NRI-NRT

అమెరికాలో ఘోరం.. టీచర్ పై కాల్పులు జరిపిన బాలుడు

అమెరికాలో ఘోరం.. టీచర్ పై కాల్పులు జరిపిన బాలుడు

అగ్రరాజ్యం అమెరికాలో శుక్రవారం దారుణం చోటు చేసుకుంది. వర్జీనియాలోని రిచ్‌నెక్ ఎలిమెంటరీ స్కూల్(Richneck Elementary School)‌లో చదువుకుంటున్న ఆరేళ్ల అబ్బాయి.. తరగతి గదిలో కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో 30ఏళ్ల మహిళా టీచర్ తీవ్రంగా గాయపడింది. అయితే.. అదృష్టవశాత్తు..
ఎన్నారై డెస్క్: అగ్రరాజ్యం అమెరికాలో శుక్రవారం దారుణం చోటు చేసుకుంది. వర్జీనియాలోని రిచ్‌నెక్ ఎలిమెంటరీ స్కూల్(Richneck Elementary School)‌లో చదువుకుంటున్న ఆరేళ్ల అబ్బాయి.. తరగతి గదిలో కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో 30ఏళ్ల మహిళా టీచర్ తీవ్రంగా గాయపడింది. అయితే.. అదృష్టవశాత్తు తరగతిలోని ఇతర విద్యార్థులు క్షేమంగా ఉన్నారు. విషయం తెలిసి.. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు.. కాల్పుల్లో గాయపడిన టీచర్‌ను ఆసుపత్రికి తరలించారు. అంతేకాకుండా కాల్పులు జరిపిన ఆరేళ్ల విద్యార్థిని అదుపులోకి తీసుకున్నారు.