Agriculture

TNI నేటి నేర వార్తలు.. వీఆర్వో వ్యవస్థను రద్దు చేయాలి

TNI   నేటి నేర వార్తలు.. వీఆర్వో వ్యవస్థను రద్దు చేయాలి

వీఆర్‌వో,విఆర్‌ఎ వ్యవస్థను రద్దు చేయాలని వైసిపి ఎమ్మెల్యే డిమాండ్ !

అధికార వైఎస్సార్ కాంగ్రెస్‌కు చెందిన యెమ్మిగనూరు ఎమ్మెల్యే కె చెన్నకేశవ రెడ్డి రెవెన్యూ శాఖ నుండి గ్రామ రెవెన్యూ సహాయకుల (విఆర్‌ఎ) వ్యవస్థను రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. శనివారం తన స్వగ్రామమైన యెమ్మిగనూరులో మీడియాతో మాట్లాడిన అధికార పార్టీ ఎమ్మెల్యే దశాబ్దాలుగా వీఆర్ఏలు ఉన్నారన్నారు. బ్రిటిష్ పాలకులు ప్రవేశపెట్టిన ఈ వ్యవస్థ అవినీతికి పర్యాయపదంగా మారింది. గ్రామ రెవెన్యూ అధికారుల (వీఆర్‌వో) వ్యవస్థ కూడా అవినీతితో నడుస్తోందని ఆయన ఆరోపించారు. వీఆర్వోలు, వీఆర్ఏలు ఇద్దరూ అట్టడుగు స్థాయి ప్రజలను దోచుకుంటున్నారని అన్నారు. ఈ రెండు కేటగిరీ ఉద్యోగుల వల్ల ప్రభుత్వ రెవెన్యూ రికార్డులు చెడిపోయాయని ఎమ్మెల్యే అన్నారు. ప్రస్తుత ప్రభుత్వం ప్రవేశపెట్టిన గ్రామ సచివాలయ వ్యవస్థను ప్రస్తావిస్తూ, విద్యార్హత ప్రకారం వీఆర్‌వో లను గ్రామ సచివాలయ సిబ్బందిగా మార్చాలని ఎమ్మెల్యే రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ ఉద్యోగులు చేస్తున్న అవినీతిని సీరియస్‌గా తీసుకోవాలని, ఈ వ్యవస్థను త్వరగా రద్దు చేయాలని చెన్నకేశవ రెడ్డి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి విజ్ఞప్తి చేశారు. ఈ వ్యవస్థను మార్చేందుకు ముఖ్యమంత్రికి స్పష్టమైన, ఆశాజనకమైన సలహాలు ఇవ్వాలని ఉన్నతాధికారులను అభ్యర్థించారు.

