Business

అమెరికాలో.. తెలుగోడి ఘరానా మోసం

అమెరికాలో భారతీయుడి ఘరానా మోసం..అమెరికాలో.. తెలుగోడి ఘరానా మోసం

కంపెనీ యొక్క కీలక సమాచారాన్ని బయటపెడతారేమో అన్న ఉద్దేశంతో.. పలు ఐటీ కంపెనీలు మూన్ లైటింగ్ వర్కులు, మూన్ వాకింగ్ వర్కులు చేయొద్దని తమ ఉద్యోగులను హెచ్చరిస్తున్నాయి. అయినా గానీ కొంతమంది డబ్బు కోసం మూన్ లైటింగ్ కి పాల్పడుతున్నారు. కంపెనీ యొక్క కీలక సమాచారాన్ని వేరే కంపెనీలకు అమ్మేస్తున్నారు. అలాంటి వాళ్ళని కంపెనీలు ఏరేస్తున్నాయనుకోండి అది వేరే విషయం. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే వ్యక్తి వేరే లెవల్. తాను పనిచేసిన కంపెనీ డేటాని తానే దొంగిలించి.. ఆ డేటా ద్వారా కోట్లు సంపాదించాడు. అలా అని ఆ డేటాని ఎవరికీ అమ్మలేదండోయ్. జస్ట్ చావు తెలివితేటలు ఉపయోగించాడు అంతే. ఇంతకే ఇతను ఏం చేసాడంటే?
అమెరికాలో ఉండే బరమ శివన్నారాయణ అనే భారతీయ అమెరికన్ ఐటీ నిపుణుడు.. కంపెనీ అంతర్గత సమాచారాలను తెలుసుకుని.. ఆ సమాచారంతో స్టాక్ మార్కెట్ లో పెట్టుబడులు పెట్టి 7.3 మిలియన్ డాలర్లు.. అంటే భారతీయ కరెన్సీలో 60 కోట్ల 42 లక్షలకు పైనే అక్రమంగా సంపాదించేసాడు. కాలిఫోర్నియా రాష్ట్రంలోని సిలికాన్ వ్యాలీలో పలు ఐటీ కంపెనీల్లో పనిచేసిన శివన్నారాయణ .. పాలో ఆల్టో నెట్వర్క్స్ అనే కంపెనీలో కాంట్రాక్టర్ గా పని చేసేవాడు. ఆ సమయంలో అదే సంస్థలో ఐటీ డిపార్ట్మెంట్ లో పని చేసే ఉద్యోగితో శివన్నారాయణ స్నేహం ఏర్పడింది. ఆ వ్యక్తి ద్వారా కంపెనీ యొక్క త్రైమాసిక ఆర్థిక ఫలితాలను అందరికన్నా ముందుగానే తెలుసుకుని.. స్టాక్ మార్కెట్ లో కంపెనీ ఆర్థిక ఫలితాల వెల్లడి కాకముందే.. ముందుగానే ఆ కంపెనీ యొక్క షేర్లను కొనేవాడు.2016 అక్టోబర్ నుంచి 2017 సెప్టెంబర్ వరకూ శివన్నారాయణకు ఆర్థిక సమాచారాన్ని ఇచ్చినట్టు సదరు ఐటీ ఉద్యోగి ఒప్పుకున్నాడు. అంతేకాదు.. ఈ సమాచారం ఆధారంగా శివన్నారాయణ, తాను ఇద్దరం స్టాక్ మార్కెట్ లో లాభాలు ఆర్జించినట్లు ఒప్పుకోవడంతో పోలీసులు ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. ఇంతటి ఘరానా మోసానికి పాల్పడిన శివన్నారాయణకు 25 ఏళ్ల శిక్ష పడే అవకాశం ఉందని అమెరికా పోలీసులు చెబుతున్నారు. కంపెనీ త్రైమాసిక ఆర్థిక సమాచారం కొంచెం ఎర్లీగా తెలుసుకున్నాడు, ఇందులో తప్పేముంది. అతను ఎవరినీ మోసం చేయలేదు కదా అని మీకు అనిపించవచ్చు. స్టాక్ మార్కెట్ అనేది పేకాట లాంటిది. ఇందులో బాగా అనుభవం ఉన్నవారే గెలుస్తారు. కొంతమంది చీటింగ్ చేసి గెలుస్తారు. మరి చీటింగ్ చేయడం నేరమే కదా.స్టాక్ మార్కెట్ లో ఒక కంపెనీని నమ్మి అనేకమంది పెట్టుబడులు పెడతారు. ఏ కంపెనీ నష్టాల్లో ఉందో, ఏ కంపెనీ లాభాల్లో ఉందో అనే సమాచారం స్టాక్ మార్కెట్ ఎక్స్ ఛేంజ్ బోర్డులో డిస్ప్లే చేస్తేనే కదా.. ఇన్వెస్టర్ కి ఆ కంపెనీ ప్రొఫైల్ ఏంటి, చరిత్ర ఏంటి అని తెలిసేది. ‘ఆ కంపెనీ గడిచిన 3 నెలల్లో ఇంత సంపాదించింది’ అని స్టాక్ మార్కెట్ లో చూపిస్తే.. అప్పుడు పెట్టుబడులు పెడతారు. కానీ ఈ శివన్నారాయణ ముందుగానే ఆ కంపెనీ రాబోయే రోజుల్లో లాభాలు ఆర్జిస్తుందని తెలుసుకుని.. పెట్టుబడులు పెట్టేవాడు. అలా అక్రమంగా 60 కోట్లు పైగా సంపాదించాడు. ప్రైస్ ఎక్కడ డ్రాప్ అవుతుందో, ఎక్కడ పెరుగుతుందో తెలుసుకుని ఎంట్రీ, ఎగ్జిట్ లు అయ్యేవాడు. షేర్ విలువ తక్కువ ఉన్నప్పుడు కొనేయడం.. పడిపోతుందని తెలిసి వెంటనే అమ్మేయడం చేస్తుండేవాడు.

దీని వల్ల అమాయక ఇన్వెస్టర్లు.. షేర్లు అమ్మేసి నష్టపోయేవారు. ఒకవేళ కంపెనీ దివాళా తీసే పరిస్థితి వచ్చిందనుకోండి.. ఆ విషయం ఇతనికి ఓ 3 నెలలు ముందుగానే తెలిసిపోయిందనుకోండి.. ఆ కంపెనీ షేర్లను ముందుగానే కొనేసి దివాళా తీసే సమయానికి భారీ లాభాలకు అమ్మేసుకుంటాడు. ఆ విషయం తెలియని అమాయకులు ఆ షేర్లను కొనేసి లబోదిబోమని ఏడుస్తారు. అందరి డబ్బులను ఈ ఒక్కడి బ్యాంక్ ఖాతాలోకే వెళ్తాయి. మరి ఇంతటి ఘరానా మోసగాడు భారతీయుడైతే ఏంటి? అమెరికావాడు ఐతే ఏంటి? జైల్లో పెట్టాల్సిందిగా. మరి మూన్ లైటింగ్ కి మదర్ హస్బెండ్ లా ఉన్న ఈ హనీమూన్ లైటింగ్ గాడిపై మీ అభిప్రాయం ఏమిటో కామెంట్ చేయండి.