DailyDose

TNI నేటి తాజా వార్తలు

Auto Draft

*తెదేపా అధినేత చంద్రబాబు డిసెంబర్‌ 5న దిల్లీ వెళ్లనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగే రాజకీయ పార్టీల అధ్యక్షుల సమావేశంలో ఆయన పాల్గొననున్నారు.ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నుంచి చంద్రబాబుకు ఆహ్వానం అందింది. కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి ఫోన్‌ చేసి ఈ సమావేశానికి ఆహ్వానించారు.భారత్‌లో నిర్వహించే జీ-20 భాగస్వామ్య దేశాల సదస్సుపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. దీని ద్వారా రాజకీయ పార్టీల సూచనలు, అభిప్రాయాలను కేంద్ర ప్రభుత్వం తెలుసుకోనుంది. రాష్ట్రపతి భవన్‌లో డిసెంబర్‌ 5న సాయంత్రం 5 గంటలకు ఈ సమావేశం జరగనుంది. జీ-20 దేశాల కూటమికి భారత్‌ అధ్యక్షత వహిస్తున్న విషయం తెలిసిందే.
*ఆర్ జి యు కే టి పరిధిలోని నూజివీడు ట్రిపుల్ ఐటీ లో ఈనెల 27వ తేదీన నాలుగో విడత అడ్మిషన్స్ కౌన్సిలింగ్ నిర్వహించడం జరుగుతుందని డైరెక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. నూజివీడులో డైరెక్టర్ శ్రీనివాసరావు బుధవారం మాట్లాడుతూ మిగిలిన సీట్లు, వెయిటింగ్ లిస్టులోని విద్యార్థులు, ప్రత్యేక కేటగిరీలకు చెందిన వారు కూడా ఈ కౌన్సిలింగ్ కు హాజరు కావాలన్నారు. యూనివర్సిటీ నిబంధనల మేరకు సీట్లు కేటాయింపు ఉంటుందన్నారు
* మహబూబ్‌నగర్‌లోని పాలమూరు యూనివర్సిటీలో 24న మూడో స్నాతకోత్సవం నిర్వహిస్తున్నట్లు వీసీ లక్ష్మీకాంత్‌ రాథోడ్‌ తెలిపారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ హాజరుకానున్నారని చెప్పారు. ముందుగా ఎగ్జిక్యూటీవ్‌ కౌన్సిల్‌ సమావేశం నిర్వహిస్తున్నామన్నారు. వివిధ రకాల ప్రోగ్రాలు ఏర్పాటు చేశామని, పీహెచ్‌డీ విద్యార్థులకు అవార్డులు, గోల్డ్‌మెడల్స్‌ ప్రదానం చేయనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమాన్ని వీక్షించేందుకు పీయూలో ఎల్‌ఈడీ స్క్రీన్స్‌ ఏర్పాటు చేస్తున్నామన్నారు.
* మహారాష్ట్రలోని నాసిక్‌లో భూకంపం సంభవించింది. గోదావరి జన్మస్థలమైన నాసిక్‌లో బుధవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో స్వల్పంగా భూమి కంపించింది. రిక్టర్‌స్కేలుపై దీని తీవ్రత 3.6గా నమోదయిందిన నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సీస్మోలజీ తెలిపింది. నాసిక్‌కు పశ్చిమాన 89 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నదని వెల్లడించింది. భూ ఉపరితలం కింది టెక్టానిక్‌ ప్లేట్ల కదలిక వల్ల భూమికి దిగువన 5 కిలోమీటర్ల లోతులో భూకంపం వచ్చిందని పేర్కొన్నది. భూకంపం వల్ల జరిగిన నష్టానికి సంబంధించిన సమాచారం తెలియరాలేదని అధికారులు చెప్పారు.
*రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో చేపట్టిన పనుల్లో వేగం పెంచడంతో పాటు నిరంతర పర్యవేక్షణ కోసం సంస్కరణలు తేవాలని, ఇందుకోసం ప్రణాళికలు రూపొందించాలని రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం మినిస్టర్స్‌ క్వార్టర్స్‌లో మంత్రి తన అధికారిక నివాసంలో రోడ్లు భవనాల శాఖలో తీసుకురావాల్సిన సంస్కరణలపై సమీక్ష నిర్వహించారు. ఇందులో ఆర్‌అండ్‌బీ కార్యదర్శి శ్రీనివాసరాజు, ఈఎన్సీలు గణపతిరెడ్డి, రవీందర్‌ రావు, సీఈ సతీ్‌షతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌ సూచనలకు అనుగుణంగా ప్రణాళికలను పకడ్బందీగా రూపొందించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న అంబేడ్కర్‌ కొత్త సచివాలయం, అమరుల స్మారక చిహ్నం పనుల పురోగతిపై రు. హైదరాబాద్‌ నగరానికి మణిహారంలా ఉండే ఈ కట్టడాల నిర్మాణం తుది దశకు చేరుకుందన్నారు. నిర్దేశించిన గడువులోగా నిర్మాణ పనులు పూర్తి కావాలని మంత్రి అధికారులను అదేశించారు.
*గుజరాత్‌లో గిరిజన ప్రాంతాలలో అధికార బీజేపీకి గడ్డు పరిస్థితి ఎదురుకానుందా? అంటే అవుననే విశ్లేషణలే వినిపిస్తున్నాయి. ప్రభుత్వ పథకాలపై గిరిజనుల్లో నెలకొన్న వ్యతిరేకత, వారికి మద్దతుగా ఆమ్‌ఆద్మీ పార్టీ చేస్తున్న ఆందోళనలు వెరసి బీజేపీకి ప్రతికూలత తప్పదన్న వాదన ఉంది. డిసెంబరు 1న తొలి విడతలో 93 సీట్లకు పోలింగ్‌ జరగనుంది. ఇందులో దక్షిణాది జిల్లాలైన భారుచ్‌, నర్మదా, తాపి, డాంగ్‌, సూరత్‌, వల్సాడ్‌, నవ్‌సారిలలోనే 35 స్థానాలు ఉన్నాయు. 2017లో ఈ సీట్లలో బీజేపీ 25 స్థానాల్లో విజయం సాధించింది. కాంగ్రెస్‌ 8, భారతీయ ట్రైబల్‌ పార్టీ(బీటీపీ) రెండు స్థానాలను సొంతం చేసుకున్నాయి.
**దక్షిణ తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ(టీఎస్‌ఎస్పీడీసీఎల్‌) రెండు ఇండియన్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌(ఐసీసీ) అవార్డులను తాజాగా దక్కించుకుంది. ఐసీసీ టెక్నాలజీ అడాప్షన్‌ కేటగిరి-డిలో మొదటి ర్యాంకు, పెర్ఫామెన్స్‌ ఇంప్రూవ్‌ మెంట్‌- కేటగిరి ఈ లో మూడో ర్యాంకు సాధించింది. ఈ అవార్డులను ఈ నెల 17, 18న ఢిల్లీలో జరిగిన 16వ ‘‘ఇండియా ఎనర్జీ సమ్మిట్‌ ఇన్నోవేషన్‌ విత్‌ ఇంపాక్ట్‌ అవార్డ్స్‌ ఫర్‌ డిస్కమ్స్‌- 2022’’ కార్యక్ర మంలో సంస్థ ప్రాజెక్టుల డైరెక్టర్‌ టి. శ్రీనివాస్‌ అందుకున్నారు. వినియోగదారుల సౌకర్యార్థం టీఎస్‌ఎస్పీడీసీఎల్‌ వివిధ ఐటీ, మొబైల్‌ యాప్‌ ఆధారిత సేవలను అభివృద్ధి చేసింది. వీటితో వినియోగదారులు విద్యుత్‌ అంతరాయాల సమస్యల ఫిర్యాదు, బిల్లింగ్‌ వసూళ్లకు సంబంధించిన ఫిర్యాదుల నమోదు, నూతన సర్వీసుల మంజూరు, వాటి పర్యవేక్షణ వంటి సేవలను వినియోగదారులు సులువుగా పొందుతున్నారని శ్రీనివాస్‌ తెలిపారు
*నేపాల్‌ పార్లమెంట్‌, అసెంబ్లీకి జరిగిన సాధారణ ఎన్నికల పోలింగ్‌ లెక్కింపు ప్రారంభమైంది. కడపటి వార్తలు అందేసరికి ప్రస్తుత ప్రధాని షేర్ బహదూర్ దేవ్‌బాకు చెందిన నేపాలీ కాంగ్రెస్ ముందంజలో ఉన్నది. ఖాట్మండులోని మూడు స్థానాలను దేవ్‌బా అభ్యర్థులు కైవసం చేసుకోగా.. సీపీఎన్‌-యూఎంఎల్‌ పార్టీ ఒక్క స్థానంలో గెలుపొందింది. హోరాహోరీగా సాగిన ఈ ఎన్నికలు ప్రస్తుత ప్రధాని దేవ్‌బా-మాజీ ప్రధాని ఓలీ పార్టీల మధ్య పోటీ ఉంటుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. 2015 లో కొత్త రాజ్యాంగాన్ని తీసుకొచ్చిన తర్వాత జరుగుతున్న రెండో సాధారణ ఎన్నికలు ఇవి.
