DailyDose

ఐదు కనుమలలో ప్రయాణం చేయరాదు

ఐదు కనుమలలో ప్రయాణం చేయరాదు

సంప్రదాయంగా ఐదు కనుమలలో ప్రయాణం చేయరాదని అంటారు. ‘కనుమ నాడు కాకైనా బయలుదేరదు’ అని సామెత కూడా ప్రసిద్ధం.

శవదాహే గ్రామదాహే సపిండీకరణే తథా! శక్త్యుత్సవే చ సంక్రాంతా నగంతవ్యం పరేహని!!

శవదహనం జరిగిన మరుసటి రోజు,
గ్రామంలో అగ్ని ప్రమాదం జరిగిన మరుసటి దినం,
సపిండీకరణమైన తరువాతి రోజు (పన్నెండవ రోజు కర్మలో),
అమ్మవారి జాతర అయిన మరుసటి రోజు,
సంక్రాంతి తరువాతి రోజు –
వీటిని కనుమలు అంటారు.
ఈ రోజుల్లో ప్రయాణించరాదు.