Devotional

రాతి రూపంలో ఉంటే పూజిస్తాం.. బ్రతికి ఉంటే చంపేస్తాం…

రాతి రూపంలో ఉంటే  పూజిస్తాం.. బ్రతికి ఉంటే చంపేస్తాం…

🌼ఎలుక రాతిది అయితే
పూజిస్తాం ప్రాణాలతో
వుంటే తరిమేస్తం……

🌼పాము రాతిది అయితే
పాలు పోస్తం
ప్రాణాలతో వుంటే
కొట్టి చంపేస్తాం……..

🌼తల్లిదండ్రులు
ఫోటోలో ఉంటే
దండ వేసి
దండం పెడతాం
ప్రాణాలతో వుంటే
వృద్ధాశ్రమంలో
వదిలేస్తాం…….

🌼చనిపోయిన వాడికి
భుజాన్ని అందిస్తాం
బతికి ఉన్న వాడికి
చేయూతను ఇవ్వం……..

🌼రాయిలో దైవత్వం
వుందని తెలుసుకున్నాం
మనిషిలో మానవత్వాన్ని
గుర్తించలేక పోతున్నాం……….

🌼జీవం లేని వాటిపై
భక్తి ఎందుకు
ప్రాణంతో ఉంటే
ద్వేషం ఎందుకు……..
మనిషిగా
ఆలోచిద్దాం కొద్దిగా..!👏👏🌼

🌼👏👏
🌼👏👏