*హుస్నాబాద్ బస్టాండ్ సమీపంలో నాటు బాంబుల కలకలం రేగింది. బాంబు పేలిన శబ్దాన్ని విని స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు.. బస్టాండ్ సమీపంలో ఐదు నాటు బాంబులను గుర్తించారు. ఊర పందుల కోసం నాటు బాంబులు పెట్టినట్లు అనుమానిస్తున్నారు. నాటు బాంబులు ఉన్న వైపు ప్రజలు ఎవరు వెళ్లకుండా పోలీసులు తాడును అడ్డుగా కట్టారు
*టీడీపీ నేత, మాజీ మంత్రి పరిటాల సునీత మూడో విడత పాదయాత్ర ప్రారంభించారు. ‘రైతు కోసం తెలుగుదేశం’ పేరుతో యాత్ర చేపట్టారు. ఈ సందర్బంగా పరిటాల సునీత మీడియాతో మాట్లాడుతూ జి.కొత్తపల్లి, గార్లపట్టి, కొత్తపల్లి, గుత్తిచర్ల, ఐవార్లపల్లి, రాప్తాడు వరకు దాదాపు 15 కి.మీ. పాదయాత్ర చేయనున్నట్లు చెప్పారు. రెండు విడతల్లో ఎక్కడ ఇబ్బందులు లేకుండా పాదయాత్ర చేశామన్నారు. మూడో విడతలో మాత్రం స్థానిక ఎమ్మెల్యే, పోలీసుల నుంచి ఆటంకాలు ఎదురవుతున్నాయన్నారు.
*డప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు పొంగుటూరులో పర్యటించారు. జిల్లాలోని కొయ్యలగూడెం మండలం పొంగుటూరు సచివాలయం పరిధిలో ఎమ్మెల్యే ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు తెలియజేశారు. వారి నుంచి సూచనలు, సలహాలు స్వీకరించారు. తక్షణం పరిష్కారం అయ్యే సమస్యలపై అధికారులకు ఆదేశాలిచ్చారు. అలాగే గ్రామంలో దీర్ఘ కాలిక ప్రాధాన్యతమున్న పనులను గుర్తిస్తూ ఎమ్మెల్యే బాలరాజు ముందుకు సాగారు.
*గవర్నమెంట్ మెడికల్ కాలేజీల్లో సీనియర్ రెసిడెన్సి పోస్టుల నియామకానికి జారీ చేసిన నోటిఫికేషన్‌ను హైకోర్టు తాత్కాలికంగా సస్పెండ్ చేసింది. సీనియర్ రెసిడెన్సి పోస్టుల భర్తీ నియామకంలో ప్రైవేటు కాలేజీల విద్యార్థుల్ని అనుమతించకపోవడంపై హైకోర్టులో కర్నూలుకు చెందిన డాక్టర్ మేడం ఝాన్సీ రాణి తదితరులు వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాన్ని నేడు హైకోర్టు సింగిల్ జడ్జ్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు విచారించారు. డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిబంధనలకు వ్యతిరేకంగా కేవలం ప్రభుత్వ కాలేజీల్లో చదివిన డాక్టర్లు మాత్రమే అనుమతించడాన్ని పిటిషనర్ తరుఫు న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ తీవ్రంగా తప్పుబట్టారు. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం ఏ కాలేజీలో మాస్టర్ డిగ్రీ చేసినప్పటికీ సీనియర్ రెసిడెన్సి పోస్ట్‌కి అర్హులేనట్టు శ్రవణ్ కుమార్ వాదనలు వినిపించారు. పిటిషనర్ వాదనలతో ధర్మాసనం ఏకీభవించింది. నోటిఫికేషన్‌ని తాత్కాలికంగా సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతివాదులను కౌంటర్ దాఖలు చేయవలసిందిగా ఆదేశిస్తూ విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.
*జగన్ రౌడీ సేన వ్యాఖ్యలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోషల్ మీడియాలో వ్యంగ్య కార్టూన్‌ను పోస్ట్ చేశారు. జగన్ అండ్ కో చేసే అరాచకాలను అంశాల వారీగా వివరిస్తూ పోస్ట్‌లో పేర్కొన్నారు. ‘‘నగలు, ఆస్తుల కాయితాలు ఇటు తే. అమ్మా!! నా చాక్లెట్. నీ భూమి కాయితాల ఎక్కడున్నాయో చెప్పు.. లేదా.. నీ పింఛన్ డబ్బులు, పిఎస్, ఎల్లైసీ పాలసీలు, ఇటు తే. ఇదొక రౌడీ సేన.. నమ్మకండి’’ అంటూ పాలకులు దోచుకుంటున్నారని వ్యంగ్యంగా పోస్ట్ పెట్టారు. అలాగే ఆ పోస్టు పక్కనే జనవాణి – జనసేన భరోసా అంటూ పేదల నుంచి పవన్ అర్జీ స్వీకరించిన చిత్రాన్ని జత చేశారు. ‘‘ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ప్రత్యర్థి పార్టీని ‘రౌడీ సేన’ అని దూషించిన జగన్!’’ అంటూ ట్విట్టర్‌లో అనేక అంశాలు వచ్చేలా పవన్ కళ్యాణ్ పోస్ట్ చేశారు.
*గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు పొంగుటూరులో పర్యటించారు. జిల్లాలోని కొయ్యలగూడెం మండలం పొంగుటూరు సచివాలయం పరిధిలో ఎమ్మెల్యే ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు తెలియజేశారు. వారి నుంచి సూచనలు, సలహాలు స్వీకరించారు. తక్షణం పరిష్కారం అయ్యే సమస్యలపై అధికారులకు ఆదేశాలిచ్చారు. అలాగే గ్రామంలో దీర్ఘ కాలిక ప్రాధాన్యతమున్న పనులను గుర్తిస్తూ ఎమ్మెల్యే బాలరాజు (YCP MLA) ముందుకు సాగారు.
*మంత్రి మల్లారెడ్డి సెల్ ఫోన్‌ ను ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆ ఫోన్‌ను క్వార్టర్స్‌లో సిబ్బంది దాచి ఉంచారు. మంగళవారం ఉదయం నుంచి మల్లారెడ్డి నివాసంలో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి.
*దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన శ్రద్ధ వాకర్ హత్య కేసు విచారణను ఢిల్లీ పోలీసుల నుంచి సీబీఐ (CBI)కి బదిలీ చేయాలంటూ దాఖలైన ప్రజా ప్రయోజనాల వ్యాజ్యాన్ని (PIL) ఢిల్లీ హైకోర్టు మంగళవారంనాడు తోసిపుచ్చింది. పిటిషన్‌ను అంగీకరించడానికి ఒక్క కారణం కూడా కనిపించడం లేదని జస్టిస్ సతీష్ చందర్ శర్మ, జస్టిస్ సుబ్రమణియం ప్రసాద్‌‌లతో కూడిన ధర్మాసనం పేర్కొంది. ఢిల్లీ పోలీసుల విచారణపై హతురాలి తల్లిదండ్రులకు లేని అభ్యంతరం మీకెందుకని పిటిషనర్‌ను సూటిగా నిలదీసింది. ఇది పబ్లిసిటీ ఇంట్రస్ట్ లిటిగేషన్ కింద కనిపిస్తోందని, కేసును సీబీఐకి అప్పగించాలని ఆదేశించలేమని తెలిపింది.
*బీజేపీ నాయకురాలు, రియాల్టీ షో ‘బిగ్‌బాస్’ కంటెస్టెంట్ సోనాలి ఫోగట్ గోవా పర్యటన సమయంలో అనుమానాస్పద స్థితిలో మరణించిన కేసులో సీబీఐ తొలి చార్జిషీటు దాఖలు చేసింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న సుధీర్ సాగ్వాన్, సుఖ్విందర్ సింగ్‌ పేర్లను చార్జిషీటులో చేర్చింది. గత ఆగస్టు 23న అంజునలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి ఫోగట్‌ను తీసుకువచ్చారు. అప్పటికే ఆమె మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. ఆమెకు హానికరమైన డ్రగ్ నీటిలో కలిపి బలవంతంగా ఇచ్చినట్టు పోలీసుల అభియోగంగా ఉంది. ఘటన జరగడానికి ముందు రోజే తన పీఏలు సుధీర్ సాంగ్వాన్, సుఖ్వీందర్ సింగ్‌లతో కలిసి ఆమె గోవా వచ్చారు.

*నేరచరిత ప్రజా ప్రతినిధుల కేసుల విచారణ మళ్లీ వాయిదా పడింది. ఈ కేసు విచారణను త్వరిత గతిన చేపట్టాలంటూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై విచారణను సుప్రీం వచ్చే మంగళవారానికి వాయిదా వేసింది.దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఉన్న కేసుల జాబితాలు, వాటిలో తీవ్రత ఉన్న కేసులు, గతంలో సుప్రీంకోర్టు జారీ చేసిన మార్గదర్శకాల తర్వాత పురోగతిపై ఇప్పటికే అమికస్ క్యూరీ నివేదిక దాఖలు చేసింది. తీవ్ర నేరాభియోగాలు ఉన్న వ్యక్తులు ఎన్నికలకు దూరంగా ఉంచాలని, పోటీ చేసేందుకు అనర్హులుగా ప్రకటించాలని, నేర నేపథ్యం ఉన్న వారిని కూడా ఎన్నికలకు దూరంగా ఉంచేలా చట్టం తీసుకురావాలంటూ దాఖలైన ప్రయోజన వ్యాజ్యంపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఈ రోజు పలు ముఖ్యమైన కేసుల విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో వారం రోజులపాటు ఈ కేసు విచారణను వాయిదా వేస్తున్నట్లు సీజేఐ జస్టిస్ చంద్ర చూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ప్రకటించింది.
*ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో రెండు మూడు రోజులపాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ తెలిపింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతోంది. వాయువ్య దిశగా గంటకు 5 కిలోమీటర్ల వేగంతో కదులుతూ చెన్నైకి సమీపిస్తున్న వాయుగుండం.. చెన్నైకి 140 కి.మీలు, నెల్లూరుకు తూర్పు ఆగ్నేయంగా 225 కిలోమీటర్ల దూరంలో కొనసాగుతోంది.
*రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఎనిమిదేళ్ల పాలనలో సీఎం కేసీఆర్‌ ఎన్నో అద్భుతాలు సృష్టించారని సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ అన్నారు. జగిత్యాల జిల్లా వేములవాడ నియోజకవర్గంలో కొత్తగా బీమారం మండలం ఏర్పాటైంది. తహసీల్దార్‌ కార్యాలయాన్ని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌, ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌ బాబుతో కలిసి మంత్రి సోమవారం ప్రారంభించారు.
*కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసినట్లు మర్రి శశిధర్‌రెడ్డి ప్రకటించారు. తార్నాకలోని నివాసంలో ఆయన మంగళవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఇటీవల కాంగ్రెస్‌ ఆయనను ఆరు సంవత్సరాల పాటు పార్టీ నుంచి బహిష్కరించిన విషయం తెలిసిందే. మీడియాతో మాట్లాడుతూ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు వెల్లడించారు.
*టీడీపీ నేత, మాజీ మంత్రి పరిటాల సునీత (Paritala Sunita) మూడో విడత పాదయాత్ర ప్రారంభించారు. ‘రైతు కోసం తెలుగుదేశం’ పేరుతో యాత్ర చేపట్టారు. ఈ సందర్బంగా పరిటాల సునీత మీడియాతో మాట్లాడుతూ జి.కొత్తపల్లి, గార్లపట్టి, కొత్తపల్లి, గుత్తిచర్ల, ఐవార్లపల్లి, రాప్తాడు వరకు దాదాపు 15 కి.మీ. పాదయాత్ర చేయనున్నట్లు చెప్పారు. రెండు విడతల్లో ఎక్కడ ఇబ్బందులు లేకుండా పాదయాత్ర చేశామన్నారు. మూడో విడతలో మాత్రం స్థానిక ఎమ్మెల్యే, పోలీసుల నుంచి ఆటంకాలు ఎదురవుతున్నాయన్నారు.
*మంత్రి మల్లారెడ్డి ఇళ్లు, కార్యాలయాలపై నేడు ఐటీ అధికారులు మెరుపు దాడులు నిర్వహించిన విషయం తెలిసిందే. మేడ్చల్, మల్కాజ్ గిరి జిల్లాలోని పలుప్రాంతాలలో అధికారులు పెద్ద ఎత్తున ఆస్తులను గుర్తించినట్లు సమాచారం. యూనివర్శిటీతో కలిపి 38 ఇంజనీరింగ్ కాలేజీలు మల్లారెడ్డికి ఉన్నాయి. మెడికల్ కాలేజీలు రెండు నారాయణ హృదయాలయ, మల్లారెడ్డి మెడికల్ కాలేజీలు.. మొత్తం 6కు పైగా పాఠశాలలు, పెట్రోల్ బంకులు, షాపింగ్ మాల్స్, వందల ఎకరాల భూములు, దేవరాంజల్, షామీర్ పేట్, జవహర్ నగర్‌, మేడ్చల్, ఘట్కేసర్, కీసరలో భారీగా ఆస్తులు ఉన్నట్లు సమాచారం.
*మహబూబాబాద్: జిల్లాలోని కొత్తగూడ గిరిజన ఆశ్రమ స్పోర్ట్స్ పాఠశాలలో పుడ్ పాయిజన్ అయ్యింది. కలుషిత ఆహారం తిని 15 మంది పిల్లలు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. పాఠశాల సిబ్బంది వెంటనే వారిని కొత్తగూడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆదివారం విద్యార్థులు చికెన్ తినగా.. నిన్నటి నుంచి వాంతులు, విరోచనాలతో బాధపడ్డారు. దీంతో హాస్టల్ సిబ్బంది నిర్వాకంపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
*అఖిలపక్ష ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతలకు దారి తీసింది. కోట్ల రూపాయలు విలువ చేసే ప్రభుత్వ భూములను వైసీపీ ఎమ్మెల్యే (ycp mla) ఆక్రమించారంటూ అఖిలపక్షం నేతలు ఆరోపించారు. నగర శివారులోని భావన టౌన్‌షిప్ దగ్గర ఆందోళన చేపట్టేందుకు ఆల్‌పార్టీ నేతలు పిలుపునిచ్చారు. అటువైపు వెళ్లకుండా పోలీసులు ముందస్తు అరెస్ట్‌లు చేస్తున్నారు. రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ అధ్యక్షుడు రవిశంకర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో పోలీసుల అత్యుత్సాహంపై అఖిలపక్ష పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా పోలీసులకు-నేతల మధ్య స్వల్ప వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది. భూకబ్జాదారులకు పోలీసులు కొమ్ము కాస్తున్నారంటూ నినాదాలు చేశారు. భావన టౌన్ షిప్‌లో కోట్ల రూపాయల విలువ చేసే ప్రభుత్వ భూమిని తక్షణమే ప్రభుత్వం(ycp government) స్వాధీనం చేసుకోవాలని నాయకులు డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో టీడీపీ, కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం నేతలు పాల్గొన్నారు.
