Devotional

TNI ఆధ్యాత్మిక వార్తలు.. భోగి పండుగ ప్రాముఖ్యత.

TNI  ఆధ్యాత్మిక వార్తలు.. భోగి పండుగ ప్రాముఖ్యత.

భోగి అంటే ఏమిటి ? | ఈ భోగి పండుగ ఎలా వచ్చింది ? | భోగి మంట , భోగిపళ్ళ వెనుక దాగిన రహస్యాలు ఏమిటి ?

పెద్ద పండుగగా జరుపుకునే మూడు రోజుల సంక్రాంతి పండుగలో మొదటి రోజును మనం భోగి పండుగగా జరుపుకుంటాం.

దక్షిణాయనంలో సూర్యుడు రోజు రోజుకి భూమికి దక్షిణం వైపుగా కొద్ది కొద్దిగా దూరమవుతూ దక్షిణ అర్ధగోళంలో భూమికి దూరం అవడం వలన భూమిపై బాగా చలి పెరుగుతుంది. ఈ చలి వాతావరణాన్ని తట్టుకునేందుకు ప్రజలు సెగ కోసం భగ భగ మండే చలి మంటలు వేసుకునేవారు, ఉత్తరాయణం ముందు రోజుకి చలి విపరీతంగా పెరగడం ఈ చలిని తట్టుకునేందుకు భగ భగ మండే మంటలు, దక్షిణాయనంలో ప్రజలు తాము పడిన కష్టాలను, బాధలను అగ్ని దేవుడికి ఆహుతి చేస్తూ రాబోయే ఉత్తరాయణంలో సుఖసంతోషాలను ఇమ్మని కోరుతూ వేసే మంటలు భోగి మంటలు అంటారని మన అందరికి తెలిసింది. మరైతే ఈ పండుగ రోజున భోగి మంటలు ఎందుకు వేస్తారో వాటి పురాణం మరియు “శాస్త్రీయ కారణాలు” తెలుసుకుందాం..

“భుగ్” అనే సంస్కృత పదం నుండి భోగి అనే పదం వచ్చింది. భోగం అంటే సుఖం.

పూర్వం ఈ దినమే శ్రీ రంగనధాస్వామి లో గోదాదేవి లీనమై భొగాన్ని పొందిందని దీని సంకేతంగా భోగి పండగ ఆచరణలోకి వచ్చిందనేది మన పురాణ గాద.. శ్రీ మహా విష్ణువు వామన అవతారం లో బలి చక్రవర్తిని పాతాళం లోకి తొక్కిన పురాణ గాద మనందరికీ తెలిసిందే అయితే తరువాత బలి చక్రవర్తికి పాతాళ రాజుగా ఉండమని, ప్రతి సంక్రాంతికి ముందు రోజున పాతాళం నుండి భూలోకానికి వచ్చి ప్రజల్ని ఆశిర్వదించమని వరమివ్వడం జరిగిందట. బలిచక్రవర్తి రాకను ఆహ్వానించడానికి భోగి మంటలు వేస్తారని మన పురాణాలలో చెప్పబడింది. కృష్ణుడు ఇంద్రుడికి ఒక పాఠం నేర్పుతు గోవర్ధన పర్వతం ఎత్తిన పవిత్రమైన రొజు ఇదే. శాపవశంగా పరమేశ్వరుని వాహనమయిన బసవన్నని భూమికి పంపించి రైతుల పాలిట దైవాన్ని భూమికి దిగి వచ్చిన రొజు ఇదే అనేవి కూడా పురాణాల గాద.

