Politics

పవన్ కళ్యాణ్ పై పోటీ చేస్తా.. కాసుకో అంటున్న ఆలీ.

పవన్ కళ్యాణ్ పై పోటీ చేస్తా.. కాసుకో అంటున్న ఆలీ.

సినీ నటుడు , ఏపీ ప్రభుత్వ సలహాదారు అలీ సంచలన వ్యాఖ్యలు చేశారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై పోటీ చేయడానికి తాను సిద్ధమని ఆయన ప్రకటించారు. సీఎం ఆదేశిస్తే ఎవరిపైనైనా పోటీ చేస్తానని అలీ స్పష్టం చేశారు. రాష్ట్రానికి ఎవరు మేలు చేస్తారో ప్రజలకు తెలుసునని ఆయన వ్యాఖ్యానించారు. విమర్శలు ప్రతి విమర్శలు చేయటం సాధారణమని.. సినిమాలు వేరు, రాజకీయాలు వేరని అలీ అన్నారు. చిత్తూరు జిల్లా నగరి పర్యటనలో భాగంగా మంగళవారం అలీ ఈ వ్యాఖ్యలు చేశారు