*******************

స్పందన పై విచారణ జరగలేదంటూ తిరిగి స్పందనలో ఫిర్యాదు చేసిన రైతులు
కాకినాడ,: పులిమేరు సొసైటీలో రుణాల పేరుతో రైతులను సొసైటీ అధికారి సత్యానందం గుమస్తా తాతాజీ లు మోసం చేస్తున్నారంటూ గత ఏడాది నవంబర్ 28న స్పందనలో ఫిర్యాదు చేసినప్పటికీ ఎటువంటి విచారణ చేపట్టకపోవడంతో ఈ సోమవారం మరల స్పందనలో ఫిర్యాదు చేశామంటూ పెద్దాపురం మండలం సిరివాడ గ్రామానికి చెందిన రైతులు ఇనకొండ వీర వెంకట తమ్మి రాజు, ఇనకొండ వీర గోవింద నూకరాజులు తిరిగి స్పందనలో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పులిమేరు సొసైటీలో సభ్యులుగా ఉన్న తాము రుణం తీసుకోవడం జరిగిందని, తిరిగి రుణం చెల్లిద్దామంటే తాము తీసుకున్న రుణానికి, పులి మీరు సొసైటీ అధికారి సత్యానందం చెబుతున్న లెక్కలకు ఏమాత్రం పొంతన లేకుండా ఉందన్నారు. తమకు పూర్తి వివరాలతో తీసుకున్న రుణం దానికి పడ్డ వడ్డీ వివరాలతో ఇమ్మంటే ఇప్పటివరకు ఇవ్వలేదని తెలిపారు. పెద్దాపురం డిసిసిబి బ్యాంకుకు వెళ్లిన వాళ్లు కూడా ఏమాత్రం వివరాలు చెప్పలేదని స్పష్టం చేశారు. అయితే నవంబర్ 28న స్పందనలో చేసిన ఫిర్యాదుకు నాలుగు రోజుల తర్వాత తానులేని సమయంలో డీసీసీబీ బ్యాంకు అధికారి, సొసైటీ గుమస్తాలు తమ ఇంటికి వచ్చి బ్యాంకు స్టేట్మెంట్ చూపించి తన అన్నగారి చేత సంతకాలు పెట్టించుకుని వెళ్లారన్నారు. అయితే బ్యాంకు వారు చెప్పినదానికి, సొసైటీ అధికారి సత్యానందములు ఇచ్చిన వివరాలకు సంబంధం లేదన్నారు. దీంతో సొసైటీ అధికారి అయిన సత్యానందం, బీసీసీబీ బ్యాంక్ అధికారి పైన విచారణ చేపట్టి తమకు న్యాయం చేయాలని మరో మారు స్పందనలో కలెక్టర్కు అర్జీ పెట్టడం జరిగిందని తెలిపారు. ఇప్పటికైనా న్యాయం జరగకపోతే తాము అధికారులపై చర్యలు తీసుకోవాలంటూ లోకాయుక్తను ఆశ్రయించగలమని స్పష్టం చేశారు.

**********
గుడివాడలో మాజీ మంత్రి శ్రీ కొడాలి శ్రీ వెంకటేశ్వరావు(నాని) ప్రెస్‌మీట్‌:

– బాబు, లోకేశ్‌లది శనిపాదం
– బాబు ఎక్కడ పాదం మోపినా చావులే..!
– బాబు పబ్లిసిటీ పిచ్చికి జనం బలి అవుతున్నారు
– బాబుకు బ్రహ్మరథం కాదు.. యమరథం
– “నారా”రూప రాక్షసుడు చంద్రబాబు
– కానుకల పేరిట మహిళలను బలిగొన్న దుర్మార్గుడు బాబు
– బాబు భార్య లాంటి వారే కాదా గుంటూరు సభకు వచ్చిన మహిళలు
– బాబును రాజకీయ సమాధి చేయకపోతే విధ్వంసాలు చేస్తాడు
-ః కొడాలి నాని

కొడాలి నాని మీడియాతో ఇంకా ఏం మాట్లాడారంటే…

చావులతో బాబు బోణీ
2022 చివరిలో కందుకూరులో ఇదేం ఖర్మ సభ పెట్టి 8 మంది చావుకు కారణమవ్వడం … నిన్న 2023 జనవరి 1న కానుకల పేరుతో సభ పెట్టి ముగ్గురు మహిళలను బలిగొన్న దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు. బాబుకి పబ్లిసిటీ పిచ్చి. తనకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని డ్రోన్ షాట్ల ద్వారా చూపించడానికి కందుకూరులోని ఇరుకు సందులో, డ్రైనేజీ గట్లపైన మీటింగ్‌ పెట్టి, ఆ రోడ్డును కూడా ఫ్లెక్సీలతో నింపేసి మరింత ఇరుకుగా మార్చేసి, వాహనమెక్కి మైఖేల్‌ జాక్సన్‌లా చంద్రబాబు మైకు పుచ్చుకుని జనాన్ని ఇంకా ముందుకు.. ఇంకా ముందుకంటూ వారిని ఇరుకు సందులోకి తీసుకెళ్లాడు. దాంతో తొక్కిసలాట జరిగి 8 మంది ప్రాణాలను బలిగొన్న దుర్మార్గుడు చంద్రబాబు. … అని మాజీ మంత్రి కొడాలి నాని మీడియా సమావేశంలో తూర్పారపట్టారు.

