Politics

“చంద్రబాబు”పై మంత్రి హరీష్ చిందులు…

“చంద్రబాబు”పై మంత్రి హరీష్ చిందులు…

బీజేపీతో పొత్తు పెట్టుకోవాలనే చంద్రబాబు డ్రామాలు.. ఏపీలో చెల్లని రూపాయి ఇక్కడ చెల్లుతుందా?: హరీష్ రావు ఫైర్

బీజేపీతో పొత్తు పెట్టుకోవాలనే చంద్రబాబు డ్రామాలు.. ఏపీలో చెల్లని రూపాయి ఇక్కడ చెల్లుతుందా?: హరీష్ రావు ఫైర్ అయ్యారు.

తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడుపై బీఆర్ఎస్‌ పార్టీలు నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో మళ్లీ రాజకీయం చేయాలని చూస్తున్న చంద్రబాబును ఇక్కడి ప్రజలు నమ్మే పరిస్థితి లేదని అంటున్నారు. 

తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడుపై బీఆర్ఎస్‌ పార్టీలు నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో మళ్లీ రాజకీయం చేయాలని చూస్తున్న చంద్రబాబును ఇక్కడి ప్రజలు నమ్మే పరిస్థితి లేదని అంటున్నారు. ఉమ్మడి రాష్ట్రానికి సీఎంగా ఉన్న సమయంలో చంద్రబాబు తెలంగాణకు చేసిందేమి లేదని మండిపడుతున్నారు. మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. చంద్రబాబును ఆంద్రప్రదేశ్ ప్రజలే పాలన బాగోలేదని చిత్తుచిత్తుగా  ఓడించారని విమర్శించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు పాలనలో తెలంగాణ ప్రాంతం అత్యంత దోపిడికి, నిర్లక్ష్యానికి గురైందని విమర్శించారు. తెలంగాణకు తీవ్రమైన అన్యాయం చేసిన వ్యక్తి చంద్రబాబు అని అన్నారు. చంద్రబాబు హయాంలో అతి ఎక్కువ రైతు ఆత్మహత్యలు జరిగాయని విమర్శించారు. 

ఆనాడూ యువత ఉద్యోగాలు, అభివృద్ది గురించి అడిగితే.. నక్సలైట్ల పేరుతో కాల్చి చంపించారని ఆరోపించారు. హైదరాబాద్ ఫ్రీజోన్ పేరుతో ఇక్కడి విద్యార్థుల నోట్లో మట్టి కొట్టిన వ్యక్తి చంద్రబాబు అని విమర్శించారు. రైతులు ఉచిత కరెంట్ ఇవ్వమని హైదరాబాద్‌కు వస్తే.. బషీర్‌బాగ్ చౌరస్తాలో పిట్టల్లాగా కాల్చి చంపిన చరిత్ర చంద్రబాబుది అని విమర్శించారు. రైతులకు ఉచిత కరెంట్ కావాలంటే.. అది సాధ్యం కాదని, తీగలపై బట్టలు ఆరేసుకోవాలని రైతులను అవహేళన చేసిన చరిత్ర చంద్రబాబుది అని విమర్శించారు. చంద్రబాబు దారుణాలను తెలంగాణ ప్రజలు ఇంకా మర్చిపోలేదని అన్నారు. కోడి కుస్తుందంటే అది ఆయన వల్లేనని అనేలా చంద్రబాబు మాట్లాడుతుంటారని.. ఆయన మాటలపై తెలంగాణ ప్రజలకు పూర్తి స్థాయి స్పష్టత ఉందన్నారు.

చంద్రబాబు వ్యవసాయం దండగ అంటే.. సీఎం కేసీఆర్ పండగ చేసి చూపించారని చెప్పారు. చంద్రబాబువి మాటలని.. తమవి చేతలని అన్నారు. తెలంగాణ గురించి, తెలంగాణ ప్రజల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదన్నారు. చంద్రబాబు రైతుల గురించి మాట్లాడుతుంటే హాస్యాస్పదంగా ఉందన్నారు. 
2018లో చంద్రబాబు మహాకూటమి పేరుతో తెలంగాణపై కుట్ర చేసే ప్రయత్నం చేశారని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని ఇప్పుడు తెలంగాణలో చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నారని ఆరోపించారు. తెలంగాణలో బలం ఉందని చూపించుకుని.. ఏపీలో బీజేపీతో పొత్తు పెట్టుకోవాలనేదే చంద్రబాబు ఆలోచన అని విమర్శించారు. చంద్రబాబు ప్రయత్నాలతో తమకేం భయం లేదని అన్నారు. 2018లో మహాకూటమి పెడితే.. చంద్రబాబు దెబ్బకు అది పత్తా లేకుండా పోయిందని ఎద్దేవా చేశారు. చంద్రబాబు తెలంగాణలో ఎన్ని డ్రామాలు చేసిన ఆయనకు ఒరిగేదేమి లేదన్నారు. ఆంధ్రలో చెల్లని రూపాయి.. తెలంగాణలో చెల్లుతుందా? అని ప్రశ్నించారు. ఎన్టీఆర్ గురించి మాట్లాడే హక్కు కూడా చంద్రబాబుకు లేదన్నారు. ఎన్టీఆర్ గురించి మాట్లాడటమంటే.. చెట్టు పేరు చెప్పుకుని కాయాలు అమ్ముకోవడమేనని అన్నారు. ఇప్పుడు ఉన్న తెలుగుదేశం పార్టీ.. ఎన్టీఆర్ పెట్టినప్పుడు ఉన్న పార్టీ కాదని అన్నారు. ఎన్టీఆర్‌కు చంద్రబాబు ఏం చేశాడో తెలుగు ప్రజలు తెలియనది కాదు కదా అని అన్నారు.