Health

రోగాలపై త్రిశూలం.. త్రిఫల చూర్ణం

రోగాలపై త్రిశూలం.. త్రిఫల చూర్ణం

కడుపులో మంట, ఉబ్బరం, అజీర్తి, మల బద్ధకం.. ఇలా జీర్ణవ్యవస్థకు సంబంధించి ఎన్నో సమస్యలు. వాటికి సరైన విరుగుడు.. త్రిఫల. ఈ చూర్ణం వాత, పిత్త, కఫ దోషాలను సమర్థంగా నివారిస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.త్రిఫల చూర్ణం అంటే ఉసిరి, కరక్కాయ, తానికాయల మిశ్రమం. ఇది శరీరానికి ఉత్తేజాన్నిచ్చి, దీర్ఘాయువును ప్రసాది స్తుందని ఆయుర్వేదం చెబుతున్నది.
త్రిఫల పొట్టలోని మంచి బ్యాక్టీరియా వృద్ధికి సహకరిస్తుంది. జీర్ణవ్యవస్థ పని తీరును మెరుగుపరచడంతో పాటు పిత్తా శయం(గాల్‌బ్లాడర్‌)లో పేరుకుపోయిన రాళ్లను కరిగించేందుకు, ఇన్ఫెక్షన్లను నివారించేందుకు ఉపయోగపడుతుంది.తియ్యని, కార్బొహైడ్రేట్లు ఉన్న పదార్థాలను తినాలన్న కోరికను కలిగించే చెడు బ్యాక్టీరియాను సమర్థంగా తొలగిస్తుంది. ఎసిడిటీ, ఉబ్బరం, మలబద్ధకం మొదలైన వాటిని దరిచేరనీయదు.ఇందులోని గాలిక్‌యాసిడ్‌, ఎలాజిక్‌ యాసిడ్‌ జీర్ణవ్యవస్థను మెరుగు పరిచి, రోగ నిరోధక వ్యవస్థను బలపరిచి, క్యాన్సర్లను దరిచేరనీయవు. ట్రిబ్యులానిక్‌ యాసిడ్‌ అనేది కీమో థెరపీ, రేడియో థెరపీల ప్రభావం నుంచి రక్షిస్తుంది.ఈ చూర్ణంలోని క్వెర్సెటిన్‌ కళ్లు, జుట్టు, చర్మ ఆరోగ్యానికి మేలుచేస్తుంది. అంతేకాదు రక్తపోటును, రక్తంలో చక్కెర స్థాయులను నియంత్రిస్తుంది.
శరీరంలో పేరుకుపోయిన విషతుల్యాలను బయటికి పంపి, కాలేయం మెరుగ్గా పని చేసేందుకూ సాయపడుతుంది.