DailyDose

దుబాయిలో కన్న బిడ్డను బంధించిన కసాయి తండ్రి

దుబాయిలో కన్న బిడ్డను బంధించిన కసాయి తండ్రి

ఎడారిలో రెండెళ్ళ పాపను బంధించిన తండ్రి
తెలుగునాట కేసు పెట్టబోమంటూ ఎడారిలో షరతు

కట్టుకోన్న భార్యను అదనపు కట్నం కొరకు వేధించడంతో పాటు ఆడబిడ్డ జన్మించినందుకు కనీసం చూడలేని ఆ కసాయి పసి తండ్రి నేడు అరబ్బు గడ్డ పై అదే చిన్నారిను చట్టపరంగా బందీగా చేసాడు.
​దుబాయిలోని తెలుగు ప్రముఖులందరు మరియ రాష్ట్ర ప్రభుత్వ అధ్వర్యంలోని ఎపి ఎన్నార్టీ ప్రతినిధుల సమక్షంలో తాను చేసుకోన్న ఒప్పందాన్ని కేవలం గంట వ్యవధిలోపె ఉల్లంఘించి తాను బిడ్డ పై ఉన్న (సఫర్ మనా) ప్రయాణ నిషేధాన్ని తొలగించేది లేదని భీష్మీంచుకోన్నాడు. తన పై భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ లో ఏలాంటి సివిల్, క్రిమినల్ కేసులు పెట్టబోమంటూ ముందస్తు హామి ఇవ్వాలంటూ అనూహ్యంగా మరో షరతు విధించి తండ్రి అవినాష్ జారుకోన్నాడు.
​మాతృమూర్తి లేకుండా ఒక్క క్షణం ఉండలేని పాలు త్రాగే పసి బిడ్డ అయిన భవిష్యను తల్లి కావ్య నుండి దూరం చేస్తూ పాపను లాక్కోని తన వద్ద ఉంచుకోని తల్లిను మాత్రం గెంటేయడంతో అమె గత్యంతరం లేని పరిస్ధితులలో తన సహాయార్ధం వచ్చిన తల్లిదండ్రులతో కలిసి ఆదివారం రాత్రి శ్రీకాకుళం జిల్లాకు వెళ్ళిపోయింది. అల్లుడి వివాదంలో ఒత్తిడికు లోనయి ఆనారోగ్యం పాలయిన మామ డోకి జగద్వీశర్ వద్ద దిర్హాంలన్ని ఖర్చు కావడం, పైగా అల్లుడు ఏ క్షణంలోనైనా తమకు తెలియని ఇస్లామిక్ చట్టాలను ఆధారంగా చేసుకోని మరేదైన కేసు పెట్టించి నరకయాతన పెడుతాడనె ఆందోళనతో తన బిడ్డ మరియు భార్యను తీసుకోని భారతదేశానికి తిరుగుపయనమయ్యాడు.
​ఆడపిల్ల పుట్టిందని కనీసం చూడడానికి రాలేని తండ్రి, పరాయి గడ్డపై ఆ పాప ఆలనపాలన ఏ విధంగా చూస్తోడోంటూ తల్లి కావ్య కన్నీరుమున్నీరయిన దృష్యం విమానశ్రాయం వద్ద అందర్ని కలిచివేసింది.
​అవినాష్ షార్జా నగరంలోని అబు శగ్రాలో నివాసముంటుండగా అక్కడి నుండి 114 కిలో మీటర్ల దూరంలో ఉన్న ఆబుధాబిలోని అల్ ఖలీఫా పారిశ్రామిక జోన్ లోని ఒక ప్రముఖ ఆల్యూమినియం పరిశ్రమలో పని చేస్తుంటాడు. అవినాష్ కు విధులకు వెళ్తె ఇంట్లో ఆ చిన్నారిను చూసేదెవరనేది ఇప్పుడు అంతు పట్టని ప్రశ్న.