*వైసీపీ నేత కొడాలి నాని టీడీపీ మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ… అపోలో నుండి వచ్చిన కొడాలి నానికి.. కిడ్నీతో పాటు బ్రెయిన్‌కు కూడా సర్జరీ జరిగినట్లుందని యెద్దేవా చేశారు. కొడాలి బతుక్కి చంద్రబాబు లోకేష్ కావాలా దమ్ముంటే తనపై గెలవాలని ఛాలెంజ్ విసిరారు. ఇటువంటి నాయకులను ఎన్నుకొని ఇదేం ఖర్మ అని ప్రజలు అనుకుంటున్నారన్నారు. ఒక్క ఛాన్స్ అన్న జగన్‌కు ఇదే చివరి ఛాన్స్ అని తెలిపారు. హీరో అనుకుంటున్న కొడాలి లెక్కలన్నీ ఆధారాలతో తమ వద్ద ఉన్నాయన్నారు. అవినీతి సొమ్ముతో 2024 ఎన్నికల్లో బంగారు ముద్దలు ఇచ్చిన కొడాలి నాని ఓటమి తథ్యమని స్పష్టం చేశారు.
*మహారాష్ట్ర, బీహార్ రాష్ట్రాలు శాంతియుతంగా మారితే.. ఇప్పుడు ఏపీ మాత్రం వల్లకాడైపోతుందని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి(Former minister Somireddy Chandramohan Reddy) ఆరోపించారు. ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఏపీ జెన్‌కో ఎదుట పెద్ద ఎత్తున ఉద్యోగులు, కార్మికులు, కార్మిక సంఘాలు, టీడీపీ(tdp), సీపీఎం(cpm), సీపీఐ(cpi) పార్టీలు ఆందోళన చేపట్టాయి. ఈ సందర్భంగా సోమిరెడ్డి మాట్లాడారు. ‘‘జగన్‌కి(cm jagan) జనాన్ని చూస్తే భయం. అందుకే ఎక్కడికి వచ్చినా బారీకేడ్లు కడుతున్నారు. ఆడపిల్లలను చున్నీలు తీసి మీటింగ్‌కి రమ్మంటారా? అదే మీ ఇంటి ఆడపిల్లలు అయితే అలాగే చేస్తారా? అక్కడ జలగన్న ఉంటే.. ఇక్కడ తోడేలన్న ఉన్నాడు. ప్రభుత్వం అమ్మే మద్యంతో ప్రజలు మరణిస్తున్నారు. ఏపీ జెన్‌కోని అదానీకి ఇచ్చేదానికి వీలులేదు. కాదంటే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం. రొయ్యలను కొనేవాడు లేడు. రొయ్యల మేతలోనూ మీకు కమీషన్ అందాల్సిందేనా’’ అంటూ సోమిరెడ్డి ప్రభుత్వంపై మండిపడ్డారు.
*ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సభల్లో ఆంక్షలపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే పరదాలు, బారికేడ్ల మధ్య పర్యటనలకు వెళుతున్న ముఖ్యమంత్రి… నల్లరంగులో ఉన్నాయని తన సభకు వచ్చిన మహిళల చున్నీలు కూడా తీయించివేయడం దారుణమన్నారు. బురఖాలు వేసుకున్న ముస్లిం మహిళలను సభలోకి రానివ్వరా? అని ప్రశ్నించారు. గొడుగులు చూసి కూడా ఎందుకు భయం అని ప్రశ్నించారు. ఇదంతా పోలీసు భద్రత కాదు…. జగన్ రెడ్డి ( అభద్రత అంటూ చంద్రబాబు వ్యాఖ్యలు చేశారు.
*థావూస్‌కు వెళ్లి జగ్గూభాయ్ ఏం చేశారని, బేగంపేట ఎయిర్ పోర్టు నుంచే వెళ్లాల్సిన అవసరం ఏమిటని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి ప్రశ్నించారు. ఈ సందర్భంగా మంగళవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ గన్నవరం ఎయిర్ పోర్టులో స్పెషల్ ఫ్లైట్ ల్యాండ్ కాదా? అని ప్రశ్నించారు. పెద్ద ఎత్తున నల్లధనం, బంగారం తరలించేందుకే బేగంపేట నుంచి వెళ్లారని విమర్శించారు. జగ్గూభాయ్ ధావూస్ పర్యటనలో మూడు రోజులు మాయమయ్యారని, అరబిందో వాళ్లని జగ్గూభాయ్ కలిశారా? లేదా? అని ప్రశ్నించారు. జగ్గూభాయ్ మాఫియాతో మంత్రులు, ఎమ్మెల్యేలకు సంబంధాలున్నాయన్నారు.
*మహారాష్ట్ర సరిహద్దుల్లో నివాసముంటున్న గుజరాత్ ఓటర్లకు ఎన్నికల పోలింగ్ సందర్భంగా సీఎం ఏక్‌నాథ్ షిండే శుభవార్త వెల్లడించారు. పోలింగ్ రోజు మహారాష్ట్ర(Maharashtra) సరిహద్దుల్లోని పాల్ఘార్, నాసిక్, నందుర్బార్, ధూలే వంటి మహారాష్ట్ర సరిహద్దు జిల్లాల్లో పనిచేస్తున్న గుజరాత్ ఓటర్లకు(Gujarat Assembly Elections) మహారాష్ట్ర ప్రభుత్వం వేతనంతో కూడిన ఒకరోజు సెలవును ప్రకటించింది.(Oneday Paid Leave) రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో నివసిస్తున్న గుజరాత్ ఓటర్లు రాబోయే అసెంబ్లీలో ఓటు వేయడానికి వీలుగా ఒకరోజు వేతనంతో కూడిన సెలవును అనుమతిస్తూ ప్రభుత్వం ఆదేశాలు (జిఆర్) జారీ చేసింది.
*మహబూబాబాద్: జిల్లాలోని కొత్తగూడ గిరిజన ఆశ్రమ స్పోర్ట్స్ పాఠశాలలో పుడ్ పాయిజన్ అయ్యింది. కలుషిత ఆహారం తిని 15 మంది పిల్లలు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. పాఠశాల సిబ్బంది వెంటనే వారిని కొత్తగూడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆదివారం విద్యార్థులు చికెన్ తినగా.. నిన్నటి నుంచి వాంతులు, విరోచనాలతో బాధపడ్డారు. దీంతో హాస్టల్ సిబ్బంది నిర్వాకంపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
*రాష్ట్రంలో ఐటీ, ఈడీ దాడుల (IT, ED Raids)పై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Talasani Srinivas Yadav) కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ… బీజేపీ (BJP) దేశ వ్యాప్తంగా దాడులు చేస్తూ బెదిరింపులకు పాల్పడుతోందన్నారు. తాటాకు, బీజేపీ బెదిరింపులకు భయపడేది లేదని స్పష్టం చేశారు. దాడులను ఎలా ఎదుర్కోవాలో తమకు తెలుసని అన్నారు. ‘‘అధికారం శాశ్వతం కాదు.. ఇవ్వాళ మీరు ఉన్నారు రేపు మారినప్పుడు ఈ సంప్రదాయం కొనసాగుతుందని మర్చిపోవద్దు’’ అంటూ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Telangana Minister)హెచ్చరించారు.
