DailyDose

వీణ వాయించే ఆంజనేయుడు ఈ ఆలయంలో ఉన్నాడు

వీణ వాయించే ఆంజనేయుడు ఈ ఆలయంలో ఉన్నాడు

🔱శృంగీశ్వరాలయం🔱

చెన్నై పూనమల్లి – పేరంబాక్కం వెళ్ళే మార్గంలో  పూనమల్లి నుండి సుమారు 20 కి.మీ.దూరంలో శృంగేశ్వరుని ఆలయం వున్నది.  ఈ ఆలయానికి అనేక విశిష్టతలు ఉన్నాయి.

వీణ వాయించే ఆంజనేయస్వామి ఈ ఆలయంలో దర్శనమివ్వడం ఒక అపూర్వ విశేషం.
ఎముకల వ్యాధులను గుణపరిచే ప్రదోష దర్శనాలయంగా, మూలా నక్షత్రం వారు పూజించ వలసిన విశిష్ట ఆలయంగా   అనేక మహిమలు కలిగిన ఆలయం ఈ శృంగేశ్వరాలయం.

మహావిష్ణువు మోహినీ అవతారంలో
దానవులను మరిపించి అమృతం దేవతలకు పంచిన పురాణగాధ అందరికి తెలిసినదే.
ఈవిధంగా దానవులను మోసం చేసినందువలన,
మోహిని రూపం నుండి తన  నిజ స్వరూపానికి
మారడంలో కలిగిన సమస్యల నుండి విముక్తి పొందడానికి మహావిష్ణువు  ఈ ఆలయానికి వచ్చి, శివలింగాన్ని ప్రతిష్టించి పూజించిన ఫలితంగా
తన స్వరూపాన్ని పొందాడు.  అందువలన
ఈ ఊరు ‘మెయ్పేడు ‘ అని పిలువబడుతున్నది.

తిరువేలంగాడులో పరమశివుడు తాండవం  నృత్యం చేసిన సమయంలో   ప్రమదగణాలలో ఒకడైన శృంగి శివుని తాండవంలో మైమరచిపోయి మృదంగ గతులను తప్పుగా వాయించాడు.
అందుకు శిక్షగా   పరమశివుని తాండవ నృత్యాన్ని పూర్తిగా దర్శించలేక పోయాడు. ఆ కొఱత తీరేలా
మయ్పేడు ఆలయంలో తన తాండవాన్ని ఈశ్వరుడు శృంగికి చూపించి అనుగ్రహించాడు.
అందువలన ఈ ఆలయంలోని ఈశ్వరునికి శృంగీశ్వరుడనే పేరు కలిగిందని స్ధల పురాణం తెలుపుతున్నది. ఇక్కడి
అమ్మవారి పేరు పుష్పకుచాంబాళ్.
ఆలయానికి ఉత్తర తూర్పు దిశగా ఒక మండపం వున్నది. ఆ మండపం సన్నిధిలో
మహిమాన్వాతమైన ఒక చిన్న లింగ రూపంలో
దర్నమిస్తున్నాడు వీరబాలీశ్వరుడు.
ఈ ఈశ్వరుని  దర్శిస్తున్న భంగిమలో
ఒక చిన్న  వేదికపై వీణ వాయిస్తున్న ఆంజనేయస్వామి వారి మూర్తి ఈ ఆలయంలోని ఒక ప్రత్యేక విశేషం.

సీతాదేవిని వెతుకుతూ హనుమంతుడు
లంకకి వెళ్ళే సమయంలో లంకకి వెళ్ళే దారి తెలియక తపిస్తూ యీ ఆలయంలో వీరబాలీశ్వరుని సన్నిధిలో
వీణవాయిస్తూ అమృతవర్షిణి రాగంతో
పరమశివుని ప్రార్ధించి ఆ స్వామి దయవలన లంకకి వెళ్ళాడని ఒక గాధ ప్రచారంలో ఉన్నది.

ఈనాటికీ  ఆంజనేయ స్వామి సంధ్యా సమయంలో సూక్ష్మ రూపంలో అమృతవర్షిణి రాగాన్ని వినిపిస్తాడని ఐహీకం.

సంగీత రంగంలో కృషి చేస్తూ పేరు ప్రఖ్యాతులు పొందాలనుకునేవారు ఈ ఆలయానికి వచ్చి వీరబాలేశ్వరుని ముందు పాడితే వారి
కోరికలు తప్పక నెరవేరుతాయని భక్తులు ధృఢంగా నమ్ముతారు.
ఆవిధంగానే ధ్వజస్తంభానికి దగ్గర వున్న నవవ్యాకరణ బండపై ఆశీనులై  ప్రదోష సమయంలో  నందిని, పరమశివుని  పూజిస్తే ఎముకల, మోకాళ్ల సంబంధిత
వ్యాధులు గుణమౌతాయని అందరి విశ్వాసం

శృంగీశ్వరుడు  మొదటిసారిగా మూలా నక్షత్రంలో దర్శనమిచ్చినందున మూలా నక్షత్రాన్ని జన్మనక్షత్రంగా  దోష పరిహారం చేసుకునే ఆలయంగా ఈ శృంగీశ్వరుని ఆలయం ప్రసిధ్ధికెక్కింది.