DailyDose

ఫ్రాన్స్ లో ఘనంగా సంక్రాంతి సంబరాలు

ఫ్రాన్స్ లో ఘనంగా సంక్రాంతి సంబరాలు

ఫ్రాన్స్ తెలుగు కమ్యూనిటీ ఆధ్వర్యంలో ఫ్రాన్స్ లో ఘనంగా సంక్రాతి సంబరాలు జరుపుకోవడం జరిగినది , దాదాపు 150 మందికి పైగా తెలుగు వారందరు వచ్చి వేడుకలను విజయవంతం చేసారు. ఈ కార్యక్రమానికి హేమ , ప్రియాంక వ్యాఖ్యాతగా వ్యవహరించారు.

మొదటగా ఫ్రాన్స్ తెలుగు కమ్యూనిటీ అధ్యక్షులు నీల శ్రీనివాస్ , ఫణి , ప్రియదర్శిని , రవి , విక్రమ్ ఉపేంద్ర నాతి , నర్సింహా , హేమంత్, ప్రియాంక , భువన్,శ్రీకాంత్ , ప్రేమసాయి కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలనంతో ప్రారంభించారు. నీల శ్రీనివాస్ గారు అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసి ఫ్రాన్స్ తెలుగు కమ్యూనిటీ చేస్తున్న ఎన్నో కార్యక్రమాలు గురించి వివరించారు. ఫ్రాన్స్ తెలుగు కమ్యూనిటీ వైస్ ప్రెసిడెంట్ ప్రియదర్శిని ,కార్యదర్శి ఫణి మరియు రవి కార్యక్రమానికి విచ్చేసిన అతిధులను అందరినీ ఆహ్వానించి సంక్రాంతి పండుగ ప్రాముఖ్యతను వివరించారు. 15కి పైగా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, కళా నృత్యాలు, సినిమా పాటలు, డాన్సులుతో దాదాపు 6 గంటల పాటు ఉల్లాసంగా కార్యక్రమం జరిగింది.

ఫ్రాన్స్ తెలుగు కమ్యూనిటీ వారు కార్యక్రమానికి వచ్చిన చిన్న పిల్లలకు  భోగి పళ్ళ కార్యక్రమమును నిర్వహించి మంగళ వాయిద్యాల మధ్య ముత్తైదువులచే చిన్నారులను ఆశీర్వదింప చేసారు. ఫ్రాన్స్ తెలుగు కమ్యూనిటీ కార్యవర్గ సభ్యులు ప్రియాంక , రవి , ఉపేంద్ర నాతి , విక్రమ్ గారు సంక్రాంతి పండుగ మీద ముగ్గుల పోటీలు, చిన్నపిల్లలకు గాలిపట్టాలు పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు.

ఈ కార్యక్రమ విజయవంతానికి కృషి చేసిన నీల రజిత , కమల , ప్రియాంక , స్వాతి , హేమ, సంధ్య , సంగీత , స్వర్ణ , సునీత , సంతోష్ ,రవి , హనుమాన్ , సత్య , దిలీప్ , విజయ్, వీర రెడ్డి , చంద్రశేఖర్ , సందీప్ , తరుణ్ తేజ , అనుదీప్ ,రానా ప్రతాప్ గారి ల ను ఫ్రాన్స్ తెలుగు కమ్యూనిటీ అభినదించడం జరిగినది .

చివరిగా కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ, వీక్షించిన అతిధులకు ఫ్రాన్స్ తెలుగు కమ్యూనిటీ కార్యదర్శి ఫణి కృష్ణ గారు వందన సమర్పణ తో కార్యక్రమాన్ని జయప్రదం గా ముగించారు