Politics

అమ్మను జన్మభూమిను మరువద్దు, దుబాయిలో వెంకయ్య నాయుడు పిలుపు..

అమ్మను జన్మభూమిను మరువద్దు,  దుబాయిలో వెంకయ్య నాయుడు పిలుపు..

ప్రపంచం శర వేగంతో పురోగమిస్తున్న తరుణంలో నిపుణతకు, మేధస్సు, నిజాయితీ లకు పెట్టునిల్లయిన భారతం తన చిత్త శుద్ధి, సంక్పలం, దృఢ నిశ్చయం, పట్టుదల, కఠోర పరిశ్రమతో విశ్వగురువుగా మళ్ళీ అవతరించబోతోందని మాజీ ఉప రాష్ట్రపతి యం. వెంకయ్య నాయుడు పెర్కోన్నారు.

సాంకేతిక, సాంస్కృతిక, ఆధ్యాత్మిక, వైజ్ఞానిక రంగాల్లో భారత్ దే పై చేయి అని, ప్రపంచం మొత్తం ఇప్పుడు భారత్ వైపు చూస్తోందని చెప్పారు. తన దుబాయి పర్యటనలో భాగంగా మంగళవారం రాత్రి దుబాయిలోని తెలుగు అసోసియెషన్ ఏర్పాటు చేసిన సన్మాన సభలో ఆయన మాట్లాడుతూ పూర్వ వృత్తాంతన్ని మననం చేసుకుంటూ, మూలాలను మరవకుండా, మనుగడను కొనసాగించి పురోభివృద్ది చెందాలని పిలుపునిచ్చారు. ప్రతీ ఒక్కరూ తమ, తమ కుటుంబ, సమాజ, ప్రాంత, రాష్ట్ర మరియు దేశ శ్రేయస్సు కొరకు పాటుపడాలని ఆయన ఉధ్భోధించారు.
32

జనని, జన్మభూమి, మాతృభాష, మాతృదేశం, చదువుచెప్పిన గురువులను ఎన్నడూ మరువరాదని. మనిషికి మాతృభాష కళ్ళవంటిది అయితే ఇతర భాషలు కళ్ళజోడు వంటివని, మాతృభాషను, మన కట్టు, బొట్టు, ప్రాస, యాస, గోసలను కాపాడుకోవాలని వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు.

భారతదేశం లో వేద పురాణ కాలం నుండి మహిళకు ఒక ప్రత్యేక స్టానం ఇవ్వబడిందని, దానికి అనుగుణంగా ప్రధాని నరేంద్ర మోడి పిలిపునిచ్చినట్టుగా ఆడపిల్లలను సంరక్షించాలని, చదివించాలని, ప్రోత్సాహించాలని ఆయన కోరారు.

తెలుగు అసోసియెషన్ అధ్యక్షులు ఉగ్గిన దినేష్ కుమార్ తన స్వాగత ఉపన్యాసంలో దుబాయిలో తెలుగు ప్రవాసీయుల సంస్కృతి కొరకు చేస్తున్నప్రయత్నాలను వివరించారు.
33
అసోసియెషన్ ప్రధాన కార్యదర్శి వివేకానంద బలుసా, స్ధానిక వ్యాపారవేత్త తోట రాంకుమార్ లు వెంకయ్య నాయుడిని సన్మానించారు.

ఈ సందర్భంగా చిన్నారులు చేసిన కూచిపూడినృత్య ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణ గా నిలిచాయి.

ఈ కార్యక్రమానికి వక్కలగడ్డ వేంకట సురేష్, ఆర్జె జాహ్నవి లు సంధానకర్తలు గా వ్యవహరించగా, శ్రీధర్ దామెర్ల, విజయ్ భాస్కర్, మోహన్, అంబేడ్కర్, లతా నాగేశ్, ఫహీమ్, శ్రీనివాస్ యండూరి, సురేంద్ర దండేకుల, నూకల మురళీ కృష్ణ కార్యక్రమ నిర్వహణ బాధ్యతలను సమన్వయం చేసారు.