Devotional

TNI ఆధ్యాత్మిక వార్తలు.. చాగంటి కి టీటీడీ కీలక పదవి

TNI ఆధ్యాత్మిక వార్తలు.. చాగంటి కి టీటీడీ కీలక పదవి

టీటీడీ ధార్మిక సలహాదారుగా చాగంటి కోటేశ్వరరావు

ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు టీటీడీ ధార్మిక కార్యక్రమాల సలహాదారుగా నియమితులయ్యారు. చాగంటిని సలహాదారుగా నియమిస్తూ హెచ్డీపీపీ కార్యనిర్వాహక కమిటీ నిర్ణయం తీసుకుందని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా శ్రీవారి భక్తులు ఉన్నారని… వారి కోసం గత మూడేళ్లుగా వివిధ పారాయణాలను నిర్వహిస్తున్నామని ఆయన చెప్పారు.

ఈ కార్యక్రమాలను మరింత ముందుకు తీసుకెళ్లడానికి చాగంటిని సలహాదారుగా నియమించామని తెలిపారు. తిరుపతిలోని పద్మావతి గెస్ట్ హౌస్ లో నిన్న ఎస్వీబీసీ, హెచ్డీపీపీ కార్యనిర్వాహక కమిటీల సమావేశాలు జరిగాయి. ఈ సమావేశంలోనే చాగంటిని సలహాదారుగా నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో హిందూ ధర్మప్రచారం కార్యక్రమాలను స్థానిక యువత భాగస్వామ్యంతో విస్తృతంగా నిర్వహించాలని నిర్ణయించారు.

*రేపు అనగా 21/01/2023 పుష్య అమావాస్య మకర సంక్రమణ అనంతరం వచ్చే ప్రథమ అమావాస్య. దీని విశేషం భూమి, సూర్యుడు, చంద్రుడు ఒకే సమగ్ర రేఖపైన రావడం. మిగతా అమావాస్యలందు సూర్య చంద్రులు ఒక రేఖలో వస్తారు. ఖగోళ శాస్త్ర ప్రకారం చంద్రుడు భూమిని చుడుతూ సూర్యుని భూమితో సహా సంచరించడం మనకు తెలిసినదే. సూర్యుడు బుద్ధి, ప్రజ్ఞ, ఆరోగ్యం మనకు ప్రసాదిస్తే, చంద్రుడు మనో కారకుడు. చంద్రుడు మనసుకు సంతోషం ఆహ్లాదం ప్రశాంతత స్వచ్ఛమైన జ్ఞానం ఇస్తాడు. సూర్యుడు పితృ కారకుడు కూడాను. చంద్రుడు మాత్రు కారకుడు. అందువల్లే సూర్య చంద్ర ఆరాధన ముఖ్యత్వంగా పరిగణింప బడుతున్నది. ఈ అమావాస్య రోజున చేసే పితృ తర్పణాదులు అధికమైన ఫలము ఇచ్చును. ఉత్తరాయణములో వచ్చే ప్రథమ అమావాస్య చాలా విశిష్టమైనది. తండ్రి లేని ప్రతి ఒక్కరు తప్పక పితృ దేవతలకు తర్పణాదులు ఇచ్చి వారి ఆశీస్సులు గైకొని సుఖ సంతోషములతో వర్ధిల్లాలని ఆశిస్తున్నాము.