Business

భారత్లో అడుగుపెడుతున్న టయోటా ఇన్నోవా జెనిక్స్ – TNI నేటి వాణిజ్యం

భారత్లో అడుగుపెడుతున్న టయోటా ఇన్నోవా జెనిక్స్ – TNI నేటి వాణిజ్యం

* ప్యాకేజ్డ్‌ వాటర్‌ వ్యాపార సంస్థ బిస్లరీని అమ్మనున్నట్లుగా ఆ కంపెనీ ఛైర్మన్‌ రమేశ్‌ చౌహాన్‌ వెల్లడించారు. కొనుగోలుదారుల కోసం వెతుకుతున్నట్లుగా తెలిపారు. అందులో భాగంగా టాటా కన్జ్యూమర్‌ ప్రొడక్ట్స్‌ లిమిటెడ్‌ సహా మరికొన్ని కంపెనీలతో చర్చలు జరుపుతున్నట్లుగా ఆయన చెప్పారు. అయితే టాటా గ్రూప్ తో రూ. 7 వేల కోట్లకు డీల్ ఓకే అయిందని వస్తోన్న వార్తలను రమేశ్‌ చౌహాన్‌ ఖండించారు. ఇక బిస్లరీ అమ్మకానికి గల కారణాలను రమేశ్‌ చౌహాన్‌ తెలిపారు. వ్యాపర నిర్వహణపై తన కుమార్తె జయంతి అంతగా ఇంట్రెస్ట్ చూపించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా వెల్లడించారు. జయంతి ప్రస్తుతం ఫ్యాషన్‌ డిజైనర్‌గా పనిచేస్తున్నారు. భారతదేశంలోనే అతిపెద్ద ప్యాకేజ్డ్ వాటర్ కంపెనీగా బిస్లరీకి పేరు ఉంది. కేవలం కేవలం రూ.4 లక్షల పెట్టుబడితో ప్రారంభించిన బిస్లరీ.. ఇప్పుడు రూ.7000 కోట్లకు విస్తరించింది. దీని వెనుక రమేశ్‌ చౌహాన్‌ కృషి ఎంతగానో ఉందన్నారు. బిస్లరీ ఇంటర్నేషనల్‌ కింద బిస్లరీ మినరల్‌ వాటర్‌తో పాటు హిమాలయన్‌ స్ప్రింగ్‌ వాటర్‌, ఫ్రీజ్‌ డ్రింక్‌, హ్యాండ్‌ ప్యూరిఫయర్‌ ఉత్పత్తులు కూడా ఉన్నాయి.

*జపనీస్ కార్ తయారీ సంస్థ ‘టయోటా’ తన కొత్త ‘ఇన్నోవా జెనిక్స్’ MPV ని ఇండోనేషియా మార్కెట్లో ముందు చెప్పినట్లుగానే అధికారికంగా ఆవిష్కరించింది.భారతీయ మార్కెట్లో ఇది ‘ఇన్నోవా హైక్రాస్’ పేరుతో ఆవిష్కరించబడుతుంది. ఈ కొత్త MPV గురించి ఇప్పటికే చాలా సమాచారం కంపెనీ వెల్లడించింది. దీని గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.. రండి.టయోటా కంపెనీ భారతీయ మార్కెట్లో ఈ లేటెస్ట్ MPV ని ఈ నెల 25 (2022 నవంబర్) న ఆవిష్కరించనున్నట్లు ఇప్పటికే వెల్లడించింది. గత కొన్ని రోజులుగా ఈ కొత్త కారుకు టయోటా డీలర్లు అనధికార బుకింగ్స్ కూడా స్వీకరిస్తున్నట్లు సమాచారం. ఇండోనేషియా మార్కెట్లో విడుదలైన ‘ఇన్నోవా జెనిక్స్’ మొత్తం డిజైన్‌లో ఎటువంటి పెద్ద మార్పులు లేకుండానే అడుగుపెట్టనుంది.

