Movies

నటి కృష్ణవేణి .. 98వ జయంతి.. ఇప్పటికీ చలాకీగానే.

నటి కృష్ణవేణి .. 98వ జయంతి.. ఇప్పటికీ చలాకీగానే.

శ్రీమతి సి కృష్ణవేణి రంగస్థల నటి, సినీ నేపధ్య గాయని, నటి, నిర్మాత కూడా. 1936లో సతీఅనసూయ/ధృవ చిత్రంతో బాలనటిగా సినీ రంగప్రవేశం చేశారు. కథానాయకిగా తెలుగులో 15, కొన్ని తమిళ, కన్నడ భాషా చిత్రాలలో కూడా నటించారు. మీర్జాపురం రాజా గారితో వివాహం జరిగాక శోభనాచాల పతాకం క్రింద తీసిన మనదేశం సినిమాతో తెలుగు తెరకు శ్రీ ఎన్టీఆర్, శ్రీ ఎస్వీ ఆర్ నటులుగా మరియు శ్రీ ఘంటసాల వేంకటేశ్వర రావు సంగీత దర్శకుడిగా పరిచయమయ్యారు. 1957 లో తీసిన దాంపత్యం సినిమా ద్వారా శ్రీ రమేష్ నాయుడు కూడా సంగీత దర్శకుడు గా సినీరంగానికి పరిచయమయ్యారు. అంతకు మునుపు శ్రీ మీర్జాపురం రాజా తీసిన గొల్లభామ చిత్రం ద్వారా శ్రీమతి అంజలీదేవి నటిగా పరిచయం చేయబడ్డారు. నేడు శ్రీమతి కృష్ణవేణి 98 వ జన్మదినం.

గొల్లభామ 1947 సం!! చిత్రంలోని ఈ పాటలో శ్రీ కల్యాణం రఘురామయ్య గారితో శ్రీమతి కృష్ణవేణి గానం అభినయం చూడగలరు..
అలాగే 1949 లో వచ్చిన మనదేశం సినిమాలో శ్రీమతి కృష్ణవేణి అభినయించి అత్తాకోడళ్ల సంవాదగీతంకూడా చూడగలరు.