Movies

నయనతార హారర్‌ థ్రిల్లర్‌

నయనతార హారర్‌ థ్రిల్లర్‌

నయనతార కథానాయికగా నటించిన హారర్‌ థ్రిల్లర్‌ ‘కనెక్ట్‌’. రౌడీ పిక్చర్స్‌ పతాకంపై విఘ్నేష్‌ శివన్‌ నిర్మించారు. అశ్విన్‌ శరవణన్‌ దర్శకుడు. ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్‌ సంస్థ తెలుగులో విడుదల చేస్తున్నది. ఈ నెల 22న ప్రేక్షకుల ముందుకురానుంది. ‘హారర్‌ థ్రిల్లర్స్‌ తీయడంలో దర్శకుడు శరవణన్‌ స్పెషలిస్ట్‌.గతంలో ఆయన తెరకెక్కించిన మయూరి, గేమ్‌ ఓవర్‌ చిత్రాలు మంచి విజయాలు సాధించాయి. ‘కనెక్ట్‌ సినిమాలో నయనతార పాత్ర చిత్రణ కొత్త పంథాలో ఉంటుంది. ఇటీవల విడుదల చేసిన టీజర్‌కు మంచి స్పందన లభించింది’ అని చిత్రబృందం తెలిపింది. అనుపమ్‌ఖేర్‌, సత్యరాజ్‌, వినయ్‌ రాయ్‌ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: మణికంఠన్‌ కృష్ణమాచారి, సంగీతం: పృథ్వి చంద్రశేఖర్‌.