DailyDose

ఎన్టీఆర్కు కుటుంబ సభ్యులు ప్రముఖులు నివాళి

ఎన్టీఆర్కు కుటుంబ సభ్యులు ప్రముఖులు నివాళి

ఎన్టీఆర్ కు టీడీపీ నేతల ఘన నివాళి
null
పూలమాలతో నివాళులర్పించిన టీడీపీ అధినేత చంద్రబాబు,పార్టీ నేతలు

రక్తదాన శిబిరం ప్రారంభం

గుంటూరు, సూర్య ప్రత్యేక ప్రతినిధి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు, పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారకరామారావు 27 వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ కు తెలుగుదేశం పార్టీ ఘన నివాళులర్పించింది. మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్ లో తెలుగుదేశం పార్టీ జాతీయాధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు, పార్టీ నాయకులతో కలిసి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ భవన్ లో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని చంద్రబాబు ప్రారంభించారు. రక్తదానం చేస్తున్న పార్టీ కార్యకర్తలు, అభిమానులను అభినందించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు మాట్లాడారు.
null
సైకో పాలనను బంగాళాఖాతంలో కలిపితేనే ఎన్టీఆర్ కు నిజమైన నివాళి

టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజారపు అచ్చెన్నాయుడు

రాష్ట్రాన్ని చీడపీడలా పట్టి పీడిస్తున్న జగన్ సైకోపాలనను బంగాళాఖాతంలో కలిపితేనే ఎన్టీఆర్ కు నిజమైన నివాళి అర్పించినట్లవుతుంది. దీనికోసం పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు, యావత్ రాష్ట్ర ప్రజలు ప్రతినబూనాలి. సంక్షేమాన్ని తెలుగురాష్ట్రంలో తీసుకొచ్చింది ఎన్టీఆర్, తెలుగుదేశం పార్టీ. సంక్షేమం గురించి నేడు సైకో సీఎం మాట్లాడడం హాస్యాస్పదంగా ఉంది. సంక్షేమానికి తూట్లు పొడుస్తూ రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్న ఫేక్ సీఎం గురించి రాష్ట్రమంతా చెప్పుకుంటోంది. రాష్ట్రంలోని తెలుగుప్రజలంతా 40సంవత్సరాలు వెనక్కి వెళ్లి ఒకసారి ఆలోచించాలి. తెలుగుజాతి అవమానాలపాలైన విషయాలను ఒకసారి ప్రతిఒక్కరం స్మరించుకోవాలి. అటువంటి చీకటి రోజుల్లో తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ స్థాయిలో నిలబెట్టిన మహోన్నత నేత ఎన్టీఆర్. ఎన్టీఆర్ అంటే తెలుగుజాతి ఆత్మగౌరవానికి నిదర్శనం. చెప్పిన మాటను నూటికి నూరుశాతం అమలు చేసిన నేత ఎన్టీఆర్. సమాజమే దేవాలయం-ప్రజలే దేవుళ్లు అని నమ్మి అన్ని వర్గాలకు సమాన అవకాశాలు కల్పించింది ఎన్టీఆర్, తెలుగుదేశం పార్టీ. రూ.2కే కిలోబియ్యం ఇచ్చి పేదవాడి ఆకలి తీర్చింది ఎన్టీఆర్. పక్కా ఇళ్లు, వస్త్రాలు, పేదవాడికి సంక్షేమాన్ని తెచ్చింది ఎన్టీఆర్. 1987లో మండల వ్యవస్థను తెచ్చింది టీడీపీ. మండల కార్యాలయాలన్నింటినీ ఒకే చోటికి తెచ్చింది ఎన్టీఆర్. జన్మభూమి పథకంతో అధికారులను ప్రజల వద్దకు తెచ్చి వాళ్ల సమస్యల్ని పరిష్కరించే కార్యక్రమాన్ని తెచ్చింది ఎన్టీఆర్, టీడీపీ. పరిపాలన వికేంద్రీకరణ గురించి సైకో సీఎం నేడు మాట్లాడడం హాస్యాస్పదంగా ఉంది.
null
1982కు ముందున్న చీకటి రోజులు నేడు కనిపిస్తున్నాయి

