గుంటూరులో ఉయ్యూరు ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్టీఆర్ జనతా వస్త్రాలు, చంద్రన్న కానుక పంపిణీలో అపశ్రుతి చోటు చేసుకుంది. చంద్రబాబు సభ ముగిసి ఆయన వెళ్లిపోయిన కాసేపటి తర్వాత తొక్కిసలాట జరిగింది. ఘటనా స్థలంలో ఒక మహిళ మృతి చెందగా, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో ఇద్దరు మృతి చెందారు. మరో ఇద్దరికి ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. తొక్కిసలాట సంఘటనపై టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు రూ.5 లక్షల ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించారు. బాధిత కుటుంబాలకు ఉయ్యూరు చారిటబుల్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు ఉయ్యూరు శ్రీనివాసరావు 20 లక్షల రూపాయల పరిహారం ప్రకటించారు.
గుంటూరులో ముగ్గురిని బలిగొన్న ఉయ్యూరు ఫౌండేషన్ కార్యక్రమం

Related tags :