Politics

హైదరాబాదు నుంచి సిద్దిపేట, కరీంనగర్ మీదుగా కొండగట్టు చేరుకున్న పవన్ కళ్యాణ్

హైదరాబాదు నుంచి సిద్దిపేట, కరీంనగర్ మీదుగా కొండగట్టు చేరుకున్న పవన్ కళ్యాణ్

కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి వారిని దర్శించుకున్న జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్
• పవన్ కళ్యాణ్ గారికి ఘనంగా స్వాగతం పలికిన ఆలయ అధికారులు
• స్వామివారి దర్శన అనంతరం పార్టీ ప్రచార రథం వారాహికి వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు జరిపిన జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్
• జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారితో వారాహి వాహనానికి ప్రత్యేక పూజలు దగ్గరుండి చేయించి, వాహనం ఎదుట సంకల్పసిద్ధి చేయించిన వేద పండితులు.
• ప్రత్యేకంగా స్వామివారి యంత్రాన్ని వారాహికి కట్టి, సింధూరంతో శ్రీరామదూత్ అని రాశారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన పండితులు
• పూజలు అనంతరం విఘ్నాలు తొలగిపోయేలా, విజయాలు సిద్ధించేలా గుమ్మడికాయ కొట్టి వారాహిని ప్రారంభించిన వేద పండితులు
• వారాహి ప్రారంభం అనంతరం వేద పండితుల ఆశీర్వచనం అందుకున్న పవన్ కళ్యాణ్
• ప్రారంభసూచకంగా వారాహి ఎక్కి వాహనాన్ని పరిశీలించిన పవన్ కళ్యాణ్