కానుకల పేరిట చావులు…
నిన్న గుంటూరులో చంద్రన్న కానుకల పేరుతో ప్రచారం చేసి, పేదమహిళలకు పట్టుచీరలు ఇస్తాం…ఏడాదికి సరిపడా కానుకలు ఇస్తామంటూ …ఎన్‌ఆర్‌ఐ ఉయ్యూరు ఫౌండేషన్‌ వాళ్లు 30 వేల మంది మహిళలకు స్లిప్పులు పంచారు. ఆదివారం మధ్యాహ్నం 1.30 ప్రాంతానికే పేదంతా వస్తే … బాబుకు బుద్ధి లేకుండా ఎండలో మహిళలు మాడిపోతున్నారని కూడా గుర్తించకుండా ఏసీ రూములో కూర్చుని, సాయంత్రం చల్లబడిన తర్వాత 5.30కు మైదానానికి వెళ్లాడని నాని దుయ్యబట్టారు. ఫౌండేషన్‌ వంటి సంస్థలు సభను పెట్టినప్పుడు తమ కార్యక్రమాలకు సంబంధించి మాట్లాడేలా చూస్తారు. ఇందుకు భిన్నంగాఈ సభను జగన్‌మోహన్‌ రెడ్డి గారిని తిట్టే కార్యక్రమంలా మార్చారు. 30 వేల మంది మహిళలు వచ్చారు. వారిలో ఓ నలుగురికి బాబు వేదికపై కానుకలు పంచి, తన దారిన తాను వెళ్లిపోయాడని నాని విమర్శించారు.

ఈ మరణాలకు బాధ్యుడు బాబే?
పనీ పాటా లేని ఆలపాటి రాజా లాంటి టీడీపీ నేతలు.. టోకెన్లు పట్టుకు రండి కానుకలు ఇస్తామంటే ఎక్కడ కానుకలు అందవోనని మహిళలంతా తోసుకుంటూ వెళ్లి, అందులో ముగ్గురు చనిపోతే దానికి బాధ్యుడు చంద్రబాబు కాదా? 40 ఏళ్ళ ఇండస్ట్రీ, 14 ఏళ్ళ ముఖ్యమంత్రి అని చెప్పే చంద్రబాబు- బుద్ధి, జ్ఞానం లేకుండా ఇలాంటి కార్యక్రమాలకు వెళ్ళి పేదల ప్రాణాలు తీస్తాడా? అని నాని ప్రశ్నించారు. ఒక ఫౌండేషన్‌ వారు.. 30 వేల మందికి కానుకలు ఇస్తామంటే … వారందరూ వస్తే ఎలా కంట్రోల్‌ చేయాలి? ఇవన్నీ అడగాల్సిన బాధ్యత చంద్రబాబుకు లేదా? అని నాని విమర్శించారు.

