Politics

మోదీ హయంలో భారీగా పెరిగిన హజ్ యాత్రికుల కోటా..

మోదీ హయంలో భారీగా పెరిగిన హజ్ యాత్రికుల కోటా..

భారత దేశ చరిత్రలో ప్రప్రధమంగా భారతీయ హజ్ కోటాను సౌదీ అరేబియా భారీగా పెంచింది. ఈ సంవత్సరం భారతదేశం నుండి హజ్ యాత్రకు ఒక లక్షా 75 వేల 25 మంది కోటాగా సౌదీ అరేబియా ప్రభుత్వం నిర్ణయించింది. ప్రధాని నరేంద్ర మోదీ గల్ఫ్ దేశాల రాజకుటుంబాలతో నెరుపుతున్న ప్రత్యెక సంబంధాల కారణాన కోటాలో భారీగా పెంపుదల జరిగింది.
​ఈ మెరకు సోమవారం ఇరు దేశాల మధ్య జరిగిన ద్వైపాక్షిక ఒప్పందంలో సౌదీ అరేబియా హాజ్ వ్యవహారాల సహాయం మంత్రి అబ్దుల్ ఫత్తా మాష్ మరియు భారతీయ కాన్సుల్ జనరల్ మోహమ్మద్ షాహీద్ ఆలంలు సంతకాలు చేసారు.
​కోటా సరిపడకపోవడంతో ఔత్సిహిక యాత్రికులందర్ని లక్కీ లాటరీ విధానంలో ఎంపిక చేస్తూ పంపిస్తున్నారు, కానీ ఇప్పుడు కోటా పెరిగినందున ఎక్కువ సంఖ్యలో హజ్ యాత్రకు పంపించడానికి వీలు ఏర్పడింది.
​గత సంవత్సరం కోవిడ్ కారణాన భారతీయుల కోటా 79,237 గా ఉంది. అంతకు ముందు ఒక లక్షా 25 వేలు ఉన్నా కోవిడ్ కారణాన హజ్ యాత్ర రద్దయింది. కాంగ్రేస్ హాయంలో అత్యధికంగా 2010లో ఒక లక్షా 26 వేల 018 గా ఉంది, అది చరిత్రలో ఎక్కువ కానీ కరుడుగట్టిన హిందుత్వవాదిగా పేరున్న మోదీ హాయంలో ఇప్పటి వరకు అత్యధిక సంఖ్యలో ముస్లింలు హజ్ యాత్రకు వెళ్ళె ఆవకాశం దక్కనుంది. అమెరికా డాలరుతో రూపాయి పతనం, మక్కా మరియు మదీన పుణ్యక్షేత్రాలలో అదనపు సేవలు, రుసుంల కారణాన హాజ్ యాత్ర కూడ ఈ సారిగా భారీగా పెరుగనుంది.
​హాజ్ అపరేషన్ నిర్వహణలో అవినీతి అరోపణల నేపథ్యంలో బిజెపి నాయకత్వం అచీతూచి హజ్ కమిటి చెర్మెన్ ను ఎంపిక చేసింది. తెలంగాణలో ఎమ్మెల్యెల కొనుగోలులో విచారణ ఎదుర్కోంటున్న బిజెపి సంస్ధాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి బి.యల్. సంతోష్ హజ్ కమిటి చెర్మెన్ ఎంపికలో కీలక పాత్ర వహించారు.