Politics

తెలుగుదేశం కువైట్ ఆధ్వర్యములో ఇదేమి కర్మ కార్యక్రమం

తెలుగుదేశం కువైట్  ఆధ్వర్యములో ఇదేమి కర్మ కార్యక్రమం

తెలుగు దేశం పార్టీ గల్ఫ్ ఎన్నారై విభాగం సూచనలతో
ఎన్.ఆర్.ఐ తెలుగుదేశం కువైట్ కార్యవర్గం 2 అధ్యక్షుడు మద్దిన ఈశ్వర్ నాయుడు ఆధ్వర్యములో ఇదేమి కర్మ అనే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కువైట్లో ఉన్న పలు ఏరియాలనుండి తెలుగుదేశం అభిమానులు, కార్యకర్తలు హాజరయిన ఈ కార్యక్రమంలో అహ్మది గవర్నరేట్ కో-ఆర్డినేటర్ ఈదుపుగంటి దుర్గా ప్రసాద్ మరియు ముబారక్ అల్-కబీర్ గవర్నరేట్ కో-ఆర్డినేటర్ పెంచల్ రెడ్డి గారు, మైనార్టి కన్వీనర్ చాన్ బాషా, ఎంపవర్మెంట్ కో-ఆర్డినేటర్ కుదరవల్లి సుధాకర రావు తదితరులు పాల్గొని సమావేశాన్ని విజయవంతం చేశారు.