గోయల్‌ కేంద్ర ఎన్నికల కమిషనర్‌గా నియమితులయ్యారు. ఆయన 2027 డిసెం బరు వరకు ఈ బాధ్యతల్లో ఉంటారు. ప్రస్తుత ప్రధాన ఎన్నికల కమిషనర్‌(సీఈసీ) రాజీవ్‌ కుమార్‌ 2025 ఫిబ్రవరిలో పదవీ విరమణ చేస్తే ఆయన స్థానంలో గోయల్‌ సీఈసీ అవుతారు. అరుణ్‌ గోయల్‌ ఐఏఎస్‌ అధికారిగా డిసెంబరులో పదవీ విరమణ చేయాల్సి ఉండగా, ఆయన ముందే స్వచ్ఛంద పదవీ విరమణ(వీఆర్‌ఎస్‌) చేశారు. ఆయన వీఆర్‌ఎస్‌ శుక్రవారం నుంచే అమల్లోకి వచ్చింది. ఆ మరుసటి రోజే ఆయన ఎన్నికల కమిషనర్‌గా నియమితులు కావడం విశేషం. గోయల్‌ ఇప్పటివరకు భారీ పరిశ్రమల శాఖ కార్యదర్శిగా ఉన్నారు.
*రాజమండ్రి పేపర్ మిల్లు(Rajahmundry Paper Mill) కాలుష్యం నుంచి గోదావరి జలాలను కాపాడాలంటూ వైసీపీ నేత విశ్వేశ్వర‌రెడ్డి(YCP leader Visveswara Reddy) చేపట్టిన దీక్షకు మాజీ ఎంపీ హర్షకుమార్(Former MP Harsh Kumar) సంఘీబావం తెలిపారు. ఈ సందర్భంగా హర్షకుమార్ మాట్లాడారు. పేపర్ మిల్లు వ్యర్థాలు గోదావరి నదిలో కలవటం వల్ల తాగునీరు కాలుష్యం అవుతుందని చెప్పారు. ఆ నీరు తాగడం వల్ల రాజమండ్రి వాసులు రోగాల బారిన పడుతున్నారని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి గోదావరి జలాలను పేపర్ మిల్లు కాలుష్యం నుంచి కాపాడాలని ఆయన కోరారు.