పోలీసు వైఫల్యం అంటూ బాబు, టీడీపీ దొంగ ఏడుపులు
సభల నిర్వహణలో మాకు 40 ఏళ్ల అనుభవముందని తెలుగుదేశం గొప్పలు చెబుతుంది. ఇలాంటి పిచ్చి కార్యక్రమాలు పెట్టింది చాలక ఇది ప్రభుత్వ వైఫల్యం, పోలీసు వైఫల్యమంటూ మాపై నిందలా? అదేమంటే.. తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలకు పోలీసులు ఆంక్షలు పెడుతున్నారంటూ బాబు, టీడీపీ నేతలు దొంగ ఏడుపులు.. ఇవన్నీ 420 కార్యక్రమాలు. టీడీపీ అధికారంలోకి వచ్చేస్తోందంటూ ఎక్కడో ఉన్న కొంతమంది బకరాలకు ఆశచూపడం, ఆ బకరాలకు నాలుగో, అయిదో సీట్లు ఇస్తానని చెప్పడం …వాళ్లు ఆ మాటలు నమ్మి ఈ బట్టలు పంచడం… 250, 300 రూపాయల విలువ చేసే చీరలు, అరకేజీ బెల్లం, పప్పు, ఉప్పు పంచడం జరిగింది. ఒక పది రోజులకైనా ఆ సరుకులు సరిపోతాయా? అని నాని వ్యాఖ్యానించారు. ఇది నూటికి నూరుపాళ్లూ బాబుకు పట్టిన పబ్లిసిటీ పిచ్చి. ఇది పోలీసుల వైఫల్యం కానేకాదు. బాబుకు 75 ఏళ్ల వయసులో మళ్లీ అధికారంలోకి రాకపోతే తెలుగుదేశం పార్టీ ఉండదు. అతని కొడుకు దేనికీ పనికిరాని పప్పు… …చవట దద్దమ్మ…సన్నాసి…అతనికి రాజకీయ భవిష్యత్తు ఉండదు. కాబట్టి ఏదో రకంగా జనాన్ని మభ్యపెట్టి, పబ్లిసిటీ చేసుకుని, పార్టీకేడర్‌లో తానేదో అధికారంలోకి వచ్చేస్తానని, కార్యకర్తలను కాపాడుకోవడానికి ఇలాంటి కార్యక్రమాలను బాబు ఉపయోగించుకుంటున్నాడని నాని అన్నారు. ఇలాంటి కార్యక్రమాల వల్ల తెలుగుదేశం కార్యకర్తలు, సామాన్య మహిళలు, ఎన్‌ఆర్‌ఐలు బలైపోతున్నారు.

ఎవరో ఒకరి కాళ్లు పట్టుకుని అధికారంలోకి…
బాబు తిన్నింటి వాసాలు లెక్కించే ద్రోహి. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి ఒకసారి, ఇంకోసారి వాజ్‌పేయి కాళ్లు పట్టుకుని, మరోసారి మోదీ, పవన్‌కళ్యాణ్‌ కాళ్లు పట్టుకుని, వాళ్ల బూట్లు నాకి అధికారంలోకి వచ్చాడు. చంద్రబాబు నాయుడు ఒక 420 . అతను వాగ్దానాలు చేసి, ఎప్పుడూ నెరవేర్చడని జనానికి తెలుసు. ఇలాంటి ఎన్ని కార్యక్రమాలు చేసినా బాబు అధికారంలోకి రాలేడని నాని కుండబద్దలు కొట్టారు. చంద్రబాబు ప్రోగ్రాముల నిర్వహించే తీరు గురించి నెలరోజులుగా నేను చెబుతున్నా…అతను ఎక్కడ సభలు పెట్టినా ఇరుకు సందులను ఎంపిక చేసుకునే ఏర్పాటు చేస్తాడు. ఎయిర్‌పోర్టులో దిగిన వెంటనే ఆ పార్లమెంటు నియోజకవర్గంలోని 700 కార్లు ర్యాలీపెట్టాలి. ఎక్కడ సభ పెడతాడో అక్కడ 10 వేల మందిని సమీకరిస్తున్నారు. చంద్రన్న కానుకలు అంటూ …డబ్బులిచ్చి సభలకు జనాన్ని తెస్తున్నారు. దీనివల్ల ప్రమాదముంది, ఇలాంటి కుట్రలు చేస్తున్నాడని నేను పది రోజులుగా చెబుతున్నా..రేపు కృష్ణా జిల్లా వచ్చినా, గుడివాడలో సభ పెట్టినా 700 కార్లతో ర్యాలీ, మరో 10వేల మందిని సమీకరిస్తారు. మెయిన్‌రోడ్లలో సభలు పెట్టడు. గుడివాడలో ఇరుకుసందుల్లో మీటింగ్‌ పెడతాడని నాని విమర్శించారు. ఇరుకు సందులనే బాబు ఎంపిక చేస్తాడు. అక్కడ బాబుకు బ్రహ్మరథం పట్టారని ప్రచారం చేసుకుంటాడు. అది బ్రహ్మరథం కాదు యమరథం. అతనిది, అతని కొడుకు లోకేష్ ది శనిపాదం.

