DailyDose

బీజేపీ తలుపులు తట్టే TRS ఎమ్మెల్యే , ఎంపీల లిస్ట్ ఇదే…!

బీజేపీ తలుపులు తట్టే TRS ఎమ్మెల్యే , ఎంపీల లిస్ట్ ఇదే…!

ఎంత పెద్ద నేరస్థుడు అయినా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకొని తప్పు చేసినా తప్పించుకోలేరని బీజేపీ (BJP) ఎమ్మెల్యే రఘునందన్ రావు (Raghunandan rao) అన్నారు. కొంచెం ఆలస్యమైనా నేరస్థులను దర్యాప్తు సంస్థలు, అధికారులు పట్టుకుంటారని ఆయన తెలిపారు. సౌత్ గ్రూప్ కంపెనీ ఆప్ పార్టీ నేతలకు విజయ్ నాయర్‌ అనే మధ్యవర్తితో రూ. 100 కోట్లు పంపించారో లేదో చెప్పాలని రఘునందన్ రావు డిమాండ్ చేశారు. 100 కోట్లు ఎందుకు ఇచ్చారు.. పంజాబ్ ఎన్నికలకు రూ. 100 కోట్లు వెళ్లాయా లేదా అని బీజేపీ ఎమ్మెల్యే ప్రశ్నించారు. టీఆర్ఎస్ 104 మంది ఎమ్మెల్యేల్లో ముగ్గురు ఎమ్మెల్యేలకు మాత్రమే నోటీసులు వచ్చాయని రఘునందన్ రావు అన్నారు.. నేరం చేసిన వాళ్లకు మాత్రమే దర్యాప్తు సంస్థలు నోటీసులు ఇచ్చాయని రఘునందన్ రావు చెప్పారు.