Sports

భారత క్రికెట్ చరిత్రలో.. కపిల్ దేవ్ కు ప్రత్యేక స్థానం.

భారత క్రికెట్ చరిత్రలో.. కపిల్ దేవ్ కు ప్రత్యేక స్థానం.

పిచ్చెక్కితే
పిచ్చెక్కించేయడమే!

⚾⚾⚾⚾⚾⚾⚾

భారత క్రికెట్లో
రెండు శకాలు..
కపిల్ కు ముందు..తర్వాత
అదే కపిల్ రికార్డు..
అంతులేని ప్రజాభిమానమే
వెలకట్టలేని రివార్డు!

బాట్స్మన్ గా సన్నీ పేరు
మారుమోగుతున్న వేళ..
భారత క్రికెట్ ను
స్పిన్ త్రయం
శాశిస్తున్న తరుణాన
కపిల్ దేవుని ఆగమనం..
ఎన్నో పాత రికార్డుల తిరోగమనం..
అసాధారణ ప్రతిభకు
చక్కని శాంపిల్..
ఈ కపిల్..
బ్యాటింగ్..బౌలింగ్
ద్వంద్వ నైపుణ్యాల కపుల్!
బహు విన్యాసాల బాహుబలి..!!

1983..
అప్పటివరకు ప్రపంచకప్పులో
భారత్ పాత్ర నామమాత్రం
కానీ కపిల్ ఇక్కడ..
వచ్చేసింది చైత్రం..
చిత్రం..మారింది
భారత క్రికెట్ గోత్రం..
విజయాల ఛత్రం..
హర్యానా హరికేన్..
ప్రపంచ క్రికెట్లో
సరికొత్త ఐకాన్!

జింబాబ్వేతో పోటీ..
జరిగింది అద్భుతం..
టపటపా వికెట్లు పడుతుంటే అభిమానుల వెన్నులో చలి..
అప్పుడు లేచింది పులి..
పరుగుల ఆకలి..
175 నాటౌట్..
ఆనాటి నుంచి
ప్రత్యర్థులకు మొదలైంది
ఘోరకలి..!

బౌలర్ గా ఉర్రూత..
బాట్స్మన్ గా ఊచకోత..
నాయకుడిగా స్ఫూర్తిదాత
మొత్తంగా కపిల్ ప్రతిభతో
భారత్ జగజ్జేత..
టెలికాస్ట్ మిస్సయిన
సంచలన ప్రదర్శన..
టివిలే లేని సగం జనాభా..
అయినా మరచిపోదు
ఆ గెలుపు..
అది ప్రతిభా..?
అంతకుమించి దిగ్భ్రమ
కపిల్ దేవుని మహిమ!

క్రికెట్ రాజకీయాలు తెలియవు అతగాడికి
పిచ్చెక్కితే పిచ్చెక్కించడమే!
కట్టిన హోటల్లోనూ
క్రికెట్ పేర్లే..
బౌన్సర్..కవర్ డ్రైవ్..
దటీజ్ దేవ్..!

🏏🏏🏏🏏🏏🏏🏏

హాపీ బర్త్ డే కపిల్…
06.01.1959

🏆🏆🏆🏆🏆🏆🏆