జూబ్లీహిల్స్‌లో డిప్యూటీ తహశీల్దార్ హల్‌చల్ చేశారు. అర్థరాత్రి ఐఏఎస్ అధికారిణి స్మితాసబర్వాల్ ఇంట్లోకి చొరబడేందుకు యత్నించారు. దీంతో డిప్యూటీ తహశీల్దార్ ఆనంద్‌ను భద్రతా సిబ్బంది అడ్డుకుంది. ఘటనకు సంబంధించి జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో స్మితాసబర్వాల్ ఫిర్యాదు చేశారు. ఆనంద్ సహా మరో వ్యక్తిపై కేసు నమోదైంది.
అర్ధరాత్రి ఘటనపై ట్విట్టర్‌లో స్పందించారు స్మితాసబర్వాల్. రాత్రి అత్యంత బాధాకరమైన ఘటన జరిగిందని.. ఓ వ్యక్తి తన ఇంట్లోకి చొరబడ్డాడని తెలిపింది. అప్రమత్తతతో తన ప్రాణాలను కాపాడుకున్నానని వివరించింది. ఎంత సురక్షితంగా ఉన్నారని భావించినా.. ఇంటికి తాళాలు వేసుకోవాలని సూచించారు.
డిప్యూటీ తహసీల్దార్ ఆనంద్ హల్‌చల్.. ఐఏఎస్ స్మితా సబర్వాల్ ఇంట్లోకి చొరబడి