ఆడి తప్పడమే బాబు నైజం….
జనానికి వచ్చే పింఛన్లు, సంక్షేమంలో కోతలు పెడతాడు. 2014 ఎన్నికల సందర్భంగా చేసిన వాగ్దానాల్లో డ్వాక్రా మహిళల రుణాలు రద్దు చేస్తామంటూ ప్రచారం చేసి, చేయలేదు. అతనొక కోతల రాయుడు… మహిళలకు సున్నావడ్డీకి రుణాలిస్తామని రూ. 11వేల కోట్లు వసూలు చేసి, రూ. 9400 కోట్లు పసుపు కుంకుమ కింద ఇచ్చాడు. అందుకే మహిళలు అతని మూతిపళ్లు రాలేలా కొట్టారు. రైతులకు రూ. 87 వేల కోట్లకు పైగా రుణమాఫీ చేస్తానని, బ్యాంకుల్లో తాకట్టు పెట్టుకున్న మహిళల మంగళ సూత్రాలు కూడా ఇంటికే తెచ్చిస్తానని చెప్పి, మోసం చేశాడు. దాంతో గత ఎన్నికల్లో రైతులు, మహిళలు ఓటు అనే ఆయుధంతో తన్నారు.
– మొదటి సంతకం,రెండో సంతకం, మూడో సంతకంగా …బెల్టు షాపులు తీసేస్తానని ఎక్కడా వాటిని తీయకపోగా, బార్‌ రూములకు పర్మిట్లు ఇచ్చాడు. అతనొక చీటర్, దొంగ. బాబును జనం నమ్మితే చావు తప్ప ఇంకొకటి ఉండదు. అందుకే బాబు ఎక్కడ సభలు నిర్వహిస్తానని చెప్పినా, పబ్లిక్‌ ప్రదేశాల్లో ఎక్కడా అతనికి పర్మిషన్‌ ఇవ్వకూడదు. ఎందుకంటే తండ్రీ కొడుకులిద్దరు శనిగాళ్లు. లోకేష్‌ పాదయాత్ర అని ఉదయం 9 గంటలకు ప్రకటించగానే రాత్రి 9 కల్లా 8 మంది కందుకూరులో చనిపోయారు. ఆ 8 మంది కూడా టీడీపీ కార్యకర్తలే, ఆ పార్టీ సానుభూతిపరులేనని నాని విచారం వ్యక్తం చేశారు.

జామాతా దశమగ్రహం…
నిన్న జనవరి 1న.. ఎవరైనా శుభం కోరుకుంటారు. మంచి జరగాలని అనుకుంటారు. బాబు గుంటూరులో కాలు పెట్టగానే ముగ్గురు మహిళలు చనిపోయారు. జామాతా దశమగ్రహం…అని ఎన్టీఆర్‌ బాబుకు పేరు పెట్టారు. శనిగ్రహం కన్నా ఇది పవర్‌పుల్‌ గ్రహం. నారారూప రాక్షసుడు చంద్రబాబు. బాబు పెట్టే సభలకు మహిళలు కాని, ఇంకెవరైనా సరే అతను పెట్టే ఆశలకు లొంగొద్దని కోరుతున్నాను. బాబు ఎక్కడ సభలు పెడుతున్నాడో, ఎందరు వస్తారో , ఎన్ని కార్లతో ర్యాలీ చేస్తున్నాడో ముందే పోలీసులకు సమాచారం తెలియాలి. నీ పబ్లిసిటీ కోసం జనాన్ని చంపుతావా? అని నాని ప్రశ్నించారు.
– నీ భార్యను అసెంబ్లీలో ఏదో అన్నారని వెక్కి వెక్కి ఏడ్చావు. గుంటూరులో నీ సభకు వచ్చిన మహిళలు కూడా నీ భార్య వంటి స్త్రీలు కారా? నీ పిల్లలు, నీ కోడలితో సమానం కాదా? అంతమందిని ఎలా తీసుకొస్తావు? అయిదారు గంటలు వారిని ఎలా అక్కడ నిరీక్షించేలా చేస్తావా? కొందరికి కాళ్లు విరిగాయి. ముఖ్యంగా మహిళా మూర్తులు బాబుతో జాగ్రత్తగా ఉండాలి. 2024 ఎన్నికల్లో బాబును గొయ్యి తీసి కప్పెట్టాలి. రాజకీయ సమాధి చేయకపోతే ఈ రాష్ట్రంలో చాలా విధ్వంసాలు జరుగుతాయని నాని వ్యాఖ్యానించారు.
——————————-
*****************************
అమరావతి..

