DailyDose

హైదరాబాదులో భారీ అగ్ని ప్రమాదం

హైదరాబాదులో భారీ అగ్ని ప్రమాదం

నాంపల్లి ఎగ్జిబిషన్ పార్కింగ్లో అగ్ని ప్రమాదం హైదరాబాద్ గగన్ విహార్ భారీ ప్రమాదం తప్పింది. నాంపల్లి ఎగ్జిబిషన్ కోసం కేటాయించిన పార్కింగ్లో పార్క్ చేసిన ఓ ఎలక్ట్రిక్ కారు నుంచి ఒక్కసారిగా మంటలు వచ్చాయి. ఈ ప్రమాదంలో నాలుగు కార్లు పూర్తిగా దగ్ధం కాగా.. ఫైర్ సిబ్బంది వెంటనే అప్రమత్తమై మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనతో నాంపల్లి పరిసరాల్లో ట్రాఫిక్ భారీగా నిలిచింది. నిన్న సికింద్రాబాద్లోనూ భారీ అగ్నిప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే.