Politics

చంద్రబాబు కుప్పం పర్యటనపై పోలీసుల ఆంక్షలు

చంద్రబాబు కుప్పం పర్యటనపై పోలీసుల ఆంక్షలు

సభలు, రోడ్ షోల నిర్వహణపై ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త ఉత్తర్వుల ఆధారంగా చంద్రబాబు పర్యటనపై నోటీసులు

రేపటి నుంచి మూడు రోజుల పాటు సొంత నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో పర్యటన పెట్టుకున్న చంద్రబాబు.

చంద్రబాబు పర్యటించే ప్రాంతాలపై ఇప్పటికే షెడ్యూల్ విడుదల

పోలీసు వర్గాలకు ముందుగానే చేరిన చంద్రబాబు పర్యటన సమాచారం.

చంద్రబాబు పర్యటనకు అనుమతి తీసుకోవాలని నేడు పలమనేరు పోలీసుల నుంచి కుప్పం టిడిపి నేతలకు నోటీస్.

రాష్ట్ర ప్రభుత్వం నిన్న తీసుకువచ్చిన జీవో నెంబర్ 1 ప్రకారం సభలు ఎక్కడ పెడుతున్నారో ముందస్తు సమాచారం ఇవ్వాలని నోటీస్

పోలీసుల అనుమతి ఉన్న చోటనే సభలు, కార్యక్రమాలు నిర్వహించాలని నోటీసులో పేర్కొన్న పలమనేరు డిఎస్పి.సుధాకర్ రెడ్డి.