*కృష్ణా: జిల్లాలోని పెనమలూరు నియోజకవర్గం యనమలకుదురులో ఉద్రిక్తత కొనసాగుతోంది. ‘‘ఇదేం ఖర్మ-ఈ రాష్ట్రానికి’’ అంటూ బ్రిడ్జిపై టీడీపీ నేతల నిరసన చేపట్టారు. పెనమలూరు అభివృద్ధిని నిర్లక్ష్యం చేశారంటూ ఫ్లెక్సీలతో ప్రదర్శనకు దిగారు. టీడీపీ నేతలను అడ్డుకునేందుకు బ్రిడ్జ్ వద్దకు భారీగా పోలీసులు చేరుకున్నారు. ఆందోళన చేస్తున్న టీడీపీ నేతలను అరెస్ట్ చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు. అయితే అరెస్ట్‌ చేస్తే బ్రిడ్జిపై నుంచి దూకేస్తామని మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ హెచ్చరించారు. దీంతో యనమలకుదురు బ్రిడ్జి ఉద్రిక్త వాతావవరణం నెలకొంది.
*ఇండోనేషియాపై ప్రకృతి కన్నెర్రజేసింది. 10 గంటల వ్యవధిలో 62 సార్లు భూమి కంపించింది. మధ్యాహ్నం 10-15 సెకన్లపాటు ప్రధాన భూభాగమైన జావాలో 5.6 తీవ్రతతో బీభత్సం సృష్టించిన భూప్రకోపం 162 నిండు ప్రాణాలను బలిగొంది. సాయంత్రం 7 గంటల వరకు ఇదే ప్రాంతంలో 1.5 నుంచి 4.8 తీవ్రతతో మొత్తం 62 సార్లు భూమి కంపించింది. రాత్రి 9.16కు జకర్తా వాయవ్య ప్రాంతంలో పాపువా దీవుల్లో 5.1 తీవ్రతతో భూకంపం వచ్చింది. అక్కడ కూడా జనావాసాలు పెద్దసంఖ్యలో నేలమట్టమైనట్లు తెలుస్తోంది. అక్కడ మరణాల సంఖ్య తెలియాల్సి ఉంది. మధ్యాహ్నం 12.30 సమయంలో తొలుత జావాలోని సియాంజుర్‌ నగరం కేంద్రంగా భూగర్భంలో 10 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించినట్లు అధికారులు తెలిపారు.
*కొలంబియా దేశంలోని ఓ నగరంలో ఓ చిన్న విమానం కుప్పకూలి పోయింది. కొలంబియాలోని(Colombia) రెండవ అతిపెద్ద నగరం మెడెలిన్‌లోని నివాస ప్రాంతంలో ఒక చిన్న విమానం(Small plane) కూలిపోయిందని(Plane Crashes) విమానాశ్రయ అధికారులు, మేయర్ తెలిపారు.ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న 8 మంది మరణించారని మెడెలిన్ మేయర్ డేనియల్ క్వింటెరో చెప్పారు. ఒలాయా హెర్రెరా విమానాశ్రయం నుంచి విమానం బయలుదేరి ఇంజిన్ వైఫల్యంతో ఇంటిపై కుప్పకూలి పోయింది. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పారు.
*తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి పెద్ద దెబ్బే తగిలింది. ఆ పార్టీకి ఎంతో కాలంగా వెన్నుదన్నుగా ఉంటూ వస్తున్న సీనియర్ నేత మర్రి శశిధర్‌రెడ్డి రాజీనామా చేశారు. ఇటీవలి కాలంలో తను పార్టీ మారబోతున్నట్టు మర్రి శశిధర్ రెడ్డి సంకేతాలిస్తూ వస్తున్నారు. నేడు పార్టీ మారుతున్నట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా మర్రి శశిధర్ రెడ్డి మాట్లాడుతూ.. బాధగానే కాంగ్రెస్‌తో బంధం తెంచుకుంటున్నానన్నారు. ప్రతిపక్ష పార్టీ పాత్ర పోషించడంలో కాంగ్రెస్‌ విఫలమైందన్నారు. పార్టీ ముఖ్య నాయకురాలు సోనియా గాంధీకి కూడా లేఖ రాశానని మర్రి శశిధర్ రెడ్డి వెల్లడించారు. తెలంగాణలో ఇలాంటి పరిస్థితిని తాను ఎప్పుడూ చూడలేదన్నారు. పార్టీలో పరిస్థితి రోజురోజుకీ దిగజారిపోతోందన్నారు. ప్రజల కోసం పని చేయడంలో కాంగ్రెస్‌ పార్టీ విఫలమైందన్నారు. కాంగ్రెస్‌కు చేతి గుర్తు సూచించిన వారిలో తన కూడా ఉన్నారని ఆయన గుర్తు చేశారు. నేటి నుంచి కాంగ్రెస్‌ హోంగార్డుగా ఉండటం లేదని మర్రి శశిధర్‌రెడ్డి వెల్లడించారు.
*2022 నవంబర్‌ నాటికి దేశంలో 5,097 మంది తాజా, మాజీ ఎంపిలు, ఎమ్మెల్యేలపై క్రిమినల్‌ కేసులు ఉన్నాయని అమికస్‌ క్యూరీ విజరు అన్సారియా నివేదిక తెలిపింది. సిజెఐ జస్టిస్‌ డివై చంద్రచూడ్‌కు ఈ నెల 14న అన్సారియా సమర్పించిన నివేదికలో ఆరు రాష్ట్రాల హైకోర్టుల నుంచి సమాచారం అందలేదని తెలిపారు. వాటిని కూడా జత చేస్తూ సప్లమెంటరీ రిపోర్టును సోమవారం సిజెఐకు హన్సారియా అందజేశారు. 2018 డిసెంబర్‌ నాటికి 4,122 మంది మాజీ, తాజా ఎంపి, ఎమ్మెల్యేలపై క్రిమినల్‌ కేసులు ఉన్నాయని, 2021 డిసెంబర్‌ నాటికి కేసుల సంఖ్య 4,974కి పెరిగిందని, 2022 నవంబర్‌ నాటికి 5,097 కేసులకు పెరిగిందని తెలిపారు. మొత్తం కేసుల్లో 2,112 (41 శాతం) కేసులు ఐదేళ్ల కంటే పైబడి పెండింగ్‌లో ఉన్నాయని, అత్యధికంగా ఒరిస్సా 323 (71 శాతం), బీహార్‌ 381 (69 శాతం), ఉత్తరప్రదేశ్‌ 719 (52 శాతం)కేసులు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో 92, తెలంగాణలో 17 కేసులు ఎంపి, ఎమ్మెల్యేలపై పెండింగ్‌లో ఉన్నాయని తెలిపింది
* గుంటూరు- విజయవాడ మధ్య అమరావతి రాజధానిగా ఉండటం సర్వదా హర్షణీయమని మాజీ హోం మంత్రి వసంత నాగేశ్వరరావు పేర్కొన్నారు. రాష్ట్రాభివృద్ధికి అది చిహ్నమని అభిప్రాయపడ్డారు. ఇందులో వివాదం ఏమీ లేదన్నారు. ఎన్టీఆర్‌ జిల్లా నందిగామ మండలం ఐతవరంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రూపాయి తీసుకోకుండా రాజధాని కోసం 32వేల ఎకరాలు ఇచ్చిన ఘనత ప్రపంచంలో ఎక్కడా లేదని చెప్పారు. 29 గ్రామాలకు చెందిన రైతులు తమ భూములను త్యాగం చేశారని, వారికి జేజేలు పలుకుతున్నట్లు తెలిపారు. విజయవాడలో రైల్వే జంక్షన్‌, విమానాశ్రయంతో పాటు కృష్ణా నది అందుబాటులో ఉన్నందున అమరావతి రాజధానికి అనువైన ప్రాంతమని పేర్కొన్నారు. రాష్ట్రం మధ్యలో ఉన్న విజయవాడ ప్రాంతం అందరికీ అందుబాటులో ఉంటుందని, రాష్ట్ర మంత్రివర్గంలో కమ్మ సామాజిక వర్గానికి ప్రాధాన్యం లేకపోవడం బాధాకరమని వ్యాఖ్యానించారు. కమ్మవారు ఉన్న రాష్ట్రంలోనే మంత్రి లేకపోతే ఆ సామాజిక వర్గానికి ఎటువంటి సంకేతాలు ఇచ్చినట్లని ప్రశ్నించారు. అన్ని సామాజిక వర్గాలకు మంత్రివర్గంలో ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు.
