Politics

వివేకా హత్య కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

వివేకా హత్య కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

Updates

వివేకానంద రెడ్డి హత్యకేసు నిందితుడు గంగిరెడ్డికి మంజూరైన బెయిల్ రద్దు అంశంపై విచారణను తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేసిన సుప్రీంకోర్టు.

గంగిరెడ్డి బెయిల్ రద్దు చేయాలని సిబిఐ దాఖలు చేసిన పిటిషన్‌పై తీర్పు వెలువరించిన సుప్రీంకోర్టు.

ట్రయల్‌ కోర్టు ఇచ్చిన బెయిల్ మంజూరు చేస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై తెలంగాణహైకోర్టులో మరోసారి విచారణ జరపాలని తీర్పు

కేసు ట్రయల్ ను తెలంగాణకు బదిలీ చేసిన నేపథ్యంలో బెయిల్ రద్దు అంశాన్ని కూడా తెలంగాణ హైకోర్టులో తేల్చాలని ఆదేశం

నాన్ బెయిలబుల్ నేరానికి పాల్పడిన సందర్భంలో చార్జిషీటు దాఖలు చేయలేదన్న కారణంతో కేసులోని మెరిట్స్‌ను పరిగణలోకి తీసుకోకుండా డిఫాల్ట్ బెయిల్ మంజూరు చేయడం తగదు

కేసులోని మెరిట్స్ ఆధారంగా బెయిల్ అంశంపై మరోసారి విచారణ చేపట్టాలి

డిఫాల్ట్ బెయిల్ పొందిన వ్యక్తి విచారణకు సహకరించని పక్షంలో బెయిల్ రద్దు చేసే అవకాశం ఉంటుంది

90 రోజులలోపు దాఖలు చేయనందున చార్జిషీట్‌ను సమర్పించిన తర్వాత బెయిల్‌ను రద్దు చేయవచ్చా అనే ప్రశ్న ఇక్కడ తలెత్తింది.

ఒక వ్యక్తి డిఫాల్ట్ బెయిల్‌పై విడుదలైన తర్వాత.. విచారణకు సహకరించక పోవడం వంటి మెరిట్‌, ఇతర కారణాలతో దానిని తిరస్కరించకూడదు అన్న నిషేధం లేదు.

నిందితుడు నాన్ బెయిలబుల్ నేరానికి పాల్పడ్డాడు, అతని బెయిల్ మంజూరుకు మెరిట్‌నే పరిగణించాల్సి ఉంటుంది.

కేసులో ఆధారాలు బలంగా ఉన్నప్పుడు… చార్జిషీట్ దాఖలు చేయకపోవడం సరైన పద్దతి కాదు.

చట్టం ప్రకారం, మెరిట్‌ ఆధారంగా… బెయిల్‌ రద్దు విషయాన్ని తిరిగి పరిశీలించడానికి పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టుకు రిమాండ్ చేసిన జస్టస్‌ ఎంఆర్‌ షా ధర్మాసనం.

తదుపరి విచారణ తెలంగాణ హైకోర్టులో విచారణ జరగాలన్న సుప్రీంకోర్టు.