సాదారణంగా అందరు చెప్పేది, ఇది చలి కాలం కనుక వెచ్చదనం కోసం మంటలు వేస్తారని. కానీ నిజానికి భోగి మంటలు వెచ్చదనం కోసం మాత్రమే కాదు, ఆరోగ్యం కోసం కూడా. ధనుర్మాసం నేలంతా ఇంటి ముందు పెట్టిన గొబ్బెమ్మలను పిడకలుగా చేస్తారు. వాటినే ఈ భోగి మంటలలో వాడుతారు. దేశి ఆవు పేడ పిడకలని కాల్చడం వలన గాలి శుద్ధి అవుతుంది. సుక్ష్మక్రిములు నశిస్తాయి. ప్రాణవాయువు గాలిలోకి అధికంగా విడుదల అవుతుంది. దాని గాలి పీల్చడం ఆరోగ్యానికి మంచిది. చలికాలం లో అనేక వ్యాదులు వ్యాపిస్తాయి. ముఖ్యంగా శ్వాసకు సంబంధించిన అనేక రోగాలు పట్టి పిడిస్తాయి. వాటికి ఔషదంగా ఇది పని చేస్తుంది. భోగి మంటలు పెద్దవిగా రావడానికి అందులో రవి, మామిడి, మేడి మొదలైన ఔషద చెట్ల బెరడ్లు వేస్తారు. అవి కాలడానికి ఆవు నెయ్యని వేస్తారు. అగ్ని హోత్రంలో వేయబడిన ప్రతి 10 గ్రాముల దేశి ఆవు నెయ్యి నుంచి 1 టన్ను ప్రాణవాయువు (oxygen) ను విడుదల చేస్తుంది. ఈ ఔషద మూలికలు ఆవు నెయ్యి, ఆవు పిడకలని కలిపి కాల్చడం వలన విడుదల అయ్యే గాలి అతి శక్తివంతమైంది. మన శరీరం లోని 72,000 నడులలోకి ప్రవేశించి శరీరాన్ని శుభ్ర పరుస్తుంది. ఒకరికి రోగం వస్తే దానికి తగిన ఔషదం ఇవ్వవచ్చు, అదే అందరికి వస్తే అందరికి ఔషదం సమకూర్చడం దాదాపు అసాధ్యం. అందులో కొందరు వైద్యం చెయించుకొలేని పేదలు కూడా ఉండవచ్చు. ఇదంతా ఆలోచించిన మన పెద్దలు అందరు కలిసి భోగి మంటల్లో పాల్గొనే సంప్రదాయాన్ని తెచ్చారు. దాని నుండి వచ్చే గాలి అందరికి ఆరోగ్యాన్ని ఇస్తుంది. కులాలకు అతీతంగా అందరు ఒక చోట చేరడం ప్రజల మద్యన దూరాలను తగ్గిస్తుంది, ఐక్యమత్యాని పెంచుతుంది. ఇది ఒకరకంగా అగ్ని దేవుడికి ఆరాధనా, మరోరకంగా గాలిని శుద్ధి చేస్తూ వాయుదేవునికి ఇచ్చే గౌరవం కూడా.

కాని మనం ఫాషన్, సృజనాత్మకత పేరుతో రబ్బరు టైర్లను పెట్రోలు పోసి తగల బెట్టి, దాని విష వాయువులను పిలుస్తూ, కాలుష్యాన్ని చేస్తూ మన ఆరోగ్యాన్ని తగలేసుకుంటున్నాం. పర్యావరణాన్ని నాశనం చేస్తునం. ఉన్న రోగాలే కాక కొత్త రోగాలని తెచ్చుకుంటున్నాం. ఇక భోగి మంటల్లో పనికిరాని వస్తువులని కాల్చండి అని వింటుంటాం. పనికి రాణి వస్తువులు అంటే ఇంట్లో ఉండే ప్లాస్టిక్ కవర్లు, వైర్లు లాంటివి కావు.

