NRI-NRT

సింగపూర్ TCSS అధ్యక్షుడిగా గడప రమేష్

సింగపూర్ TCSS అధ్యక్షుడిగా గడప రమేష్

తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) (TCSS) 9వ వార్షిక సర్వ సభ్య సమావేశం ఆదివారం నాడు స్థానిక ఆర్య సమాజ్ లో నిర్వహించారు. 2021-22 ఆర్థికాంశాలపై చర్చించారు. నూతన అధ్యక్షుడిగా గడప రమేష్‌బాబు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నికల అధికారులుగా వినయ్ కుమార్, ముద్రకోల నవీన్ వ్యవహరించారు. 2022-2023 ఆర్థిక సంవత్సరానికి ఆడిటర్లుగా మద్దికుంట్ల రాజు, శేఖర్ రెడ్డి ఓరుగంటిలను ఎన్నుకున్నారు.

ప్రస్తుత అధ్యక్షులు నీలం మహేందర్, సొసైటీ సంస్థాగత అధ్యక్షులు బండా మాధవ రెడ్డి, గర్రెపల్లి శ్రీనివాస్, ప్రవీణ్ కుమార్ చెన్నోజ్వల, గార్లపాటి లక్ష్మారెడ్డి, కొల్లూరి శ్రీధర్, గింజల సురేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

*** నూతన కార్యవర్గం:
* అధ్యక్షులు గడప రమేష్ బాబు

* ప్రధాన కార్యదర్శి బసిక ప్రశాంత్ రెడ్డి

* కోశాధికారి జూలూరి సంతోష్ కుమార్

* సంస్థాగత కార్యదర్శి కాసర్ల శ్రీనివాసరావు

* ఉపాధ్యక్షులు నల్ల భాస్కర్ గుప్త, గోనె నరేందర్ రెడ్డి, మిర్యాల సునీత రెడ్డి, దుర్గ ప్రసాద్ మంగలి

* ప్రాంతీయ కార్యదర్శులు, నంగునూరి వెంకట రమణ, బొండుగుల రాము, నడికట్ల భాస్కర్, రవికృష్ణ విజ్జాపూర్,

* కార్యవర్గ సభ్యులు పెరుకు శివ రామ్ ప్రసాద్, అనుపురం శ్రీనివాస్, బొడ్ల రోజా రమణి , శివ ప్రసాద్ ఆవుల, శశిధర్ రెడ్డి, ప్రవీణ్ మామిడాల, సతీష్ పెసరు, రాధికా రెడ్డి, సదానందం అందె, రవి చైతణ్య మైసా, విజయ మోహన్ వెంగళ