Movies

దుబాయ్‌లో సంగీత చర్చలు

దుబాయ్‌లో సంగీత చర్చలు

నెల రోజుల వ్యవధిలోనే తల్లినీ, తండ్రినీ కోల్పోయిన మహేశ్‌బాబు ఆ దు:ఖం నుంచి తేరుకుని వర్క్‌ మోడ్‌లోకి వచ్చేశారు. తన సినిమాల మీద దృష్టి పెట్టారు. తివిక్రమ్‌ దర్శకత్వంలో ఆయన నటిస్తున్న చిత్రానికి సంబంధించి ఓ షెడ్యూల్‌ పూర్తయిన సంగతి తెలిసిందే. రెండో షెడ్యూల్‌ కోసం ప్లానింగ్‌ జరుగుతోంది. ఈ లోపు పాటలను ఫైనలైజ్‌ చేద్దామని దుబాయ్‌లో సంగీత దర్శకుడు తమన్‌ సారథ్యంలో సంగీత చర్చలు ప్రారంభించారు. ఇందులో పాల్గొనడం కోసమే మహేశ్‌, దర్శకుడు త్రివిక్రమ్‌ ప్రత్యేకంగా దుబాయ్‌ వెళ్లారు. ముంబైలో ఓ యాడ్‌ షూటింగ్‌లో పాల్గొన్న మహేశ్‌ అటునుంచే దుబాయ్‌ వెళ్లారు. ఐదు రోజుల పాటు అక్కడే ఉంటారని సమాచారం.