వికలాంగుల సంఘం మాజీ అధ్యక్షులు కోటేశ్వరరావు

1982కు ముందు రాష్ట్రంలో ఉన్న చీకటి రోజులను మించిన పరిస్థితులు నేడు కనిపిస్తున్నాయి. 1983లో ఎన్టీఆర్ సభలకు ఎంత మంది జనం వచ్చారో..అంతకు మించిన జనం నేడు చంద్రబాబు సభల్లో కనిపిస్తున్నారు. పిల్లల దగ్గర్నుండి వృద్దుల వరకు సభలకు పోటెత్తుతున్నారు. ఎందుకు వస్తున్నారంటూ ఆరా తీస్తే జగన్ రెడ్డి సైకో పాలన పోవాలి..చంద్రన్న పాలన పోవాలి అని చెబుతున్నారు. చంద్రబాబు అంతర్జాతీయస్థాయిలో చేపట్టిన రాజధాని నిర్మాణాన్ని జగన్ రెడ్డి కుప్పకూల్చాడు. పోలవరాన్ని గోదావరిలో ముంచుతున్నాడు. ఇలాంటి దుష్టపాలనను అంతం చేసి, చంద్రన్న పాలనను తెస్తేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది.

సభలోని కౌరవులను ఇంటికి సాగనంపాలి

మాజీ ఎమ్మెల్యే చల్లా జగదీశ్వరి

14సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబును శాసనసభలో అవమానపరిచిన కౌరవులందరినీ ఇళ్లకు సాగనంపితేనే ఎన్టీఆర్ కు నిజమైన నివాళి అర్పించినట్లవుతుంది. ఎన్టీఆర్ స్వర్గస్తులైన సమయంలో నేను సర్పంచ్ గా కొనసాగుతున్నాను. అలాంటి నన్ను చంద్రబాబు అన్నవరం నుండి ఎమ్మెల్యేగా నిలబెట్టి గెలిపించారు. మహిళలకు సమాన అవకాశాలు కల్పించేది కేవలం తెలుగుదేశం పార్టీనే.
null
నిజాయితీకి ప్రతిరూపం తెలుగుదేశం పార్టీ

మాజీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారి

తెలుగుదేశంపార్టీ నిజాయితీకి నిలువెత్తు ప్రతిరూపం. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వారి కుటుంబ సభ్యులు ఏనాడూ సచివాలయానికి వచ్చి ఏ పనీ చేయించుకోలేదనే విషయాన్ని రాష్ట్ర ప్రజలు గమనించాలి. ఏపీకి అంతర్జాతీయ ఖ్యాతిని తెచ్చింది చంద్రబాబు. ఎన్టీఆర్ అంటే ఒక సింహం. రాజకీయాల్లో గెలుపోటములను సమానంగా స్వీకరించే నాయకులు చంద్రబాబు. మహిళలకు అన్ని రంగాల్లో పెద్దపీఠ వేసిన నేత చంద్రబాబు. నన్ను ఎమ్మెల్సీ, మహిళా కమిషన్ చైర్ పర్సన్, పార్టీలో పెద్ద పెద్ద పదవులు ఇచ్చి ప్రోత్సహించారు. వైసీపీ ప్రభుత్వం ఎన్ని నిర్బంధాలు, ఆటంకాలు, దాడులు చేస్తున్నా ప్రాణాలు అడ్డుపెట్టి పార్టీ జెండాను నిలబెడుతున్న తెలుగుదేశం కార్యకర్తలందరికీ అభినందనలు.
null
కాంగ్రెస్ ను మించిన సైకో పాలన జగన్ రెడ్డిది

టీడీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు ఎం.ఎస్.రాజు

1982కు ముందు కాంగ్రెస్ లో కొనసాగిన నిరంకుశ పాలనను మించి, జగన్ రెడ్డి నేడు తన సైకో పాలనను కొనసాగిస్తున్నాడు. కాంగ్రెస్ పాలనలో పేద, బడుగు, బలహీన వర్గాల జీవితాలు చీకటిలో మగ్గిపోయాయి. అటువంటి సందర్భంలో కాంగ్రెస్ చీకటిపాలనను కూకటివేళ్లతో సహా కూల్చి, పేదవాళ్ల జీవితాల్లో వెలుగులు నింపిన మహానేత ఎన్టీఆర్. పేదవాడికి మూడు పూటలా పట్టెడన్నం, నివసించడానికి ఓ ఇల్లు, కట్టుకోవడానికి వస్త్రాలు తెచ్చింది ఎన్టీఆర్. అన్ని వర్గాల ప్రజలకు ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు రాజకీయాల్లో ప్రవేశం కల్పించి సముచిత స్థానాన్ని ఇచ్చింది ఎన్టీఆర్. సైకో సీఎం జగన్ రెడ్డి ప్రభుత్వాన్ని గద్దె దింపి, తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీస్తేనే నిజమైన సంక్షేమం రాష్ట్ర ప్రజలకు అందుతుంది.
null