Movies

సీఎం జగన్ ను కలిసిన సిరివెన్నెల కుటుంబం

సీఎం జగన్ ను కలిసిన సిరివెన్నెల కుటుంబం

సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌ను కలిసిన దిగ్గజ సినీ గేయ రచయిత, పద్మశ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి సతీమణి, కుటుంబ సభ్యులు.

సిరివెన్నెల కుటుంబాన్ని ఆదుకున్నందుకు సీఎం శ్రీ వైఎస్‌ జగన్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపిన కుటుంబ సభ్యులు.

దివంగత శ్రీ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డితో సిరివెన్నెల అనుబంధాన్ని ముఖ్యమంత్రితో పంచుకున్న కుటుంబ సభ్యులు.

సిరివెన్నెల అనారోగ్య సమయంలో చికిత్స ఖర్చులను ప్రభుత్వమే భరించేలా నిర్ణయం తీసుకోవడం, ఆ కుటుంబానికి విశాఖలో ఇంటి స్ధలం మంజూరు చేయడంపై సీఎం శ్రీ వైఎస్‌ జగన్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపిన సీతారామశాస్త్రి కుటుంబ సభ్యులు.

సిరివెన్నెల కుటుంబానికి అవసరమైన సాయం చేసేందుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తరపున పూర్తి సహకారం ఇవ్వనున్నట్లు ఆయన కుటుంబానికి భరోసానిచ్చిన సీఎం శ్రీ వైఎస్‌ జగన్‌.

సీఎంని కలిసిన సిరివెన్నెల సతీమణి పద్మావతి, కుమారులు యోగేశ్వర శర్మ, రాజా, కుమార్తె శ్రీలలితా దేవి, సిరివెన్నెల సోదరుడు సీఎస్‌.శాస్త్రి.
సీఎం జగన్ ను కలిసిన సిరివెన్నెల కుటుంబం