Politics

తెదేపాలోకి కాంగ్రెస్ నేత మాజీ మంత్రి శైలజానాథ్???

తెదేపాలోకి కాంగ్రెస్ నేత మాజీ మంత్రి శైలజానాథ్???

ఏపీలో వచ్చే ఎన్నికల్లో పార్టీల పోటీ గురించి వస్తున్న మీడియా కథనాల్లో గానీ, జనంలో జరుగుతున్న చర్చల్లో గానీ కాంగ్రెస్ పార్టీ ఊసే లేదు…

అసలు ఆ పార్టీ ఉందని కూడా జనం అనుకోవడంలేదు. అసలు ఆ పార్టీలో ఉన్న నాయకులకే పార్టీ అంటే ఆసక్తి లేదు…

ఎప్పుడైతే యూపీఏ తెలుగు రాష్ట్రాన్ని విడదీసిందో అప్పుడే తెలంగాణలో, ఏపీలో కాంగ్రెస్ పతనం ప్రారంభమైంది…

తెలంగాణలో అంతో ఇంతో నయం, ఏదో హడావుడి చేస్తోంది. ఏపీలో పూర్తి నిశ్శబ్దం. రాష్ట్రం విడిపోగానే చాలామంది కాంగ్రెస్ నాయకులు జగన్ పార్టీలో చేరిపోయారు. మిగిలినవారు నామ్ కే వాస్తే ఉన్నారు…

రాష్ట్రం విడిపోయినప్పుడు పీసీసీ చీఫ్ గా ఉన్న మాజీ మంత్రి రఘువీరా రెడ్డి అస్త్ర సన్యాసం చేశారు. ఆయన పార్టీ జోలికి కూడా రావడంలేదు…

తరువాత పగ్గాలు తీసుకున్న మరో మాజీ మంత్రి శైలజానాథ్ ను అధిష్టానం హఠాత్తుగా తొలగించింది. గిడుగు రుద్రరాజుకు ఆ బాధ్యతలు అప్పగించింది…

శైలజానాథ్ తన తొలగింపును అవమానకరంగా ఫీలవుతున్నట్లున్నారు. అందుకే పార్టీ మారాలని ఆలోచిస్తున్నట్లుగా అనిపిస్తోంది, దానిమీద సంకేతాలు ఇచ్చారు…

తానూ వచ్చే ఎన్నికల్లో శింగనమల నుంచే పోటీ చేస్తానని, కానీ ఏ పార్టీ నుంచి పోటీ చేసే సంగతి మూడు నెలల తరువాత చెబుతానని అన్నారు…

అంటే పార్టీ మారే ఉద్దేశం ఉన్నట్లే కదా. టీడీపీ నుంచి పోటీ చేస్తారా అని అడిగితే ఇప్పుడే చెప్పను. మూడు నెలల తరువాత చెబుతానని అన్నారు…

బహుశా టీడీపీలో చేరవచ్చన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.