DailyDose

మహారాష్ట్రలోని రాయగఢ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది

మహారాష్ట్రలోని రాయగఢ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది

గురువారం తెల్లవారుజామున ముంబై-గోవా హైవేపై కారు ట్రక్కును ఢీకొనడంతో తొమ్మిది మంది మృతి చెందారు. వీరిలో ఒక చిన్నారి, ముగ్గురు మహిళలు ఉన్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉదయం 5 గంటల ప్రాంతంలో హైవేపై మాంగావ్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. రత్నగిరి జిల్లాలోని గుహగర్‌కు వెళ్తున్న కారు.. ముంబైకి వెళ్తున్న ట్రక్కును ఢీకొన్నది. ఈ ప్రమాదంలో కారు నుజ్జు నుజ్జు అయింది. మృతుల్లో ఐదుగురు పురుషులు, ముగ్గురు మహిళలు ఉన్నారు. ప్రమాదంలో గాయపడిన చిన్నారిని ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. రోడ్డు ప్రమాదం నేపథ్యం ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడగా.. కాసేపటి తర్వాత హైవేపై ట్రాఫిక్ కదలికలు పునఃప్రారంభించబడ్డాయి. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.