Movies

కామేడీ రోల్ కు సిద్ధం

కామేడీ రోల్ కు సిద్ధం

“ప్రేమ దేశం’ సినిమాలో తల్లీకొడుకుల బంధాన్ని చక్కగా చూపించారు. ‘ప్రేమ దేశం’లో నేను ఒక హీరోయిన్లాంటి పాత్రలోనే కనిపిస్తాను” అని నటి మధుబాల అన్నారు. త్రిగుణ్, మేఘా ఆకాష్ జంటగా శ్రీకాంత్ సిద్ధం దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ప్రేమ దేశం’. శిరీష సిద్ధం నిర్మించిన ఈ సినిమా డిసెంబర్ 2న విడుదల కానుంది. ఈ చిత్రంలో తల్లి పాత్ర చేసిన మధుబాల మాట్లాడుతూ.. “ప్రేమ దేశం’లో త్రిగుణ్, మేఘా ఆకాష్ బాగా నటించారు. నా కెరీర్ ప్రారంభంలో అన్ని భాషల్లో సినిమాలు చేశాను.ఇప్పుడు తెలుగులో చేస్తే ఎక్కువ రీచ్ వస్తుంది.. అందుకే తెలుగు సినిమాల మీద ఫోకస్ పెట్టాను. నేను నటించిన మరో తెలుగు సినిమా ‘గేమ్’ మంచి కథతో రాబోతోంది. కథ బాగుంటే నెగెటివ్ రోల్ అయినా, కామెడీ రోల్ అయినా ఓకే. ప్రస్తుతం హిందీలో ‘కర్తమ్ హుక్తమ్’తో పాటు మరో సినిమా చేస్తున్నాను. అలాగే ‘దేవు’ అనే తెలుగు, తమిళ ద్విభాషా చిత్రం, వివేక్ శర్మ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాను. జీ5లో ఓ వెబ్ సిరీస్ చేస్తున్నాను” అని చెప్పుకొచ్చారు.