* హైదరాబాద్: నగరంలోని పలు ప్రముఖుల ఇళ్లు, కార్యాలయాల్లో ఐటీశాఖ దాడులు చేపట్టింది. తెల్లవారుజాము నుంచే అధికారులు బృందాలుగా విడిపోయి తనిఖీలు నిర్వహిస్తున్నారు. తెలంగాణ మంత్రి మల్లారెడ్డి.. ఆయన కుమారుడు, అల్లుడుకు సంబంధించిన ఇళ్లు, సంస్థల్లో సోదాలు చేస్తున్నారు. కొంపల్లిలోని పాం మెడోస్‌ విల్లాలోనూ సోదాలు చేపట్టారు. దాదాపు 50 బృందాలు ఈ సోదాల్లో పాల్గొంటున్నట్లు సమాచారం.
*రైతులకు సంబంధించిన సాగునీరు, నిరంతర విద్యుత్‌, రైతుసంక్షేమ పథకాలను ఏర్పాటు చేసి రైతును రాజు చేయడమే సీఎం కేసీఆర్‌ లక్ష్యమని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. సోమవారం కల్లూరులోని కాశ్మీర దైవక్షేత్రం ఆలయ ఆవరణలో ఐకేపీ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. సీఎం రైతు పక్షపాతిగా వ్యవహరిస్తున్నారని, రైతులకు ఇబ్బందులు లేకుండా గన్నీ బ్యాగులను సకాలంలో అందిస్తున్నారన్నారు. ధాన్యం విక్రయించిన వారం రోజుల్లోనే రైతు ఖాతాల్లో నగదు జమ చేస్తున్నామన్నారు.
*1956లో కేరళ రాష్ట్రం ఆవిర్భవించక ముందు నుంచే గవర్నర్లు విశ్వ విద్యాలయాలకు చాన్స్‌లర్లుగా ఉన్నారని, జాతీయ స్థాయిలో కుదిరిన ఏకాభిప్రాయం వల్లనే ఆ నిర్ణయం తీసుకున్నారని కేరళ గవర్నర్‌ ఆరిఫ్‌ మహమ్మద్‌ ఖాన్‌ వ్యాఖ్యానించారు. గవర్నర్‌ను చాన్స్‌లర్‌గా తొలగించడం అంటే అదేమీ రాష్ట్ర ప్రభుత్వం పంచే మిఠాయి కాదని అన్నారు. సోమవారం తిరువనంతపురం వెళ్లేముందు ఎర్నాకుళంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, తన కార్యాలయంలో ఏం జరుగుతుందో ముఖ్యమంత్రి విజయన్‌ తెలుసుకోవాలని సూచించారు. కన్నూర్‌ వర్సిటీలో సీఎం కార్యాలయ సిబ్బంది బంధువుల నియామాకాన్ని అడ్డుకోవడం తన వ్యక్తిగత అజెండా కాదని చెప్పారు. బంధుప్రీతితో సీఎంవో సిఫార్సులు చేస్తోందని, అది తెలుసుకోలేకపోతే ముఖ్యమంత్రి అసమర్థతేనని విమర్శించారు.
*రాజ్యాంగ వ్యవస్థలైన పోలీ సు, న్యాయ శాఖలను కించపరిచేలా మాజీ ఎమ్మెల్సీ బత్యాల చెంగల్రాయుడు పరుష పదజాలంతో దూషించడాన్ని ఖండిస్తున్నట్టు ఆంధ్రప్రదేశ్‌ పోలీసు అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జనకుల శ్రీనివాసరావు తెలిపారు. విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ వాఖ్యలు చేసిన మాజీ ఎమ్మెల్సీని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. చెంగల్రాయుడు వాఖ్యలను ఖండించకుండా మాజీ సీఎం చంద్రబాబు మౌనంగా ఉండటం దుర్మార్గమన్నారు. ఆయన పోలీసు, న్యాయ వ్యవస్థలు, రాష్ట్ర ప్రజలకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు.
*ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ తిరుగుబాటు అభ్యర్థులుగా పోటీ చేస్తున్న 11మంది నేతలపై ఆ పార్టీ అధిష్ఠానవర్గం సస్పెన్షన్ వేటు విధించింది. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అధ్యక్షతన నేతల సమావేశం అనంతరం బీజేపీ తిరుగుబాటు అభ్యర్థులను పార్టీ నుంచి బహిష్కరించింది.( నగర పేదల కోసం మురికివాడల పునరావాస ప్రాజెక్టు, మోదీ విజయాల గురించి ఎన్నికల్లో ఓటర్లకు చెప్పాలని జేపీనడ్డా బీజేపీ నేతలకు సూచించారు.బీజేపీ తిరుగుబాటు అభ్యర్థులుగా పోటీల ఉన్న లవలేష్ శర్మ, రీను జైన్, రాజ్ కుమార్ ఖురానా, ధరమ్ వీర్ సింగ్ తదితరులపై బీజేపీ ప్రాథమిక సభ్యత్వం నుంచి ఆరేళ్లపాటు సస్పెండ్ చేసింది.
* ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ తిరుగుబాటు అభ్యర్థులుగా పోటీ చేస్తున్న 11మంది నేతలపై ఆ పార్టీ అధిష్ఠానవర్గం సస్పెన్షన్ వేటు విధించింది. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో(Delhi Civic Body Polls) బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అధ్యక్షతన నేతల సమావేశం అనంతరం బీజేపీ తిరుగుబాటు అభ్యర్థులను(Rebel Candidates) పార్టీ నుంచి బహిష్కరించింది.(BJP Expels) నగర పేదల కోసం మురికివాడల పునరావాస ప్రాజెక్టు, మోదీ విజయాల గురించి ఎన్నికల్లో ఓటర్లకు చెప్పాలని జేపీనడ్డా బీజేపీ నేతలకు సూచించారు.బీజేపీ తిరుగుబాటు అభ్యర్థులుగా పోటీల ఉన్న లవలేష్ శర్మ, రీను జైన్, రాజ్ కుమార్ ఖురానా, ధరమ్ వీర్ సింగ్ తదితరులపై బీజేపీ ప్రాథమిక సభ్యత్వం నుంచి ఆరేళ్లపాటు సస్పెండ్ చేసింది.
*సహజంగా పాన్‌ షాపుల్లో కిళ్లీలు అమ్ముతారు. కానీ రాష్ట్రంలో మాత్రం మద్యం అమ్ముతున్నారు. శ్రీకాకుళం జిల్లాలో రెండుచోట్ల పాన్‌షా్‌పల్లో, విజయనగరం జిల్లాలో కిరాణా కొట్లో, విశాఖలో టిఫిన్‌ సెంటర్‌లో మద్యం అమ్మకాలు సాగుతున్నాయి. తెనాలి సమీపంలోని వేమూరులో రైల్వేట్రాక్‌ కేంద్రంగానే బెల్టు నడుస్తోంది. తూర్పుగోదావరి జిల్లా అమలాపురం ప్రాంతంలో ఆంజనేయస్వామి గుడి వెనుకే బెల్టు ద్వారా మద్యం విక్రయిస్తున్నారు. ఈ విషయాలన్నీ స్వయంగా ఇంటెలిజెన్స్‌ విభాగమే ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో బెల్టు షాపులు, అక్రమ మద్యం అమ్మకాలను తుడిచిపెట్టేశామని వైసీపీ సర్కారు చెప్పుకొంటున్న గొప్పలన్నీ అవాస్తవాలని తేలిపోయింది. మద్యం అమ్మకాల్లో అక్రమాలపై ఇంటెలిజెన్స్‌ విభాగం ప్రభుత్వానికి ప్రతివారం నివేదికలు ఇస్తోంది. తాజా నివేదిక ప్రకారం 197 చోట్ల వేర్వేరు రూపాల్లో డ్యూటీ పెయిడ్‌ లిక్కర్‌ను బెల్టుషాపుల ద్వారా విక్రయిస్తున్నట్లు వెలుగు చూసింది.
