Movies

టూ హాట్‌ గురూ!

టూ హాట్‌ గురూ!

‘లోఫర్‌’ చిత్రంతో తెలుగుతెరకు పరిచయమయ్యారు దిశాపటానీతర్వాత హిందీలో వరుస అవకాశాలు అందుకున్నారు. ‘ఎం.ఎస్‌.ధోని’, ‘బాగి’ చిత్రలతో విజయం సాధించారు. కుంగు ఫూ యోగా అనే చైనీస్‌ చిత్రంలోనూ నటించారామె. సోషల్‌ మీడియలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటారు దిశా. బికినీ ఫేం అంటే గుర్తొచ్చే పేర్లలో దిశా కూడా ఒకరు. తన సోషల్‌ మీడియాలో ఎక్కువ శాతం టూ పీస్‌ డ్రెస్‌లోనే దర్శనమిస్తుంటారు. లో దుస్తులు మాత్రమే ధరించిన ఓ ఫొటోను ఆమె సోషల్‌ మీడియాలో షేర్‌ చేసి ‘కార్బోహైడ్రేడ్స్‌ తినండి’ అని ట్యాగ్‌లైన్‌ ఇచ్చారు. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట వైరల్‌ అవుతోంది. లో దుస్తుల్లో దిశాను చూసిన యువత ‘దిశా టూ హాట్‌ గురూ’ అని కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం దిశా ‘ప్రాజెక్ట్‌ కె’ చిత్రం కీలక పాత్ర పోషిస్తున్నారు. హిందీలో ‘యోధ’, తమిళంలో శివ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు.