Politics

మైనర్‌ బాలికను ప్రేమిస్తున్నానంటూ జనసేన పార్టీ నేత హల్ చల్ .

మైనర్‌ బాలికను ప్రేమిస్తున్నానంటూ జనసేన పార్టీ నేత హల్ చల్  .

🔴 వాట్సాప్‌లో అసభ్య మెసేజ్‌లు … అర్థ రాత్రి కత్తి తో అమ్మాయి ఇంటికి ❗️

◻️జనసేన పార్టీ తూర్పు నియోజకవర్గ నాయకుడు రాఘవరావు వేధింపుల పర్వం తాజాగా వెలుగులోకి వచ్చింది.

◻️గత కొంతకాలంగా నగరానికి చెందిన ఓ మైనర్‌ బాలికను రాఘవరావు వేధింపులకు గురిచేస్తున్నాడు.

◻️చినవాల్తేర్‌లోని ఓ అపార్టుమెంట్‌లో నివాసం ఉంటున్న ఆ బాలికకు వాట్సాప్‌లో అసభ్య మెసేజ్‌లు పెట్టడంతో పాటు ప్రేమించాలంటూ ఒత్తిడి చేస్తున్నాడు.

◻️ఈ క్రమంలో బుధవారం ఆ బాలిక నివాసం ఉంటున్న ప్లాట్‌కు మద్యం సేవించి వెళ్లిన రాఘవరావు మరోసారి ప్రేమ పేరుతో హల్‌ చల్‌ చేశాడు. ప్లాట్‌లో నుంచి బయటకు రావాలని ఆ బాలికను వేధించాడు.

◻️దీంతో ఆందోళనకు గురైన ఆ బాలిక స్నేహితులు, కుటుంబ సభ్యులకు సమాచారం అందించడంతో వారు వారించే ప్రయత్నం చేశారు. అయితే వారిపైనా తిట్ల పురాణంతో బెదిరింపులకు దిగాడు