* భార‌త ఎల‌క్ష‌న్ క‌మీష‌న‌ర్‌గా ఇవాళ అరుణ్ గోయ‌ల్ బాధ్య‌త‌లు స్వీక‌రించారు. రెండు రోజుల క్రితం ఆయ‌న‌కు కొత్త అపాయిట్మెంట్ ఇచ్చిన విష‌యం తెలిసిందే. భార‌త ఎన్నిక‌ల క‌మిష‌న్‌లో ముగ్గురు క‌మీష‌న‌ర్లు ఉంటారు. అయితే మే నెల‌లో సుశీల్ చంద్ర రిటైర్ కావ‌డంతో ఓ పోస్టు ఖాళీగా ఉంది. సీఈసీగా రాజీవ్ కుమార్ బాధ్య‌త‌లు స్వీక‌రించిన త‌ర్వాత అనుప్ చంద్ర పాండే మ‌రో క‌మీష‌న‌ర్‌గా ఉన్నారు.
* తెలంగాణను సీఎం కేసీఆర్‌ దేశానికి దిక్సూచిగా, మోడల్‌ రాష్ట్రంగా అభివృద్ధి చేస్తున్నారని మంత్రి కొప్పుల ఈశ్వర్‌ అన్నారు. కోటి ఎకరాలకు సాగునీరు అందించే మాటను నిలబెట్టుకొని, వ్యవసాయరంగంలో అద్భుతమైన ప్రగతిని సాధించామన్నారు. ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌ కుమార్‌, ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌తో కలిసి ఆయన వేములవాడ రాజన్నను దర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో అత్యధికంగా ధాన్యం పండించే పంజాబ్‌ను కూడా మనం అధిగమించామని చెప్పారు. మూడు కోట్లకుపైగా మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని పండిస్తున్నామని వెల్లడించారు.
* బీహార్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా వస్తున్న ఓ ట్రక్కు అదుపు తప్పి జనాలపైకి దూసుకెళ్లింది. ప్రమాదంలో 12 మంది మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి. వైశాలి జిల్లాలోని మన్హార్‌లో ఆదివారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది.
* మహారాష్ట్రలోని పుణెలో ఓ లారీ బీభత్సం సృష్టించింది. పుణె-బెంగళూరు రహదారిపై నవ్‌లే బ్రిడ్జి వద్ద ఆదివారం రాత్రి 9గంటల సమయంలో ఆయిల్‌ ట్యాంకర్‌ లారీ అతి వేగంతో వాహనాలపై దూసుకొచ్చింది. ఈ ప్రమాదంలో 47 వాహనాలు ధ్వంసమయ్యాయి. స్థానిక మీడియా కథనాల ప్రకారం.. లారీ బ్రేక్స్‌ ఫెయిల్‌ అవ్వడంతో అదుపుతప్పి ముందున్న వాహనాలపైకి దూసుకెళ్లినట్లు తెలుస్తోంది.
* ఏపీలోని అంబేద్కర్‌-కోనసీమ జిల్లా అంకంపాలెంలో తేనేటీగల దాడిలో 25 మంది మహిళలు గాయపడ్డారు. వీరిలో 10 మంది అపస్మారక స్థితిలోకి చేరుకోగా, ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నది.
కార్తిక వనభోజనానికి గ్రామస్థులు సమీప తోటలోకి వెళ్లారు. వంటచేసిన అనంతరం భోజనం చేస్తుండగా ఒక్కసారిగా తేనేటీగలు దాడి చేశాయి
* తమిళనాడు )లోని శివకాశిలో కొలువైన భద్రకాళి అమ్మన్ ఆలయ గోపురంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో రెండు అగ్నిమాపక శకటాలు హుటాహుటిన రంగప్రవేశం చేసి మంటలను అదుపులోకి తెచ్చాయి. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. గోపుర పునరుద్ధరణ పనులు జరుగుతుండగా ప్రమాదం సంభవించినట్టు చెబుతున్నారు. ప్రమాదాన్ని వెంటనే గమనించిన తమిళనాడు ఫైర్ అండ్ రెస్క్యూ సిబ్బంది 45 నిమిషాల్లో మంటలను అదుపు చేశారు. స్పెషల్ టాస్క్ ఫోర్స్ అధికారి (శివకాశి) ఆర్.అళగురాజ్ సారథ్యంలో అగ్నిమాపక సిబ్బంది టవర్ లోపల మెట్లగుండా పైకి చేరుకుని మంటలు ఆర్పివేశారు. ఆలయ సమీపంలో ఒక కార్యక్రమం కోసం బాణసంచా కాల్చడం ఈ ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉన్నాయి.
* తొలి ప్రైవేట్‌ రాకెట్‌ ప్రయోగం విజయంతో జోష్‌మీదున్న ఇస్రో.. మరో ప్రయోగానికి రెడీ అవుతోంది. ఈ నెల 26న సొంత రాకెట్‌ పీఎ్‌సఎల్‌వీ-సీ54 ప్రయోగానికి ఏర్పాట్లు చేస్తోంది. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌) నుంచి శనివారం ఉదయం 11:56 గంటలకు ఈ ప్రయోగం ఉంటుందని ఇస్రో తెలిపింది. ఈ రాకెట్‌ ద్వారా ఈవోఎస్‌-06 ఉపగ్రహం ఓషన్‌శాట్‌-3తోపాటు మరో ఎనిమిది నానో శాటిలైట్లను అంతరిక్షంలోకి పంపనుంది. వాటిలో భూటాన్‌కు చెందిన భూటాన్‌శాట్‌, పిక్సెల్‌ సంస్థకు చెందిన ఆనంద్‌, థైబోల్ట్‌కు చెందిన ధ్రువస్పేస్‌, ఆస్ట్రోకా్‌స్టతోపాటు అమెరికాకు చెందిన 4 ఉపగ్రహాలు ఉన్నాయి.
* ఐదు దశాబ్దాల సుదీర్ఘ చరిత్ర కల్గిన చారిత్రాత్మక బసవనగుడి వేరుశెనగ జాతర ఆదివారం లాంఛనంగా ప్రారంభం కానుంది. ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మైను వేరుశనగతో తులాభారం వేయనున్నారు. బసవనగుడి ప్రాంతం ఈ ప్రతిష్టాత్మక జాతరకు సన్నద్ధమైంది. జాతరలో భాగంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు, గ్రామీణ సంప్రదాయాలను తలపించే కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. దొడ్డగణపతి దేవస్థానానికి ప్రత్యేక అలంకరణ చేస్తున్నారు. బీబీఎంపీ(BBMP) స్పెషల్‌ కమిషనర్‌ జయరాం శనివారం జాతర ఏర్పాట్లను పరిశీలించారు. ఇప్పటికే బసవనగుడి చుట్టుపక్కల ప్రాంతాలకు రాష్ట్రంలోని పలు జిల్లాలతోపాటు ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు ప్రాంతాలనుంచి వేరుశెనగ రైతులు చేరుకుంటున్నారు. ఈసారి కెంపాబుది చెరువులో తెప్పోత్సవం ప్రధాన ఆకర్షణ కానుంది. థీమ్‌పార్కులో కూడా వేరుశనగ విక్రయాలకు అవకాశం కల్పించినట్టు స్థానిక నేత ఎన్‌ఆర్‌ రమేశ్‌ మీడియాకు తెలిపారు.
