DailyDose

ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ప్రత్యేక కథనం

ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ప్రత్యేక కథనం

నందమూరి తారకరామారావు

నిమ్మకూరులో జనించిన
నిష్టాగరిష్టుడు
సంసార సారథిగా సైకిలుపై పాలు అమ్మినాడు
మీసాలతో ఆడవేషము వేసినాడు
నాటకాలలో ఆరితేరినవాడు
హితులు స్నేహితులు చెప్పగా
సినిమాలకు వెళ్ళమని కోరగా
బయలుదేరే మదరాసుకు
తన తలరాత పరీక్షకు
మనదేశం సినిమాతో ప్రయాణము
ఆరు దశాబ్దాలు అలరించిన
సినీ గమనము
శ్రీరాముడిగా కృష్ణుడిగానే కాక
అనేక పౌరాణిక పాత్రలలో
పరకాయ ప్రవేశము చేసి
నటనలో జీవించి
జానపద చిత్రాలలో రాజుకైనా
మంత్రికైనా సేనా నాయకుడిగా
నైన ఏ పాత్రనైన మెప్పించిన నటుడు
క్షామములో కరువు కష్టకాల్లో
అలమటీంచే ఆంధ్రప్రదేశ్ ను
తన వెంట నడచిన నటులతో
జోల పట్టి ఆదుకున్న దయార్ద్ర
హృదయుడు
కాంగ్రెస్ హాయములో తెలుగు
వారికి జరుగుతున్న అవమానాలను చూసి
తెలుగు దేశం పార్టీ స్థాపించి
ఆంధ్ర అంతటా పర్యటించి
తొమ్మిది నెలల్లో విజయభేరీ మ్రోగించి
ప్రభుత్వాన్నిఏర్పరిచినధీశాలి
పేదల కడుపు నింప రెండు
రూపాయలకు కిలో బియ్యము
అందించిన కారుణ్యశీలి
ఆడపిల్లలకు ఆస్తిలో వాటా
కల్పించిన ఆర్ద్రత గలవాడు
రెడ్డి కరణ వ్యవస్థను రూపుమాపిన రుద్రుడు
విశ్వ విఖ్యాత నటసార్వభౌముడు
తెలుగు జాతి తెలుగు నేల
తెలుగు సినిమా తెలుగు ప్రజా
ఉన్నంత కాలము
తరగదు రామారావు యశము
నేటి తరానికి మార్గ నిర్దేశకుడు
రేపటి తరానికి మార్గ దర్శకుడు
పాలకులకు నిఘంటువతడు
ఎప్పటికి మరచిపోనీ మహానటుడు ఎన్. టి. ఆర్
ఆ పేరు వింటేనే వస్తుంది హుషారు!!