* ట్విట్టర్‌ బాస్‌ ఎలాన్‌ మస్క్‌కు ఉద్యోగులు ఝలక్‌ ఇచ్చారు. ఏకంగా 1,200 మంది తమ ఉద్యోగానికి రాజీనామా చేశారు. ట్విట్టర్‌ను కొనుగోలు చేసినప్పటి నుంచి సంస్థలో పలు మార్పులకు తెర లేపిన మస్క్‌.. ఉద్యోగులంతా కష్టపడి పనిచేయాలని, రోజుకు 12 గంటల చొప్పున వారానికి 80 గంటలైనా పనిచేయాలని స్పష్టం చేశారు. దీనిపై లిఖితపూర్వకంగా హామీ ఇవ్వాలని తేల్చి చెప్పారు. ఈ చర్యను వ్యతిరేకిస్తూ భారీ సంఖ్యలో ఉద్యోగులు ట్విట్టర్‌కు రాజీనామా చేశారు. వీరిలో ఎక్కువ మంది టెక్‌ విభాగానికి చెందిన ఉద్యోగులే ఉన్నట్టు తెలుస్తున్నది. దీంతో దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించిన మస్క్‌.. ఉద్యోగులకు అత్యవసర ఈ-మెయిల్స్‌ పంపారు. సంస్థలో పనిచేస్తున్న సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లంతా ఆదివారం మధ్యాహ్నం 2 గంటల్లోగా శాన్‌ఫ్రాన్సిస్కోలోని ప్రధాన కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఆదేశించారు.

*దేశీయ మార్కెట్లో విస్తరణకు బ్రాండ్లను కొనుగోలు చేయాలని నాట్కో భావిస్తోంది. ప్రస్తుతం ఈ దిశగా చర్చలు జరుగుతున్నాయని, కొద్ది నెలల్లో కొనుగోలు పూర్తి కావచ్చని నాట్కో సీఈఓ రాజీవ్‌ నన్నపనేని తెలిపారు. దేశీయ మార్కెట్లో కంపెనీ కార్యకలాపాలు స్థిరంగా ఉన్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో నాలుగు బ్రాండ్లను విడుదల చేసినట్లు ఆయన చెప్పారు. ప్రస్తుతం నాట్కో దేశీయ విక్రయాలు రూ.400 కోట్ల మేరకు ఉంది. రూ.100-150 కోట్ల విక్రయాలు ఉన్న బ్రాండ్‌ను ముందుగా కొనుగోలు చేయాలని కంపెనీ భావిస్తోంది. స్వల్పకాలానికి కంపెనీ అమ్మకాలను దేశీయ మార్కెట్‌ పెంచగలదని అంచనా వేస్తోంది.

*దేశంలోని ప్రముఖ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ పిరామల్ ఫైనాన్స్వి జయవాడలో గృహ ఉత్సవ్‌ను నిర్వహించనుంది. ఈ కార్యక్రమం ద్వారా ఉద్యోగులు, స్వయం ఉపాధి కలిగిన వారికి గృహ రుణాలను అందించనుంది. శని, ఆదివారాల్లో (19-20వ తేదీల్లో) ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు బాటా షోరూమ్ సర్వీస్ రోడ్డులో సంయుక్త స్టెల్లా కాలేజీ వద్ద వేదిక్ హాల్‌లో ‘గృహ ఉత్సవ్’ను నిర్వహించనున్నారు.

*ప్రభుత్వ రంగంలోని యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (యూబీఐ) షేర్లలో ర్యాలీ శుక్రవారం కూడా కొనసాగింది. బీఎస్‌ఈలో ఈ బ్యాంకు షేరు 5.05 శాతం లాభంతో రూ.73.85 వద్ద ముగిసింది. దీంతో యూబీఐ షేరు మార్కెట్‌ క్యాప్‌ రూ.50,474.61 కోట్లకు చేరింది. గత నెల రోజుల్లో యూబీఐ షేరు ఇన్వెస్టర్లకు 61 శాతం మేర లాభాలు పంచింది. ఇదే సమయంలో బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నాలుగు శాతం మాత్రమే పెరిగింది. ఈ ఏడాది మే 12న యూబీఐ షేరు రూ.33.55కు చేరి 52 వారాల కనిష్ఠ స్థాయిని తాకింది. ఆ ధరతో పోలిస్తే ప్రస్తుతం ఈ బ్యాంక్‌ షేరు మదుపరులకు రెట్టింపునకు పైగా లాభాలను అందించింది.