ఇక్కడ మనం చరిత్రకి సంబంధించిన ఒక విషయం గుర్తుకు తెచుకోవాలి. మన భారతదేశం లో ఉన్న జ్ఞాన సంపదను నాశనం చేస్తే కాని భారతదేశాని ఆక్రమించుకోలేమనుకున్న బ్రిటిషు దండుగులు, భోగి మంటల్లో పాత సామాన్లు తగల బెట్టాలనే నెపంతో అమాయక ప్రజలు ఎన్నో వందల సంవత్సరాలుగా వారసత్వంగా కాపాడుకుంటూ వస్తున్నఅతి ప్రాచిన తాళపత్ర గ్రంధాలను భోగి మంటల్లో వేసి కల్పించేసారు. నిజానికి భోగి మంటల్లో కచాల్సింది పాత వస్తువులని కాదు , మనలోని పనికి రాని అలవాట్లు, చెడు లక్షణాలు. అప్పుడే మనకున్న పీడ పోయి మానసిక ఆరోగ్యం, విజయాలు వస్తాయి.

🕉️ దేవాలయాల్లో ఇచ్చే తీర్థప్రసాదాన్ని నెత్తికి రాసుకుంటున్నారా?

🔅 దేవాలయాలకు వెళ్తే కుంకుమ ప్రసాదం తీసుకుంటాం. తీర్థ ప్రసాదం తీసుకుంటాం. కుంకుమను నుదుటన పెట్టుకుంటాం. అదే తీర్థాన్ని స్వీకరిస్తాం. అంతటితో ఆగకుండా ఆ చేతిని తలపై రాసుకుంటాం. అయితే ఈ పద్ధతి మంచిది కాదని పండితులు అంటున్నారు. చేతులతో ప్రార్థనలు చేస్తే సరి, కానీ తీర్థాన్ని తీసుకున్న తరువాత చేతులను తలపై రాయకూడదని శాస్త్రాలు చెప్తున్నాయట. ముఖ్యంగా గంగా జలంతో అభిషేకం చేసిన తీర్థాన్ని మాత్రమే తలపై రాసుకోవచ్చునని పండితులు అంటున్నారు. అంతేకానీ గుడిలో ఇచ్చే తీర్థాన్ని నెత్తిపై రాసుకోవడం మంచిది కాదు.

సాధారణంగా గుడిలో తీర్థాన్ని పంచామృతంతో తయారు చేస్తారు. అందులోని పంచదార, తేనే వంటివి మన జుట్టుకు మంచిది కాదు. తులసి తీర్థం కూడా తీసుకున్నప్పుడు తలకు రాసుకోవడం మంచిది కాదని పండితులు సూచిస్తున్నారు. ఇంకా తీర్థం తీసుకున్న తర్వాత చేతికి ఎంగిలి అంటుకుంటుంది. ఆ చేయినే తలకు రాసుకోవడం మంచి ఫలితాలను ఇవ్వదని వారు చెప్తున్నారు. అందుచేత తీర్థం తీసుకున్న చేతిని సాధారణంగా నీటితో కడుక్కోవాలని ఆధ్యాత్మిక పండితులు సెలవిస్తున్నారు. తీర్థం తీసుకున్న తర్వాత ఆ చేతిని నెత్తికి రాసుకోవడం చేయకూడదు. దోషమవుతుంది. జేబు రుమాలుతో తుడుచుకుని తీసుకోవాలి. లేదా కండువాతో తుడుచుకోవాలని వారు సూచిస్తున్నారు.🙏

🕉 సంక్రాంతి నాడు గంగా నదిలో స్నానం చేయాలని చెప్పడం వెనుక పురాణ గాథ ఇదే..

🔆 మకర సంక్రాంతి రోజున గంగానదిలో స్నానం చేయడం ద్వారా ఏడు జన్మల పాపాలు పోతాయని చెబుతారు.
గంగాస్నానానికి వెళ్లలేకపోతే ఇంట్లోనే స్నానం చేసే నీటిలో గంగాజలం కలుపుకుని స్నానం చేయాలని చెబుతారు.

🔆 హిందూ గ్రంథాలలో పేర్కొన్న వివరాల ప్రకారం, కపిల మహర్షి నాటి కాలంలో గంగాసాగర్ దగ్గర ఆశ్రమం నిర్మించి తపస్సు చేసుకునేవాడు.
నాటి రోజుల్లో సాగర రాజు కీర్తి మూడు లోకాలలోనూ వ్యాపించింది.
రాజులందరూ సాగరుడు చేసే దానధర్మాలను, సత్కార్యాల మహిమను గానం చేసేవారు.
దీనిని చూసిన స్వర్గలోకపు రాజు ఇంద్రుడు చాలా ఆందోళన చెందాడు.

