DailyDose

TNI నేటి నేర వార్తలు.. బైక్ ఢీకొని జింక మృతి తదితర వార్తలు

TNI నేటి నేర వార్తలు.. బైక్ ఢీకొని జింక మృతి తదితర వార్తలు

తిరుపతి జిల్లా.. చిట్టమూరు మండలం

💥మోటార్ సైకిల్ ఢీకొని గర్భం తో వున్న జింక మృతి 💥

చిట్టమూరు మండల పరిధిలోని యాకసిరి చెంగాలమ్మ మాను సమీపంలో ఆదివారం జింక అడవిని దాటుతుండగా గుర్తుతెలియని మోటార్ సైకిల్ జింకను ఢీకొట్టడంతో మృతి చెందినది.ఈ విషయాన్ని ప్రయాణికులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇవ్వడంతో ఫారెస్ట్ అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని వెటర్నరీ డాక్టర్ కి సమాచారం ఇవ్వడంతో జింకను పరిశీలించిన వెటర్నరీ డాక్టర్ జింక గర్భం దాల్చిందని కుడికాలు ,జబ్బ పూర్తిగా విరగడంతో గాయపడిన జింక మృతి చెందినట్లు ఆయన తెలిపారు.

**************************************

వంశీరామ్ బిల్డర్స్ ఐటి అప్డేట్స్:-

వంశిరం బిల్డర్స్ అధినేత సుబ్బారెడ్డి నివాసంలో ముగిసిన ఐటీ సోదాలు

ఆరు రోజులపాటు కొనసాగిన ఐటీ సోదాలు

పెద్ద ఎత్తున బంగారం, నగదు, ఆస్తుల డాక్యుమెంట్స్ ని గుర్తించిన ఐటీ అధికారులు
కృష్ణాజిల్లా
గన్నవరం

బాపులపాడు మండలం ఉమామహేశ్వరపురం వద్ద రోడ్డు ప్రమాదం.

హైదరాబాద్ నుండి రామచంద్రపురం వెళ్తున్న కారు అదుపు తప్పి కల్వర్టు ఢికొట్టింది.

ఈ ప్రమాదం ఓ వృద్దురాలు అక్కడిక్కడే దుర్మరణం.

మరో ఇద్దరు పరిస్థితి విషమం చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలింపు..

పోలీసులు మరణించిన మహిళను మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం గన్నవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

కారులో 5 గురు వ్యక్తులు ప్రయాణం చేస్తున్నారు. అందులో ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు.

************************************

కల్వకుంట్ల కవితపై జరుగుతున్న సిబిఐ విచారణ లైవ్ పెట్టాలని నారాయణ దర్యాప్తు సంస్థలకు విజ్ఞప్తి చేశారు, కేంద్ర ప్రభుత్వం ఈడి సిబిఐ లాంటి దర్యాప్తు సంస్థల ద్వారా రాజకీయ ప్రత్యర్థులపై కక్ష సాధింపు చర్యలు చేయటాన్ని నారాయణ ఖండించారు, న్యాయస్థానాలు సైతం సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు న్యాయస్థానాల చర్చలు ప్రత్యక్ష ప్రసారం చేయగా లేనిది సిబిఐ విచారణ ప్రత్యక్ష ప్రసారం చేయటంలో ఇబ్బంది ఏమిటి.

*****************************

Atchannaidu:తుఫాను బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలి..