* బ్యాంకు కస్టమర్లకు కీలక అప్రమత్తత. కొన్ని బ్యాంకులు ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలను నిరంతరాయంగా కొనసాగించడాన్ని వ్యతిరేకిస్తూ ఏఐబీఈఏ రేపు (నవంబర్ 19, శనివారం) సమ్మె నిర్వహించతలపెట్టింది. ఈ ప్రభావం ప్రభుత్వరంగ బ్యాంకుల కార్యకలాపాలపై పడే అవకాశం ఉంది. ఇందులో బ్యాంకు ఆఫీసర్ల భాగస్వామ్యం లేకపోయినప్పటికీ సమ్మె తీవ్రత ఎక్కువగా ఉంటే మాత్రం నగదు డిపాజిట్లు, ఉపసంహరణ, చెక్కుల క్లియరెన్స్ వంటి కార్యకలాపాలకు అంతరాయం కలిగించే అవకాశాలున్నాయి. ఈ మేరకు ఇప్పటికే పలు బ్యాంకులు తమ కస్టమర్లను అప్రమత్తం చేశాయి.

*దేశీయ మార్కెట్లో విస్తరణకు బ్రాండ్లను కొనుగోలు చేయాలని నాట్కో భావిస్తోంది. ప్రస్తుతం ఈ దిశగా చర్చలు జరుగుతున్నాయని, కొద్ది నెలల్లో కొనుగోలు పూర్తి కావచ్చని నాట్కో సీఈఓ రాజీవ్‌ నన్నపనేని తెలిపారు. దేశీయ మార్కెట్లో కంపెనీ కార్యకలాపాలు స్థిరంగా ఉన్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో నాలుగు బ్రాండ్లను విడుదల చేసినట్లు ఆయన చెప్పారు. ప్రస్తుతం నాట్కో దేశీయ విక్రయాలు రూ.400 కోట్ల మేరకు ఉంది. రూ.100-150 కోట్ల విక్రయాలు ఉన్న బ్రాండ్‌ను ముందుగా కొనుగోలు చేయాలని కంపెనీ భావిస్తోంది. స్వల్పకాలానికి కంపెనీ అమ్మకాలను దేశీయ మార్కెట్‌ పెంచగలదని అంచనా వేస్తోంది.

*స్వల్ప లాభాలతో మొదలైన స్టాక్‌ మార్కెట్లు..
అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు అందడంతో దేశీయ స్టాక్‌ మార్కెట్లు స్వల్ప లాభాలతో మొదలయ్యాయి. సోమవారం ట్రేడింగ్‌లో స్టాక్‌ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్‌ 54.67 పాయింట్ల లాభంతో 61,199 పాయింట్ల వద్ద, నిఫ్టీ కూడా 17.85 పాయింట్ల స్వల్ప లాభంతో 18,177.80 పాయింట్ల వద్ద ట్రేడింగ్‌ మొదలైంది.

ప్రస్తుతం సెన్సెక్స్‌ 170 పాయింట్లు పెరిగి, 61,278 వద్ద, నిఫ్టీ 38.9 పెరిగి, 18,198 పాయింట్ల వద్ద ట్రేడవుతున్నది. అదానీ ఎంటర్‌ప్రైజెస్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, రిలయన్స్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, గ్రాసిమ్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, అదానీ పోర్ట్స్‌ లాభాల్లో ఉండగా.. పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌, ఓఎన్‌జీసీ, నెస్లే, బీపీసీఎల్‌, కొటక్‌ మహింద్రా బ్యాంకులు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఆసియా మార్కెట్లలో నిక్కీ, స్ట్రెయిట్‌ టైమ్స్‌ లాభాల్లో ఉండగా.. హాంగ్‌సెంగ్‌ నష్టాల్లో ఉన్నాయి.మరో వైపు ట్రేడింగ్‌లో డాలర్‌తో రూపాయి మారకం విలువ పెరిగింది. రూపాయి 12 పైసలు పెరిగి 181.72 వద్ద ట్రేడవుతున్నది. ఇదిలా ఉండగా గ్లోబల్‌ మార్కెట్లలో ముడి చమురు ధర 82 డాలర్లకు చేరింది. సోమవారం యూఎస్ మార్కెట్ నష్టాల్లో ముగిశాయి. డౌ జోన్స్ 0.13 శాతం, ఎస్‌అండ్‌పీ 0.39 శాతం, నాస్‌డాక్ 1.09 శాతం నష్టపోయాయి.