Devotional

నేటి మీ రాశి ఫలితాలు.26-1-2023

నేటి మీ రాశి ఫలితాలు.26-1-2023

🕉️హిందూ ధర్మం🚩
🌹 శుభోదయం 🌹
*✍🏻 *26.01.2023 ✍🏻**
*🗓 *నేటి రాశి ఫలాలు 🗓**

🐐 మేషం
ఈరోజు (26-01-2023)

ముందుచూపుతో వ్యవహరిస్తే ఆటంకాలు దూరం అవుతాయి. కీలక పనులను ప్రారంభించే ముందు సాధకబాధకాలను అంచనా వేసి ముందుకు సాగాలి. కుటుంబ సభ్యుల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. మిత్రుల వల్ల మేలు జరుగుతుంది. ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. శివారాధన శుభప్రదం.
🐐🐐🐐🐐🐐🐐🐐

🐂 వృషభం
ఈరోజు (26-01-2023)

ఒక శుభవార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. భవిష్యత్ ప్రణాళికలు వేస్తారు. బంధుప్రీతి ఉంది. వస్త్ర, ధన లాభాలు ఉన్నాయి. దుర్గాస్తుతిని చదివితే బాగుంటుంది.
🐂🐂🐂🐂🐂🐂🐂

💑 మిధునం
ఈరోజు (26-01-2023)

ప్రారంభించిన పనుల్లో ఆటంకాలను అధిగమిస్తారు. మీ
ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. కుటుంబ సభ్యులతో ఒక శుభవార్తను పంచుకుంటారు. శుభకార్యక్రమాలలో పాల్గొంటారు. శ్రీవారి సందర్శనం శుభప్రదం.
💑💑💑💑💑💑💑

🦀 కర్కాటకం
ఈరోజు (26-01-2023)

కీలకమైన పనులను ప్రారంభిస్తారు. మీ ధర్మం మిమ్మల్ని ఉన్నతుల్ని చేస్తుంది. మొహమాటం వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఆహార నియమాలను పాటించాలి. శ్రీవేంకటేశ్వర స్వామిని సందర్శించడం మంచిది.
🦀🦀🦀🦀🦀🦀🦀

🦁 సింహం
ఈరోజు (26-01-2023)

కొన్ని పరిస్థితులు మిమ్మల్ని నిరుత్సాహపరుస్తాయి.
గతంలో నిర్లక్ష్యం చేసిన కొన్ని అంశాలు ఇబ్బంది పెడతాయి. కలహ సూచన ఉంది. గోసేవ చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు.
🦁🦁🦁🦁🦁🦁

💃 కన్య
ఈరోజు (26-01-2023)

కుటుంబసభ్యుల సలహాలతో విజయాలు సాధిస్తారు. వ్యాపారం కలిసి వస్తుంది. స్వల్ప ధనలాభం, మనఃసంతోషం కలుగుతాయి. అదృష్ట యోగం ఉంది.
అష్టలక్ష్మీ స్తుతి మంచిది.
💃💃💃💃💃💃💃

⚖ తుల
ఈరోజు (26-01-2023)

అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు వింటారు. తోటివారి సహకారంతో పనులు పూర్తవుతాయి. | అవసరానికి తగిన సహాయం అందుతుంది. వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు.
ప్రారంభించిన పనులలో కొన్ని ఇబ్బందులు ఎదురైనా శని శ్లోకం చదవాలి.
⚖⚖⚖⚖⚖⚖⚖

🦂 వృశ్చికం
ఈరోజు (26-01-2023)

అధికారులతో ఆచితూచి వ్యవహరించాలి. కీలకమైన విషయాల్లో జాగ్రత్త అవసరం. అనవసర ఖర్చులు పెరిగే అవకాశాలు ఉన్నాయి. వైరాగ్యాన్ని దరిచేరనీయకండి. సాయిబాబా వారి నామాన్ని జపించడం శుభకరం.
🦂🦂🦂🦂🦂🦂🦂

🏹 ధనుస్సు
ఈరోజు (26-01-2023)

కీలక వ్యవహారాల్లో శ్రద్ధగా ముందుకు సాగాలి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ముఖ్య వ్యవహారాల్లో పెద్దల సలహాలు అవసరం అవుతాయి. నవగ్రహ స్తోత్రం చదవడం మంచిది.
🏹🏹🏹🏹🏹🏹🏹

🐊 మకరం
ఈరోజు (26-01-2023)

చేసిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. స్థిరాస్తి కొనుగోలు విషయాలు లభిస్తాయి. మీ స్వధర్మం
మిమ్మల్ని కాపాడుతుంది. సూర్యాష్టకం చదివితే శుభఫలితాలు కలుగుతాయి.
🐊🐊🐊🐊🐊🐊🐊

🏺 కుంభం
ఈరోజు (26-01-2023)

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో సందర్భానుసారంగా ముందుకు సాగితే శుభఫలితాలు అందుకుంటారు. మీ పట్టుదలే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ఆర్థికంగా మిశ్రమకాలం. లక్ష్మీధ్యానం శుభప్రదం.
🏺🏺🏺🏺🏺🏺🏺

🦈 మీనం
ఈరోజు (26-01-2023)

మనోధైర్యం ముందుకు నడిపిస్తుంది. మీరు ఆశించిన ఫలితాలు వస్తాయి. కార్యక్రమ ప్రణాళికతో పూర్తిచేయగలుగుతారు. శరీర సౌఖ్యం ఉంది. తల్లిదండ్రుల ఆశీర్వచనాలు మేలు చేస్తాయి.
🦈🦈🦈🦈🦈🦈🦈