Politics

హైదరాబాదులో రాష్ట్రపతి శీతాకాల విడిది

హైదరాబాదులో రాష్ట్రపతి శీతాకాల విడిది

రాష్ట్రపతి శీతాకాల విడిది

శీతాకాల విడిది కోసం హైదరాబాదుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.

డిసెంబర్ 28, 29, 30 తేదీల్లో మూడు రోజులపాటు రాష్ట్రపతి పర్యటన.

ఏర్పాట్లు చేస్తోన్న రాష్ట్ర ప్రభుత్వ సాధారణ పరిపాలన శాఖ ప్రోటోకాల్ విభాగం.

డిసెంబర్ 28 వ తేదీ ఉదయం ప్రత్యేక విమానంలో హైదరాబాదు చేరిక.

డిసెంబర్ 29 వ తేదీ బొల్లారం రాష్ట్రపతి నిలయంలో వివిధ రంగాల ప్రముఖులు, అథితులతో భేటీ.

డిసెంబర్ 30 వ తేదీ సాయంత్రం ఢిల్లీకి తిరుగు ప్రయాణం.

సికింద్రాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో బస.

టెంటేటివ్ షెడ్యూల్ పంపిన ఢిల్లీలోని రాష్ట్రపతి నిలయం.

పోలీస్, ఆర్మీ, కంటోన్మెంట్ అధికారులు, బొల్లారం రాష్ట్రపతి నిలయం సిబ్బంది, జీఏడీ, ఇతర కీలక శాఖలతో త్వరలో సీఎస్ దగ్గర కో ఆర్డినేషన్ మీటింగ్.

2019 లో చివరిసారిగా అప్పటి రాష్ట్రపతి రాంనాథ్ కొవింద్ సదరన్ సోజోర్న్.

కోవిడ్ మహమ్మారి విజృంభణ నేపథ్యంలో 2020, 2021 ల్లో రాష్ట్రపతి దక్షిణాదిలో శీతాకాల విడిది రద్దు.

కరోనా ప్రభావం తగ్గిన నేపథ్యంలో ఈ ఏడాది [2022, డిసెంబర్] నుంచి శీతాకాల విడిది పునరుద్ధరణ.

దేశ 15 వ రాష్ట్రపతి హోదాలో మొట్ట మొదటిసారి శీతాకాల విడిదికి రానున్న ద్రౌపది ముర్ము.