DailyDose

అమెరికాలో చైనా పోలీస్ స్టేషన్ లు ఎలా? ఎందుకు?

అమెరికాలో చైనా పోలీస్ స్టేషన్ లు ఎలా? ఎందుకు?

తనను తాను శక్తివంతంగా మార్చుకునేందుకు చైనా ఎంతకైనా తెగించేందుకు సిద్ధంగా ఉంది. చైనాలో మానవ హక్కుల కార్యకర్తలను రోజురోజుకు తన చర్యలతో ఆందోళనకు గురిచేస్తున్నాడు అధ్యక్షుడు జిన్ పింగ్. తాజాగా చైనా.. ప్రపంచవ్యాప్తంగా అక్రమంగా పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేసినట్లు సమాచారం. ఆయా దేశాల్లో చైనా తన పరిధిని సులువుగా విస్తరింపజేసుకుని ఎలాంటి భయం లేకుండా అక్కడి లా అండ్ ఆర్డర్ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నట్లు సమాచారం. దాదాపు 21 దేశాల్లో చైనా ఇలాంటి 30 అక్రమ పోలీస్ స్టేషన్లను నిర్మించిందని ఓ నివేదిక వెల్లడించింది కెనడాలోని పబ్లిక్ సెక్యూరిటీ బ్యూరో (PSB)కి అనుబంధంగా ఉన్న ఇటువంటి అనధికారిక పోలీసు సేవా స్టేషన్లు.. చైనా ప్రత్యర్థులను ఎదిరించేందుకు ఏర్పాటు చేసినట్లు స్థానిక మీడియాను ఉటంకిస్తూ ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం రిపోర్ట్ పేర్కొంది. స్థానిక మీడియా నివేదికల ప్రకారం కెనడా అంతటా పబ్లిక్ సెక్యూరిటీ బ్యూరోలకు (PSBs)అనధికారిక పోలీస్ సర్వీస్ స్టేషన్లు అనుబంధంగా ఉన్నాయి. వీటిలో కనీసం మూడు స్టేషన్లు గ్రేటర్ టొరంటో ప్రాంతంలోనే ఉన్నాయి.
https://fb.watch/g_YUL2ZnLS/
అంతేకాకుండా ఈ అక్రమ పోలీస్ స్టేషన్ల ద్వారా చైనా ప్రభుత్వం.. కొన్ని దేశాల్లో ఎన్నికలను ప్రభావితం చేస్తోందని నివేదిక పేర్కొంది. ఉక్రెయిన్ , ఫ్రాన్స్, స్పెయిన్, జర్మనీ, UK వంటి దేశాలు చైనీస్ పోలీస్ స్టేషన్‌ల కోసం ఇటువంటి వ్యవస్థలను కలిగి ఉన్నాయి. ఈ దేశాల్లోని నాయకులు చైనా యొక్క పెరుగుదల, క్షీణిస్తున్న మానవ హక్కుల రికార్డును పబ్లిక్ ఫోరమ్‌లలో ప్రశ్నిస్తున్నారరు. మానవ హక్కులు ఖైదు శిబిరాలు, కుటుంబాలను బలవంతంగా వేరు చేయడం, బలవంతంగా స్టెరిలైజేషన్‌తో సహా దేశవ్యాప్తంగా భద్రత పేరుతో చైనా అధికార కమ్యూనిస్ట్ పార్టీ విస్తృతంగా దుర్వినియోగానికి పాల్పడుతుందని పలువురు ఆరోపించారు.