FashionNRI-NRT

అరబ్బు నేలలోని ఎత్తయిన అందమైన పర్వతాలపై తెలుగు ఉత్సవాలు.

అరబ్బు నేలలోని ఎత్తయిన అందమైన పర్వతాలపై తెలుగు ఉత్సవాలు.

d7fe473d-26e0-48a3-8e6f-b706360014d3
అసీర్ … గల్ఫ్ దేశాలలోని స్విట్జర్లాండ్. సువిశాల ఇసుక ఎడారులకు దూరంగా సముద్ర మట్టానికి 2200 మీటర్ల ఎత్తులో ఆకుపచ్చని పొదలు మరియు ఎల్లప్పుడు చల్లగా ఉండె ఆహ్లదకరమైన వాతవారణం ఈ ప్రాంతానికి సొంతం, అసీర్ రాష్ట్ర రాజధాని అభా.

ప్రకృతీ రమణమీయమైన వాతవారణానికి తోడుగా బలమైన అరబ్బు తెగలకు ఈ ప్రాంతం కేంద్రం, అధునీక సౌదీ అరేబియా నెలకోల్పడంలో ఈ ప్రాంత తెగల అరబ్బులు సౌదీ నవనిర్మాత అబ్దుల్ అజీజ్ కు అండగ నిలిచారు. ఈ రకమైన నేపథ్యం ఉన్న అభా ప్రాంతంలో తెలుగు వారితో భారతీయులు పెద్ద సంఖ్యలో పని చేస్తున్నారు. ప్రముఖ నగరాలు రియాధ్, జెద్ధాలకు దూరంగా ఉన్న అభాలో తెలుగు ప్రవాసీయులలో అందమైన అల్ సుదా మంచు పర్వతాలలోని రోడ్లను శుభ్రం చేసే కార్మికుల నుండి మోదలు కింగ్ ఖాలీద్ విశ్వవిద్యాలయంలో ఆచార్యుల వరకకు అందరు ఉన్నారు, వీరు సదూర ప్రాంతాలలో ఉన్న రియాధ్, జెద్ధా నగరాలకు వెళ్ళడం జరగదు, అందుకని ఆయా నగరాలలో తరుచుగా జరిగె సాంస్కృతిక మరియు సామాజిక కార్యక్రమాలలో పాల్గోనడం అనేది దాదపు శూన్యం.

ఈ పరిస్ధితులలో సౌదీ అరేబియాలోని తోటి తెలుగు వారందర్ని అనుసంధానం చేస్తున్న తెలుగు ప్రవాసీ సంఘమైన ‘సాటా’ మహా నగరాలైన రియాధ్, జెద్ధాయె కాదు కొండ ప్రాంతాలైన అల్ సుదా, అభా మోదలగు ప్రాంతాలలో ఉంటున్న తెలుగు ప్రవాసీయులను చెరువ కావడానికి మోదటిసారిగా అభాలో ఇటీవల భారతీయ ఉత్సవాన్ని నిర్వహించింది.

ఒక్క తెలుగు వారె కాకుండ, తెలుగు వారితో పాటు ఇతర దక్షిణాది రాష్ట్రాలైన కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన ప్రవాసీయులను కూడ కలుపుకోని నిర్వహించిన భారతీయ ఉత్సవంలో ముఖ్య అతిథిగా భారతీయ కాన్సుల్ జనర్ మోహమ్మద్ షాహీద్ ఆలం పాల్గోన్నారు. సాటా అధ్యక్షుడు కె.వి. మల్లేషన్ నాయకత్వంలో జరిగిన ఈ కార్యక్రమాన్ని అభాలో నివాసముండే సూర్యపేట జిల్లాకు చెందిన డాక్టర్ తెడ్ల జయశంకర్, స్వాతీ దంపతులు అన్ని తామై నిర్వహించి అతిధుల మనస్సును చూరగొన్నారు. భారతమాత గొప్పతనాన్ని తాము ప్రదర్శించామని మల్లేషన్ పెర్కోన్నారు.

కార్యక్రమంలో మజార్ హుస్సేన్, తేజు, లక్ష్మణ్, చారి రాజ్, ఖుద్రత్, సునీల్ కుమార్, జెన్నీ, విజయ నార్నేలు కూడ వివిధ భాద్యతలను నిర్వహించారు. తమిళనాడు సాంస్కృతిక కార్యక్రమాలను దేవ, హరీష్, రాంకుమార్ లు కర్ణాటక కార్యక్రమాలను విద్య శ్రేయస్ నిర్వహించారు. చిన్నారులు ప్రదర్శించిన నాటకాలు మరియు తెలుగు గాయకుడు అంజద్ హుస్సేన్ లు పాడిన సినీ పాటలు సభికులను ఉత్తేజపరిచాయి.

సౌదీ అరేబియాలో ఎడారిలోని ప్రతి అడుగడుగున తెలుగు వారిలో భారతమాత గొప్పతనాన్ని నింపడానికి సాటా ప్రయత్నిస్తుందని మల్లేషన్ పెర్కోన్నారు. ఇందులో భాగంగా అన్ని ప్రాంతాలలో కులమతాలకు అతీతంగా వివిధ పండుగలు మరియు పిల్లల ప్రదర్శనలు, సాంస్కృతిక, వినోద కార్యక్రమాలను సాటా నిర్వహిస్తుందని ఆయన అన్నారు. త్వరలో సంక్రాంతి ఉత్సవాలను కూడ దేశ వ్యాప్తంగా వివిధ నగరాలలో ఘనంగా నిర్వహిస్తున్నామని అందులో పెద్ద సంఖ్యలో పాల్గోనాలని మల్లేషన్ కోరారు.