అమరావతి: మాండస్ తుఫాను (Mandus Cyclone) ప్రభావంతో రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో రైతులు తీవ్రంగా నష్టపోయారని, తుఫాను బాధితులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని ఏపీ టీడీపీ (TDP) అధ్యక్షుడు అచ్చెన్నాయుడు (Atchannaidu) ప్రభుత్వాన్ని కోరారు.ఆదివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ రైతులకు నష్టపరిహారం అందించాలని, పాడైపోయిన పంటలను ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి జగన్ (CM Jagan) రైతుల సంక్షేమాన్ని పత్రికా ప్రకటనలు, ప్రసంగాలకే పరిమితం చేశారని విమర్శించారు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరలను అందించి రైతులను ఆదుకోవాలన్నారు. ప్రభుత్వం వెంటనే క్షేత్రస్థాయిలో పర్యటించి నష్టపోయిన పంటలను ఎన్యూమరేషన్ (పంట నష్టాన్ని అంచనా) చేపట్టాలని డిమాండ్ చేశారు.
ఇప్పటికీ అన్నమయ్య డ్యామ్ బాధితులకు ప్రభుత్వం నయాపైసా సాయం అందించలేదని అచ్చెన్నాయుడు ఆరోపించారు. ఇళ్లు కొట్టుకుపోయి కట్టుబట్టలతో నడిరోడ్డున పడిన కుటుంబాలకు ఆశ్రయం కల్పించలేదని, ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని పూర్తిగా గాలికొదిలేయడాన్ని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వ్యవసాయరంగం సంక్షోభంలో కూరుకుపోయిందని అచ్చెన్నాయుడు ఆరోపించారు.

*****************************

2f56ba30-bd52-463a-808b-8a6a35333fae
pichost

పత్రికల చానల్స్ యాజమాన్యాల ఒత్తిడి వల్ల విలేకరుల జీవితాలు బలి* ఈరోజు ప్రైమ్ నైన్ యాజమాన్యాల ఒత్తిడి తట్టుకోలేక తాడేపల్లిగూడెం రిపోర్టర్ రావూరి చెన్నకేశవ మరణించారు. యాజమాన్యం యాడ్స్ కోసం ఒత్తిడి చేయడం వల్ల, వడ్డీకి తెచ్చి అడ్వాన్స్ చెల్లించటం, టార్గెట్లు ఎక్కువగా పెంచడం, అడ్వాన్స్ మళ్లీ తెమ్మని ఒత్తిడి చేయడం వల్ల చెన్నకేశవ పొద్దుటి నుండి యాడ్లు కోసం తిరిగి తిరిగి తాడేపల్లిగూడెం ఆర్టీసీ బస్టాండ్ కు వచ్చి పడిపోయి మరణించాడు .యాజమాన్యాల జీతాల ఇవ్వక ,యాడ్స్ కోసం ఒత్తిడి చేయడం వల్ల అనేకమంది విలేకరులు గతంలో మరణించారు. రెండు సంవత్సరాల క్రితం రాజమండ్రి స్టాఫ్ రిపోర్టర్ జుట్ట గణపతి యాజమాన్యాల ఒత్తిడి తో అప్పులు చేసి ,యాడ్స్ బిల్లులు చెల్లించి ,కుటుంబాన్ని పోషించ లే క .అప్పులు తీర్చలేని పరిస్థితిలో కరోనా వచ్చి మరణించారు. ఆయనకు ముగ్గురు కుమార్తెలు, ముగ్గురు చదువులు పూర్తవక తల్లి కుటుంబాన్ని పోషించలేక అప్పులు తీర్చలేక బాధపడుతున్నారు. ప్రభుత్వం కరోనాతో మరణించిన వారికి ఐదు లక్షల ఇస్తానని జీవో తెచ్చి, అమలు చేయడం లేదు. ప్రభుత్వం ఇప్పుడు అయినా కరోనాతో మరణించిన వారికి ఐదు లక్షలు ఇప్పించాలని కోరుతున్నారు.

****************
54c25376-5ab5-4f61-b4ca-de131f494b89

◼️ || తెలుగు మీడియా ఛానల్ పై కేసు నమోదు || ◼️

ఆదిభట్ల యువతి ఫోటో పబ్లిష్ చేసిన న్యూస్ ఛానల్ ఎన్టీవీ కేసు నమోదు

కిడ్నాప్ కేసులో యువతి చిత్రాన్ని చాలా నిర్లక్ష్యంగా ప్రసారం చేసినందుకు Ntv న్యూస్ పై ఫిర్యాదు!