* చెంగల్పట్టు జిల్లా మహాబలిపురం బంగాళాఖాతం తీరంలో పల్లవ రాజుల శిల్పకళా నైపుణ్యంతో నిర్మించిన వారసత్వ భవనాలను ఇటలీ దేశానికి చెందిన 300 మంది ఆసక్తిగా వీక్షించారు. ప్రపంచంలో కరోనా మహమ్మారి ప్రభావం వల్ల అధిక మరణాలు ఎదుర్కొని మళ్లీ సహజ స్థితికి చేరుకున్న ఇటలీ దేశానికి చెందిన పర్యాటకులు రెండేళ్ల అనంతరం శుక్రవారం మహాబలిపురం అందాలు వీక్షించేందుకు తరలివచ్చారు. ఇక్కడ యునెస్కో గుర్తింపు పొందిన సముద్రతీర ఆలయం, అర్జున తపస్సు, పంచ పాండవుల రథం, శివా, విష్ణు సన్నిధులు, వెన్నముద్ద రాయి, పురాతన లైట్‌ హౌస్‌ తదితర వారసత్వ భవనాల వద్ద సందడి చేశారు.
* పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో జరిగిన సీఎం జగన్(Cm jagan) సభలో మహిళలకు ఘోర అవమానం జరిగింది. సీఎం సభలో నిరసన తెలుపుతారన్న ఉద్దేశంతో భద్రతా సిబ్బంది నానా హంగామా సృష్టించారు. మహిళలు వేసుకున్న నల్ల చున్నీలు… ఓణిలు తీసేసి సభకు రావాలని పోలీసులు ఓవరాక్షన్ చేశారు. తప్పని పరిస్థితుల్లో చున్నీలు.. ఓణిలు తీసేసి మహిళలు సభలోకి వెళ్లారు. చివరికి మహిళా ఉద్యోగులను కూడా పోలీసులు విడిచిపెట్టలేదు. పోలీసుల చర్యలపై మహిళలు, స్థానికులు మండిపడుతున్నారు.
* సోమశిల డ్యాం గేట్ల మెయింటినెన్స్ పనుల్లో నిర్లక్ష్యం వహిస్తున్నారు. నిధులు లేకపోవడమే అందుకు కారణం. 3,5,6,8,11,12 నెంబర్ల జలాశయం గేట్ల సీళ్ళు దెబ్బతిన్నాయి. దీంతో గేట్ల నుంచి నీరు భారీగా లీకవుతోంది. ఇప్పటికే డ్యాంకు ముప్పు ఉందని కేంద్ర బృందాలు రెండుసార్లు హెచ్చరించారు. అఫ్రాన్ మరమ్మత్తు పనులు నత్త నడకన సాగుతున్నాయి
* చైనా లో కరోనా కేసుల సంఖ్య 25,000 దాటడంతో మరోసారి పరిస్థితి ఆందోళకరంగా మారుతోంది. ఒక్క బీజింగ్‌ లోనే 500కు పైగా కేసులు నమోదు కావడంతో సిటీ అధికారులు అప్రమత్తమయ్యారు. వారాంతపు సెలవులు అయినందున ప్రజలు ఇళ్లకే పరిమితం కావాలని, రోజువారీ టెస్టింగ్‌లు చేయించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. దీంతో శనివారంనాడు బీజింగ్‌లో జనసంచారం తక్కువగా కనిపించింది. ఎక్కువ మంది ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. ఒక జిల్లా నుంచి మరో జిల్లాకు రాకపోకలు కుదించుకోవాలని, అనవసర ప్రయాణాలకు దూరంగా ఉండాలని పలు జిల్లాల అధికారులు ఆదేశాలు జారీ చేశారు.
* మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తును మరో రాష్ట్రానికి బదిలీ చేయాలనే పిటిషన్‌పై వచ్చే సోమవారం తీర్పు ఇవ్వనున్నట్లు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.నవంబర్‌ 21న (ఈరోజు) తీర్పు ఇవ్వనున్నట్లు గతంలో ప్రకటించిన సర్వోన్నత న్యాయస్థానం.. మరో వారంపాటు దాన్ని వాయిదా వేసింది. ఈ మేరకు జస్టిస్‌ ఎంఆర్‌ షా, జస్టిస్‌ ఎంఎం సుందరేష్‌ల ధర్మాసనం వెల్లడించింది.మరోవైపు ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎర్ర గంగిరెడ్డి బెయిల్‌ రద్దు చేయాలంటూ సీబీఐ దాఖలు చేసిన పిటిషన్‌ను కూడా సుప్రీంకోర్టు సోమవారానికి వాయిదా వేసింది. బెయిల్‌ రద్దు విషయం కూడా హత్య కేసు దర్యాప్తు బదిలీ అంశంతో ముడిపడి ఉన్నందున అదే రోజు విచారణ చేపడతామని ధర్మాసనం స్పష్టం చేసింది.
*కుటుంబ రాజకీయాలకు తాము వ్యతిరేకం అనే బీజేపీ, అచ్చం కుటుంబ రాజకీయాలను నమ్ముకుందనే ఆరోపణలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్‌ పార్టీలు గుజరాత్‌ ఎన్నికల్లో దాదాపు 20 స్థానాల్లో వారసులకు టికెట్లు ప్రకటించాయి. ప్రస్తుతం ఆయా స్థానాల్లో యువ నేతల మధ్య హోరాహోరీ పోరు సాగుతోంది. గెలుపుపై ఎవరికివారే ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్‌ పార్టీ 13 మంది వారసులకు టికెట్లు ప్రకటించగా, బీజేపీ ఏడుగురిని బరిలో నిలిపింది. కాంగ్రెస్‌ నుంచి 10 సార్లు ఎమ్మెల్యేగా గెలుపుగుర్రం ఎక్కిన మోహన్‌సింగ్‌ రత్వా ఇటీవల బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆయనను సంతృప్తి పరిచేందుకు బీజేపీ రత్వా కుమారుడు రాజేంద్ర సింగ్‌ రత్వాకు చోటాఉదెపూర్‌ సీటు కేటాయించింది. ఇదేసీటును కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర మాజీ మంత్రి నరేన్‌ రత్వా కుమారుడు సంగ్రామ్‌సింగ్‌ రత్వాకు కేటాయించింది.
*తాను పార్టీ మారుతున్నట్లుగా దుష్ప్రచారం చేస్తున్నారని ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్‌ ఏలేటి మహేశ్వర్‌రెడ్డి అన్నారు. కాంగ్రెస్‌ పార్టీలోకి ఎల్లో, పింక్‌, ఆరెంజ్‌ల నుంచి వచ్చిన వారు ఉన్నారని, తనపై కుట్ర ఎవరు చేస్తున్నారో అర్థం కావడం లేదని వ్యాఖ్యానించారు. ‘‘నిర్మల్‌ డీసీసీ అధ్యక్షుడు మారితే.. నాపైనా వార్తలు రాయడం ఎంతవరకు సమంజసం? చాలా మంది నాయకులు.. చాలా మందిని కాంగ్రె్‌సలోకి తీసుకువచ్చారు. రామారావు పటేల్‌కు 2018లో జానారెడ్డే సీటు ఇప్పించారు. హరిప్రియకు రేవంత్‌రెడ్డి టికెట్‌ ఇప్పించారు. వారు పార్టీ మారారు. సోయం బాపూరావుకు బోథ్‌ టికెట్‌ ఇప్పించారు. ఆయనా బీజేపీలోకి వెళ్లాడు. అందుకని జానారెడ్డి, రేవంత్‌రెడ్డినీ అనుమానిస్తారా?’’ అని ప్రశ్నించారు.