Movies

అలాంటి వ్యక్తినే పెళ్లాడుతా

అలాంటి వ్యక్తినే పెళ్లాడుతా

నిత్యామీనన్‌ అభినయం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎలాంటి పాత్రలోనైనా సహజమైన నటనతో మెప్పిస్తుంది. కథాంశాల ఎంపికలో కూడా ఈ భామది ప్రత్యేకమైన అభిరుచి. కథలో కొత్తదనం ఉంటేనే అంగీకరిస్తుంది. కెరీర్‌లో ఎన్నో వైవిధ్యమైన చిత్రాల్లో నటించిన ఈ మలయాళీ సోయగం ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పెళ్లి గురించి తన అభిప్రాయాల్ని వెల్లడించింది. తాను భారతీయ సంస్కృతి, సంప్రదాయాల్ని ఎంతగానో గౌరవిస్తానని పేర్కొంది. తన దృష్టిలో పెళ్లి సామాజిక భద్రతకు సంబంధించిన అంశమని, తనకు అటువంటి రక్షణ అవసరం లేదని తెలిపింది.

సోషల్‌ సెక్యూరిటీకి మించిన అంశమేదైనా ఉంటే అప్పుడు పెళ్లి గురించి ఆలోచిస్తానని స్పష్టం చేసింది. ‘వివాహ వ్యవస్థపై నాకు నమ్మకం ఉంది. అయితే పెళ్లంటే మహిళకు ఓ భద్రతలా కాకుండా అంతకుమించిన కోణంలో ఆలోచించే వ్యక్తి దొరికితే తప్పకుండా పెళ్లి చేసుకుంటా’ అని చెప్పింది. నిత్యామీనన్‌ ప్రధాన పాత్రలో నటించిన ‘బ్రీత్‌ ఇన్‌ టు ది షాడోస్‌’ గత వారమే ఓటీటీలో విడుదలైంది.