NRI-NRT

గ్రీన్‌కార్డుకు 195 ఏళ్ల వెయిటింగ్‌! – అమెరికాలో ఊడుతున్న ఉద్యోగాలు

గ్రీన్‌కార్డుకు 195 ఏళ్ల వెయిటింగ్‌! –  అమెరికాలో ఊడుతున్న ఉద్యోగాలు

అమెరికాలో ఐటీ కంపెనీలు, సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌లు తమ ఉద్యోగులను ఉన్నపళంగా తొలగిస్తుండటం హెచ్‌-1బీ వీసాదారులను కలవరపాటుకు గురిచేస్తోంది. ఇటీవలే ట్విటర్‌ ఏకంగా 3,500 మందికి పొగబెట్టింది. హెచ్‌ 1బీ వీసాలపై అమెరికా వెళ్లేవారిలో చైనీయుల తర్వాత భారతీ యులే అత్యధికం. తాజా పరిస్థితులు వారి అవకాశాలనే ఎక్కువగా దెబ్బతీస్తున్నాయి. ఒక కంపెనీ నుంచి తొలగించిన 60 రోజులలోపే మరో కంపెనీ నుంచి ఆఫర్‌ పొందాలి. లేదంటే పెట్టెబేడా సర్దుకోవాల్సిందే. అమెరికా ఏటా ఉద్యోగితా సంబంధిత (హెచ్‌ 1బీ వీసాదారులు) గ్రీన్‌కార్డులను భారతీయులకు పదివేలు వరకు (మొత్తం కార్డుల్లో ఏడుశాతం) జారీచేస్తోంది. కానీ, ఐదు లక్షల మందికిపైగా భారతీయుల దరఖాస్తులు వెయిటింగ్‌లో ఉన్నాయి. గ్రీన్‌కార్డు కోసం 2020లో దరఖాస్తు చేసినవారికి ప్రస్తుతం 195 ఏళ్ల వెయింటింగ్‌ నడుస్తోంది. ఇక చైనీయులకు 18 ఏళ్ల వెయిటింగ్‌ ఉంది. తక్కిన దేశాలకు చెందిన హెచ్‌ 1బీ వీసాదారుల దరఖాస్తులు ఏడాది లోపే పరిశీలనకు నోచుకుంటున్నాయి. ఇంజనీరింగ్‌, కంప్యూటర్‌ సైన్స్‌ చేసిన భారతీయులకు ఇప్పటికీ అమెరికాయే స్వర్గధామం. గ్రీన్‌కార్డుల కోసం దరఖాస్తులు కూడా వారినుంచే ఎక్కువ.