NRI-NRT

18న ఖమ్మంలో తానా సాంస్కృతిక ఉత్సవం..

18న ఖమ్మంలో తానా సాంస్కృతిక ఉత్సవం..

తానా చైతన్య స్రవంతి కార్యక్రమంలో భాగంగా ఖమ్మంలో వచ్చే 18వ తేదీన సాంస్కృతిక ఉత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు బత్తినేని చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో నిర్వహించే ఈ కార్యక్రమంలో తెలంగాణకు చెందిన 250 మంది కళాకారులు వివిధ కళారూపాలను ప్రదర్శించనున్నారు తానా అధ్యక్షులు లావు అంజయ్య చౌదరి ఫౌండేషన్ చైర్మన్ యార్లగడ్డ వెంకట్ రమణ తదితర తానా నేతలు ఈ ఉత్సవానికి హాజరవుతున్నట్లు ఉత్సవాల కోఆర్డినేటర్ బత్తినేని ప్రకాష్ తెలిపారు