పేర్ని నాని..

తెలంగాణ మంత్రులు భయంతో ఉన్నారు.

ఆ మంత్రులా ఏపీ పై మాట్లాడేది

తెలంగాణలో చూసుకోవాలి….శ్రీశైలంలో దొంగ కరెంటు…తీసుకునే వాళ్ళు ఉద్దరిస్తారా

ఏపీ ని వీళ్ళు ఏమి ఉద్దరిస్తారు.

రాష్ట్రానికి ద్రోహం చేసింది తెలంగాణ నేతలు

నవ్వుతారు అనేది లేకుండా సిగ్గులేకుండా తెలంగాణ మాట్లాడుతున్నారు.

కెఏ పాల్ కూడా 175 స్థానాలకు పోటీ చేశారు…బిఅరెస్ చేస్తే తప్పేంటి
*****************
తాడేపల్లి

ఉండవల్లి పంచాయితీ పై అనేక ఆరోపణలు

కాసులు ఇస్తే చాలు గడిచిన పంచాయితీ అనుమతి మీ చేతుల్లో ఉంటుంది

గత ప్రభుత్వ హాయంలో ఇళ్ళ నిర్మాణానికి అనుమతులు అమ్ముకున్న బ్రబుద్దులు

వేల రూపాయలు కూడా ఖర్చు కానీ పంచాయతీ అనుమతికి లక్షలు కుమ్మరించి అనుమతులు పొందిన ఇంటి యజమానులు

పాత పంచాయతీ చేతులో పెట్టుకుని రెన్యువల్ పేరుతో ఇల్లు నిర్మాణాలు

ఉండవల్లిలో వెలుగులోకి రాని ఇళ్ళ నిర్మాణం కోసం కావాల్సిన పంచాయతీ అనుమతి మాఫియా

ఉండవల్లిలో అక్రమంగా బిల్డింగ్ నిర్మిస్తున్నా పట్టించుకోని టౌన్ ప్లానింగ్ అధికారులు

కల్తీ నెయ్యి వ్యాపారి నిర్మిస్తున్న ఇంద్రభవనంపై చర్యలు తీసుకొని అధికారులు

అనుమతి లేకుండా బిల్డింగ్ నిర్మాణం

అక్రమ నిర్మాణంపై చర్యలు శూన్యం

పంచాయితీ సమయంలో తీసుకున్న అనుమతులతోనే బిల్డింగ్ నిర్మిస్తున్న నిర్ణీత సమయంలోనే నిర్మాణం చేపట్టారని టౌన్ ప్లానింగ్ అధికారుల వత్తాసు

అధికారులకు ముడపులు చెల్లించి, బిల్డింగ్ నిర్మిస్తున్న కల్తీ నెయ్యి వ్యాపారి??

లంచం తీసుకుని బిల్డింగ్ వైపు కన్నెత్తి చూడటంలేదని గుసగుసలు

పేద ప్రజలకు ఒక న్యాయం, బడా బాబులకు ఓ న్యాయం