Politics

బెజవాడలో భారాస ఫ్లెక్సీలు

బెజవాడలో భారాస ఫ్లెక్సీలు

విజయవాడ నగరంలో మరోసారి భారత్‌ రాష్ట్ర సమితి పార్టీ ఫ్లెక్సీలు వెలిశాయి. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ జాతీయ పార్టీ ప్రకటనను స్వాగతిస్తూ ఆంధ్రప్రదేశ్‌లోని ఆయన అభిమానులు విజయవాడ నగరంలో పలు చోట్ల ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ఎన్నికల సంఘం తెరాసను భారాసగా గుర్తించడంపై ఆ పార్టీ అభిమానులు నగరంలోని ముఖ్య కూడళ్లలో ఫ్లెక్సీలను ఉంచారు. బందరు రోడ్డులోని స్టేడియం ఎదురుగా, కనకదుర్గమ్మ వారధి కూడలి వద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో విజయం సాధించాలని హోర్డింగ్‌లు పెట్టారు.