DailyDose

కెనడా. వైభవంగాTACA. సంక్రాంతి సంబరాలు..

కెనడా. వైభవంగాTACA. సంక్రాంతి సంబరాలు..

కెనడాలో అంగరంగ వైభవంగా తాకా వారి 2023 సంక్రాంతి సంబరాలు
తెలుగు అలయన్స్అఫ్ కెనడా (తాకా) అంగ రంగ వైభోగంగా సంక్రాంతి సంబరాలు మైఖేల్ పవర్ స్కూల్, ఎటోబీకోక్, కెనడా లో జనవరి 15,2023 న జరుపుకున్నారు . ఈ సంబరాలకు -15 డిగ్రీల చలిలో కూడా దాదాపు 1000 మందికి పైగా తెలుగు వారందరు వచ్చి వేడుకలను విజయవంతం చేసారు. ఈ కార్యక్రమానికి అనిత సజ్జ, మహమ్మద్ ఖాజిల్,  విద్య భవనం, మరియు ప్రియ టేకి  వ్యాఖ్యాతగా వ్యవహరించారు.

మొదటగా తాకా అధ్యక్షులు కల్పనా మోటూరి, జ్యోతి సామంతపూడి, రజని లయం,జయశ్రీ తిరుచునాపల్లి,పల్లవి తెరాల కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలనంతో ప్రారంభించారు. కల్పనా గారు అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసి తాకా చేస్తున్న ఎన్నో కార్యక్రమాలు గురించి వివరించారు. తాకా కార్యదర్శి ప్రసన్న తిరుచిరాపల్లి కార్యక్రమానికి విచ్చేసిన అతిధులను అందరినీ ఆహ్వానించి సంక్రాంతి పండుగ ప్రాముఖ్యతను వివరించారు. 25 కి పైగా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, కళా నృత్యాలు, సినిమా పాటలు, డాన్సులుతో  దాదాపు 4 గంటల పాటు ఉల్లాసంగా కార్యక్రమం జరిగింది.

తాకా వారు కార్యక్రమానికి వచ్చిన చిన్న పిల్లలకు డైరెక్టర్ అనిత సజ్జ మరియు కల్పన మోటూరి భోగి పళ్ళ కార్యక్రమమును నిర్వహించి మంగళ వాయిద్యాల మధ్య ముత్తైదువులచే చిన్నారులను ఆశీర్వదింప చేసారు. తాకా కార్యవర్గ సభ్యులు శృతి ఏలూరి, రాణి మద్దెల గారు సంక్రాంతి పండుగ మీద ముగ్గుల పోటీలు, చిన్నపిల్లలకు చిత్ర గీత పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. 
 
ప్రతి సంవత్సరం తాకా వారు ఆనవాయితీ ప్రకారం టొరంటో కాలమానంలో ప్రచురించిన తెలుగు క్యాలెండర్ ను సంక్రాంతి పండుగ నాడు ఆవిష్కరిస్తారు. అలాగే ఈ సంవత్సరం కూడా టొరంటో తెలుగు తిధులు, నక్షత్రాలు కు అనుగుణంగా ప్రచురించిన తెలుగు క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భం గా తెలుగు క్యాలెండర్ ముద్రణకు సహకరించిన, టొరంటోకు తీసుకువచ్చిన రాకేష్ గరికిపాటి గారికి, ప్రసన్న తిరుచిరాపల్లి గారికి కల్పనా మోటూరి గారు కృతజ్ఞతలు తెలియజేసారు. తాకా 2023 ప్రధాన దాత రామ్ జిన్నాల తెలుగు క్యాలెండరును ఆవిష్కరించారు. తాకా డైరెక్టర్ గణేష్ తెరాల అద్వర్యం లో అచ్చ  తెలుగు వంటకాలు మరియు అరిసెలతొ  తాకా వారు భోజనాలను ఏర్పరిచారు. 

ఈ కార్యక్రమ విజయవంతానికి కృషి చేసిన కార్యదర్శి ప్రసన్న తిరుచిరాపల్లి, కోశాధికారి మల్లికార్జున చారి పదిర, ఉపాధ్యక్షులు నాగేంద్ర హంసాల, డైరెక్టర్స్ అనిత సజ్జ, శృతి ఏలూరి, గణేష్ తెరాల,రాణి మద్దెల మరియు ట్రస్టీ చైర్మన్ మునాఫ్ అబ్దుల్, సభ్యులు రాఘవ్ అల్లం, సురేష్ కూన, వాణి జయంతి, ప్రవీణ్ పెనుబాక మరియు వ్యవస్థాపక చైర్మన్  రవి వారణాసి, సభ్యులు చారి సామంతపూడి, శ్రీనాథ్  కుందూరు, అరుణ్ లయం, లోకేష్ చిల్లకూరు, రమేష్ మునుకుంట్ల, రాకేష్ గరికపాటి, రామచంద్రరావు దుగ్గినను అధ్యక్షులు కల్పన మోటూరి గారు అభినందించారు.

అటు పిమ్మట కెనడా మరియు భారత దేశ భక్తి గీతాలు ఆలపించడం జరిగింది. చివరిగా కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ, ప్రధాన దాత రామ్ జిన్నాల, మరియు ఇతర దాతలకు, వీక్షించిన అతిధులకు  తాకా కార్యదర్శి ప్రసన్న తిరుచిరాపల్లి గారు వందన సమర్పణ తో కార్యక్రమాన్ని జయప్రదం గా ముగించారు.