🔆 ఈ సమయంలో సాగర రాజు అశ్వమేధ యాగాన్ని నిర్వహించాడు.ఇంద్రుడు అశ్వమేధ యాగ గుర్రాన్ని దొంగిలించి, కపిలముని ఆశ్రమం దగ్గర కట్టేశాడు.
అశ్వమేధ యాగానికి తెచ్చిన గుర్రాన్ని వెతకడానికి సాగర రాజు తన 60 వేల మంది కుమారులను పంపాడు.
ఆ కుమారులందరూ గుర్రాన్ని వెతుక్కుంటూ కపిల ముని ఆశ్రమానికి చేరుకున్నారు.
అక్కడ అశ్వమేధ యాగం కోసం తెచ్చిన గుర్రాన్ని చూశాడు.దీంతో వారు కపిలముని ఈ గుర్రాన్ని దొంగిలించారని ఆరోపించారు.
కోపోద్రిక్తుడైన కపిల ముని సాగర రాజు 60 వేల మంది కుమారులందరినీ కాలి బూడిద కమ్మంటూ శపించాడు.
వెంటనే సాగరరాజు కపిల ముని ఆశ్రమానికి చేరుకుని, తన కుమారులను క్షమించాలని అభ్యర్థించాడు.

🔆 అప్పుడు కపిల ముని అతనితో నీ కుమారులందరి మోక్షానికి ఒకే ఒక మార్గం ఉంది.
మీరు మోక్షదాయిని అయిన గంగను భూమిపైకి తీసుకురండి అని చెప్పాడు.
సాగర రాజు మనవడు రాజు అన్షుమాన్, గంగామాతని భూమిపైకి తీసుకువచ్చే వరకు తమ రాజవంశానికి చెందిన ఏ రాజు శాంతియుతంగా కూర్చోకూడదని కపిల ముని సూచనపై ప్రతిజ్ఞ చేసుకున్నాడు.
అతను తపస్సు చేయడం ప్రారంభించారు.
రాజు అన్షుమాన్ మరణం తరువాత, భగీరథుడు గంగామాతను తన తపస్సుతో సంతోషపెట్టాడు.

🔆 భగీరథుడు తన తపస్సుతో శివుడిని కూడా ప్రసన్నం చేసుకున్నాడు, తద్వారా శివుడు గంగామాత తన జఠాఝూటం ద్వారా భూమిపైకి దిగేలా చేశాడు.
గంగామాతను కేశాల్లో పెట్టుకుని శివుడు గంగాధరుడయ్యాడు.
గంగామాత భూమిపైకి దిగింది.

🔆 ముందు భగీరథ రాజు వెళుతుండగా వెనుక భూమిపై గంగామాత ప్రవహించడం ప్రారంభించింది.
భగీరథుడు గంగను కపిల ముని ఆశ్రమానికి తీసుకువచ్చాడు, అక్కడ గంగామాత సాగర రాజు 60 వేల మంది కుమారులకు మోక్షాన్ని ఇచ్చింది.సాగర రాజుకు గల 60 వేల మంది పుత్రులకు గంగామాత మోక్షాన్ని ఇచ్చిన రోజే మకర సంక్రాంతి అని చెబుతారు అక్కడి నుండి గంగ ముందుకు సాగి సముద్రాన్ని చేరింది.

🔆 అలా కలిసే ప్రదేశాన్ని గంగా సాగర్ అని అంటారు.మకర సంక్రాంతి రోజున గంగాసాగర్ లేదా గంగా నదిలో స్నానం చేయడం మోక్షానికి దారి తీస్తుంది.పాపాలను కడిగివేస్తుందని చెబుతారు.